
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.చతుర్దశి ఉ.10.47 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: అనూరాధ సా.5.48 వరకు, తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.11.53 నుండి 1.37 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.54 నుండి 11.38 వరకు, అమృతఘడియలు: ఉ.6.16 నుండి 8.02 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30.
మేషం: ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. విద్యార్థులకు అనుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.
వృషభం: కొత్త పనులు చేపడతారు. మిత్రుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
కర్కాటకం: కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో వివాదాలు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. అనారోగ్యం. బాధ్యతలు పెరుగుతాయి.
సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
కన్య: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఉద్యోగ యత్నాలు అనుకూలం. సంఘంలో గౌరవం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం.
తుల: వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.
వృశ్చికం: పనులు సజావుగా సాగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి,వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన.
ధనుస్సు: కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు. ధనవ్యయం. అనారోగ్యం. బంధువుల తాకిడి పెరుగుతుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థికాభివృద్ధి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. సంఘంలో గౌరవం. వృత్తి,వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి ధన, వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మీనం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు వాయిదా వేస్తారు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో మార్పులకు అవకాశం. ఇంటాబయటా చికాకులు.