అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో | Anant Ambani In Range Rover Video Viral | Sakshi
Sakshi News home page

అనంత్ అంబానీ ఎలాంటి కారులో కనిపించారో చూసారా.. వీడియో

Jan 5 2024 9:10 PM | Updated on Jan 5 2024 9:25 PM

Anant Ambani In Range Rover Video Viral - Sakshi

భారతదేశంలో పరిచయం అవసరం లేని కుటుంబాలలో ఒకటి 'ముకేశ్ అంబానీ' ఫ్యామిలీ. అత్యంత సంపన్నులైన అంబానీ కుటుంబం విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రపంచంలో ఖరీదైన భవనాల్లో ఒకటైన 'యాంటిలియా' నివసిస్తున్న వీరు ఖరీదైన అన్యదేశ్య కార్లను వినియోగిస్తారు. 

ఇటీవల ముకేశ్ అంబానీ చిన్న కొడుకు 'అనంత్ అంబానీ' ఖరీదైన రోల్స్ రాయిస్ కారు వదిలి.. అంతకంటే తక్కువ ధర కలిగిన రేంజ్ రోవర్ కారులో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అనంత్ అంబానీ ఎప్పుడూ రోల్స్ రాయిస్ కారులో ప్రయాణిస్తుంటాడు, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలో రేంజ్ రోవర్ కారులో కనిపించారు. రోల్స్ రాయిస్ కల్లినన్ భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు, దీని ధర రూ. 8 కోట్ల కంటే ఎక్కువ. రేంజ్ రోవర్ కారు ధర కోటి రూపాయల వరకు ఉంటుంది. 8 కోట్ల రూపాయల కారు ముందు వెళ్తుంటే దాని వెనుక రేంజ్ రోవర్ కారులో అనంత్ అంబానీ వెళ్లడం చూడవచ్చు.

ఇదీ చదవండి: అందుకే వారానికి 70 గంటల పని చేయమన్నా! - నారాయణ మూర్తి

రిలయన్స్ న్యూ ఎనర్జీ బిజినెస్‌ చూసుకుంటున్న అనంత్ అంబానీ దేశంలోని బిలియనీర్ల జాబితాలో ఒకరు. బ్రౌన్ యూనివర్శిటీలో చదువుకున్న అనంత్ నికర విలువ కొన్ని నివేదికల ప్రకారం రూ. 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువని (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) తెలుస్తుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement