ఈ వారంలో ఈ రాశివారు ఇంటి నిర్మాణాలు చేపడతారు. | Sakshi
Sakshi News home page

ఈ వారంలో ఈ రాశివారు ఇంటి నిర్మాణాలు చేపడతారు.

Published Sun, Dec 12 2021 6:23 AM

Weekly Horoscope In Telugu 12-12-2021 To 18-12-2021 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)

ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. ఎటువంటి పనులు చేపట్టినా విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు పట్టింది బంగారమే. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)

కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు సంపాదిస్తారు.  కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు దక్కుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అకాల భోజనం, స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి తప్పకపోవచ్చు. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి. 

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగుచూస్తుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు. రావలసిన డబ్బు అందుతుంది. మీ నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. ప్రముఖుల సాయం లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రులతో కలహాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)

నూతనంగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో విశేష ఆదరణ పొందుతారు. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)

పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. విద్యార్థులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది.  ఇంటి నిర్మాణాలు చేపడతారు. ఉద్యోగయత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు ఎదురుకావచ్చు. అనారోగ్యం. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సంఘంలో ఊహించని ఆదరణ లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు కలసివస్తాయి. మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గతాన్ని నెమరువేసుకుంటారు. గృహనిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలను మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన వార్తలు.  కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. ఊహించని అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. నేరేడు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)

పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఎదురుచూడని ఆహ్వానాలు రాగలవు. నిరుద్యోగుల∙శ్రమ ఫలించే సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఊపందుకుని లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం చివరిలో చికాకులు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)

పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉండి రుణబాధలు తీరతాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్య వేడుకలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అనుకూల సమాచారం రావచ్చు. విద్యార్థులు కొత్త అవకాశాలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పొందుతారు.  కళారంగం వారికి సమస్యలు తీరతాయి. వారం ప్రారంభంలో  ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)

శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వాహనయోగం. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి పొందుతారు. రాజకీయవర్గాలకు అరుదైన ఆహ్వానాలు. వారం ప్రారంభంలో భూవివాదాలు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)

ఆర్థిక లావాదేవీలలో ఆటంకాలు తొలగుతాయి. రుణాలు తీరే సమయం. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి. ఆధ్యాత్మిక చింతన. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వాహనాలు, ఆభరణాలు కొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన సమాచారం రాగలదు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)

ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. లేనిపోని ఖర్చులు మీదపడవచ్చు. కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు నెలకొంటాయి. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. కోర్టు వ్యవహారాలు కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఇష్టంలేని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దూరం కావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. వాహనయోగం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు సజావుగా సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కొన్ని  వివాదాలు పరిష్కారమవుతాయి. సంఘంలో మీపై  గౌరవం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.  వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement