
గ్రహం అనుగ్రహం: శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: అమావాస్య సా.5.04 వరకు, తదుపరి చైత్ర శుద్ధ పాడ్యమి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.8.21 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.6.49 నుండి 8.17 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.26 నుండి 7.37 వరకు, అమృతఘడియలు: ప.3.48 నుండి 5.16 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.01, సూర్యాస్తమయం: 6.08.
మేషం: పనులు నత్తనడకన సాగుతాయి. వ్యయప్రయాసలు. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శనం. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
వృషభం: కొత్త పనులు చేపడతారు. బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.
కర్కాటకం: వ్యయప్రయాసలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ధనవ్యయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.
సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. నిర్ణయాలలో మార్పులు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన సమాచారం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.
తుల: కొత్త వ్యక్తుల పరిచయం. ఆహ్వానాలు రాగలవు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
వృశ్చికం: రుణఒత్తిడులు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప మార్పులు.
ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వస్తులాభాలు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
మకరం: ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసభ్యులతో వివాదాలు తీరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సంఘంలో గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
కుంభం: ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు ఉండవచ్చు.
మీనం: కొత్త పనులు చేపడతారు. బంధువుల కలయిక. విందువినోదాలు. ప్రయత్నాలు అనుకూలం. పాతమిత్రుల కలయిక. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.