ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు. | Today Telugu Horoscope On May 31st, 2025: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu:ఈ రాశి వారు పనులు సజావుగా పూర్తి చేస్తారు.. ఆర్థిక లావాదేవీలు.

May 31 2025 5:50 AM | Updated on May 31 2025 9:15 AM

Rasi Phalalu: Daily Horoscope On 31-05-2025 In Telugu

గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.పంచమి రా.12.33 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: పుష్యమి రా.1.28 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం: ఉ.9.35 నుండి 11.10 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.03 నుండి 7.14 వరకు, అమృతఘడియలు: రా.7.13 నుండి 8.50 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.26.

మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మిథునం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.

కర్కాటకం: పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు.. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కీలక నిర్ణయాలు.

సింహం: కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.

కన్య: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి.  పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. చర్చలు సఫలం.

తుల: సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది.  వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

ధనుస్సు: మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు. కళాకారులకు కొంత ఆదరణ..

మకరం: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.

కుంభం: పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మీనం: బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement