Today Telugu Horoscope: ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది | Sakshi
Sakshi News home page

Today Telugu Horoscope: ఈ రాశి వారికి రాబడి పెరుగుతుంది

Published Mon, Dec 18 2023 5:34 AM

horoscope today 18 12 2023 telugu  - Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.షష్ఠి సా.6.29 వరకు, తదుపరి సప్తమి, నక్షత్రం: ధనిష్ఠ ఉ.6.35 వరకు, తదుపరి శతభిషం తె.4.49 వరకు (తెల్లవారితే మంగళవారం), వర్జ్యం: ప.1.17 నుండి 2.45 వరకు, దుర్ముహూర్తం: ప.12.19 నుండి 1.07 వరకు, తదుపరి ప.2.30 నుండి 3.12 వరకు, అమృతఘడియలు: రా.10.09 నుండి 11.36 వరకు, సుబ్రహ్మణ్యషష్ఠి; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.28, సూర్యాస్తమయం: 5.25. 

మేషం... ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

 వృషభం... పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి. వస్తులాభాలు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం... ఆకస్మిక ప్రయాణాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో తగాదాలు. అనుకోని ఖర్చులు.

కర్కాటకం... పట్టుదల  పెరుగుతుంది. స్నేహితులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధికం.

సింహం... ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. స్నేహితుల నుంచి సహాయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు. 

కన్య..... పొరపాట్లు సరిదిద్దుకుని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పరపతి పెరుగుతుంది.

తుల.... కుటుంబంలో చికాకులు. దూరప్రయాణలు. అనుకోని ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. 

వృశ్చికం... ఆరోగ్య, కుటుంబసమస్యలు. పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. వృథా ఖర్చులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు. 

ధనుస్సు..... రాబడి పెరుగుతుంది. సన్నిహితులతో ముఖ్యవిషయాలు చర్చిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు పొందుతారు. వ్యవహార విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల స్థితి. 

మకరం.... వ్యయప్రయాసలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. బందువులతో విరోధాలు. ప్రయత్నాలు అనుకూలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. 

కుంభం... ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కీలక సందేశం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం... రాబడి కంటేఖర్చులు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. 

Advertisement
Advertisement