తెలుగు రాష్ట్రాల్లో బంగారం తగ్గిందా.. పెరిగిందా? | Gold and Silver Price Today On 4 December 2024 | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాల్లో బంగారం తగ్గిందా.. పెరిగిందా?

Dec 4 2024 12:52 PM | Updated on Dec 5 2024 12:16 PM

Gold and Silver Price Today On 4 December 2024

Gold Price Today: దేశంలో రోజుకో రకంగా మారుతున్న బంగారం ధరలు నేడు  (డిసెంబర్‌ 4) నిలకడగా కొనసాగుతన్నాయి. బంగారం ధరలు ద్రవ్యోల్బణం , గ్లోబల్ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్‌లతో సహా అనేక అంతర్జాతీయ కారకాల ప్రభావంపై ఆధారపడి ఉంటాయి.

తెలుగు రాష్ట్రాలోని హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా   వివిధ ప్రాంతాల్లో  ఈరోజు పసిడి 10 గ్రాముల ధరలను పరిశీలిస్తే.. 22 క్యారెట్ల బంగారం రూ.71,300 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.77,780 వద్ద స్థిరంగా ఉన్నాయి.

మరోవైపు చెన్నైలో మాత్రంలో 22 క్యారెట్ల బంగారం ధరలో అత్యంత స్వల్ప పెరుగుదల కనిపించింది. 10 గ్రాములకు రూ.10 పెరుగుదల నమోదైంది. ఇక్కడ 22, 24 క్యారెట్ల బంగారం ధరలు వరుసగా రూ.71,310, రూ.77,780 వద్ద ఉన్నాయి.

అదే విధంగా దేశ రాజధాని ఢిల్లీ ప్రాంతంలోనూ బంగారం ధరలను చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,450, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.77,930 లుగా కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: చైనాలో భారీ బంగారు నిక్షేపం.. ఇక ఇదే టాప్‌!

మరోవైపు వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు నిలకడగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగడం ఇది వరుసగా రెండో రోజు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.99,500 వద్ద ఉంది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement