
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.ద్వాదశి పూర్తి (24 గంటలు), నక్షత్రం: చిత్త ఉ.10.07 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: సా.4.20 నుండి 6.06 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: రా.2.57 నుండి 4.44 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.28.
మేషం: పలుకుబడి పెరుగుతుంది. మిత్రులతో వివాదాలు తీరతాయి. భూలాభాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.
వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. అందరిలోనూ గుర్తింపు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. మిత్రులతో కలహాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదర్శనాలు.
కర్కాటకం: ఆకస్మిక ప్రయాణాలు. కార్యక్రమాలలో అవాంతరాలు. అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనారోగ్యసూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
సింహం: కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
కన్య: కార్యక్రమాల్లో ప్రతిబంధకాలు. కాంట్రాక్టర్లకు నిరుత్సాహం. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.ప్రయాణాలు.
తుల: ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి
వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. బందువర్గంతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరిలోనూ గౌరవం. కీలక నిర్ణయాలు. ఆత్మీయుల ఆదరణ పొందుతారు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
మకరం: ఉద్యోగయత్నాలు సానుకూలం. విలువైన వస్తుసామగ్రి కొంటారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
కుంభం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనుల్లో అవరోధాలు. వ్యాపారాలు ఉద్యోగాలలో చికాకులు.
మీనం: వ్యవహారాలలో చికాకులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.