Sakshi News home page

కూలిన చౌడు మిద్దె

Published Wed, Mar 22 2023 2:04 AM

-

ఖాజీపేట : పాత కాలం నాటి చౌడు మిద్దె ఇంటిలో అందరూ నిద్రిస్తుండగా కూలిపోయింది. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీలోని కుమ్మర కొట్టాలు గ్రామంలో జంపన గంగాధర్‌రెడ్డికి పాత కాలం నాటి చౌడు మిద్దె ఉంది. రెండు రోజులుగా కురిసిన వర్షానికి మిద్దె పూర్తిగా తడిసి పోవడంతో తెల్లవారుజామున 3 గంటలకు పై కప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంటిలో గంగాధర్‌రెడ్డి, ఆయన భార్య శివమ్మ నిద్రిస్తున్నారు. అయితే వారి మీద పై కప్పు పడక పోవడంతో స్వల్ప దెబ్బలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకుని ఇంటిలోని వారిని సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. పెను ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement