బంగారమే.. ఆనందమే..! | Gold and Silver Price Today On 14 December 2024 | Sakshi
Sakshi News home page

డబుల్‌ హ్యాపీ.. బంగారం.. మళ్లీ భారీ పతనం

Dec 14 2024 11:36 AM | Updated on Dec 14 2024 3:12 PM

Gold and Silver Price Today On 14 December 2024

Gold Price Today: దేశంలో బంగారం ధరలు మళ్లీ భారీగా దిగివచ్చాయి. వరుసగా రెండో రోజూ గణనీయంగా క్షీణించాయి. దేశవ్యాప్తంగా శనివారం (డిసెంబర్‌ 14) పసిడి భారీగా తగ్గాయి. రెండు రోజుల్లో బంగారం 10 గ్రాములకు రూ.1500 పైగా పతనం కావడంతో కొనుగోలుకు ఇదే మంచి తరుణమని పసిడి ప్రియులు భావిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల​లో..
హైదరాబాద్‌, విశాఖపట్నం, విజయవాడ సహా  రెండు తెలుగు రాష్ట్రాలోని  వివిధ ప్రాంతాల్లో 22 క్యారెట్ల బంగారం  10 గ్రాముల ధర  రూ.71,400, 24 క్యారెట్ల బంగారం ధర రూ.77,890 లుగా ఉన్నాయి. నిన్నటితో పోల్చితే వీటి ధరలు వరుసగా రూ.900, రూ.980 చొప్పున పడిపోయాయి.

ఇక దేశంలోని ఇతర ప్రాంతాల్లో  ఈరోజు పసిడి ధరలు ఎలా ఉన్నాయో పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.71,550 వద్ద, 24 క్యారెట్ల పసిడి రూ.78,040 వద్ద ఉన్నాయి. వీటి ధరలు క్రితం రోజుతో పోల్చితే రూ.900, రూ.980 మేర దిగివచ్చాయి. చెన్నై, బెంగళూరు, ముంబై ప్రాంతాలలో 22 క్యారెట్ల బంగారం రూ.900 తగ్గి రూ.71,400 వద్దకు, అలాగే 24 క్యారెట్ల పసిడి రూ.600 తగ్గి రూ.77,890 వద్దకు వచ్చాయి.

ఇదీ చదవండి: మహిళలకు కొత్త బ్యాంక్‌ అకౌంట్‌.. అదిరిపోయే బెనిఫిట్లు

వెండి కూడా..
దేశవ్యాప్తంగా వెండి ధరలు (Silver Price Today) కూడా నేడు పతనమయ్యాయి. నిన్నటితో పోల్చితే కేజీకి రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.1,00,000 వద్దకు రాగా ఢిల్లీలో రూ.92,500 వద్దకు క్షీణించింది.

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement