ఈ రాశి వారికి శుభవార్తలు, ఆకస్మిక ధనలాభం | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి శుభవార్తలు, ఆకస్మిక ధనలాభం

Published Sun, Aug 21 2022 7:05 AM

Today Horoscope 21-08-2022 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణమాసం, తిథి: బ.దశమి తె.3.59 వరకు (తెల్లవారితే సోమవారం), తదుపరి ఏకాదశి నక్షత్రం: రోహిణి ఉ. 6.44 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.54 నుండి 2.04 వరకు, దుర్ముహూర్తం: సా.4.38 నుండి 5.30 వరకు, అమృతఘడియలు: రా.11.24 నుండి 1.10 వరకు. సూర్యోదయం:  5.47, సూర్యాస్తమయం:  6.20, రాహుకాలం:  సా.4.30 నుంచి 6.00 వరకు, యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు. 

మేషం: కుటుంబసభ్యులతో వివాదాలు. అనారోగ్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. అదనపు బాధ్యతలు. 

వృషభం: శుభకార్యాలలో పాల్గొంటారు.పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. ఇంటి నిర్మాణయత్నాలు. పనుల్లో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. 

కర్కాటకం: పరిచయాలు పెరుగుతాయి. పాతబాకీలు అందుతాయి. పనుల్లో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారవృద్ధి. ఉద్యోగులకు శుభవార్తలు. దైవదర్శనాలు. 

సింహం: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు నూతనోత్సాహం. ఆస్తిలాభం. 

కన్య: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందిపెట్టవచ్చు. రుణయత్నాలు. పనుల్లో జాప్యం. బంధువులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆధ్యాత్మిక చింతన.

తుల: ఆర్థిక పరిస్థితి నిరాశాజనకం. రుణయత్నాలు. పనుల్లో తొందరపాటు. ఇంటాబయటా ఒత్తిడులు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. 

వృశ్చికం: సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. ఆహ్వానాలు అందుతాయి.
 
ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. 

మకరం: పనులలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమ తప్పదు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. 

కుంభం: పనులలో జాప్యం.  బంధువులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. .

మీనం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. దూరపు బంధువుల కలయిక. వివాదాల పరిష్కారం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement