బంగారం భారీ రేట్లు.. డిమాండ్‌లో మార్పులు | Elevated gold rates could see shifts in demand segments Titan | Sakshi
Sakshi News home page

బంగారం భారీ రేట్లు.. డిమాండ్‌లో మార్పులు

Jun 29 2025 10:16 AM | Updated on Jun 29 2025 12:28 PM

Elevated gold rates could see shifts in demand segments Titan

బంగారం రేట్లు భారీ స్థాయిలో పెరిగిన నేపథ్యంలో వివిధ సెగ్మెంట్లలో డిమాండ్‌లో మార్పులు కనిపించవచ్చని బ్రాండెడ్‌ ఆభరణాల తయారీ దిగ్గజం టైటాన్‌ తమ 2024–25 వార్షిక నివేదికలో పేర్కొంది. భౌగోళిక–రాజకీయ అంశాలు, స్థూల ఆర్థిక అనిశ్చితుల వల్ల పసిడి రేట్లు అధిక స్థాయిలోనే కొనసాగవచ్చని వివరించింది.

రిటైల్‌ విస్తరణ, కొత్త కలెక్షన్లు, మార్కెటింగ్‌పై మరింతగా పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రాధాన్యతనివ్వడాన్ని కొనసాగిస్తామని టైటాన్‌ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరంలో పసిడి రేట్లు భారీ స్థాయిలో ఉన్నప్పటికీ జ్యవెలరీ డివిజన్‌ ఆరోగ్యకరంగా 20 శాతం, సేమ్‌–స్టోర్‌ అమ్మకాల వృద్ధి 14 శాతం మేర నమోదైందని వివరించింది. తనిష్క్‌ సబ్‌–బ్రాండ్‌ అయిన మీయా రూ. 1,000 కోట్ల మార్కును దాటగా, క్యారట్‌లెన్‌ విభాగం ఆదాయం 30 శాతం పెరిగిందని పేర్కొంది.

Advertisement
 
Advertisement
Advertisement