‘ఐలవ్‌ మై వైఫ్‌.. ఐ హేట్‌ మై మామ్‌’ | Young Man Ends Life In Love Incident | Sakshi
Sakshi News home page

‘ఐలవ్‌ మై వైఫ్‌.. ఐ హేట్‌ మై మామ్‌’

Oct 7 2026 9:20 AM | Updated on Oct 7 2026 9:20 AM

Young Man Ends Life In Love Incident

శ్రీ సత్యసాయి జిల్లా: ప్రేమను చంపుకోలేక ఓ యువకుడు ప్రాణం తీసుకున్న ఘటన మండల పరిధిలోని యనమలవాండ్లపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాలు. మండలంలోని యనమలవాండ్లపల్లికి చెందిన బ్రహ్మయ్య (21) కదిరిలోని తల్లి చంద్రమ్మతో కలిసి ఉంటున్నాడు. కరెంటు పనులు చేస్తూ తల్లికి చేదోడుగా ఉంటున్నాడు. అయితే కదిరి పట్టణంలోని ఓ వీధికి చెందిన బాలికను ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లి చంద్రమ్మను బతిమలాడేవాడు. అందుకు బ్రహ్మయ్యకు తల్లి నచ్చజెప్పి సమీప బంధువుల గ్రామమైన చేలూరుకు పంపింది. 

వారం రోజులుగా అక్కడ ఉన్న బహ్మయ్య మంగళవారం మధ్యాహ్నం తన అమ్మమ్మ ఊరైన యనమలవాడ్లపల్లికి వెళ్లాడు. ఎవరూలేని సమయంలో ఇంటి వెనుక ఉన్న వేప చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని కూలి పనులకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన బ్రహ్మయ్య అమ్మమ్మ ఇంటి వెనుక వైపున చూడగా.. అతను చెట్టుకు ఉరివేసుకొని కనిపించాడు. దీంతో వృద్ధురాలు గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్న స్థానికులు పరుగున అక్కడికి చేరుకొని బ్రహ్మయ్య మెడకు ఉన్న ఉరిని తొలగించి కిందకు దించారు. అయితే అప్పటికే బ్రహ్మయ్య మృతి చెందినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్‌ఐ మక్బూల్‌బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.  

‘ఐలవ్‌ మై వైఫ్‌.. ఐ హేట్‌ మై మామ్‌’ 
కదిరిలో నివాసం ఉంటున్న బ్రహ్మయ్య.. అదే పట్టణానికి చెందిన ఓ బాలికను ప్రేమించాడు.. ఆమెను పెళ్లి చేసుకుంటానని తల్లి చంద్రమ్మను బతిమలాడినా అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో అమ్మమ్మ ఊరైన యనమల వాండ్లపల్లికి వెళ్లిన బ్రహ్మయ్య.. అమ్మమ్మ ఇంటి గోడలపై ఆకులతో ‘ ఐలవ్‌ మై వైఫ్‌.. ఐ హేట్‌ మై మామ్‌’ అని పెద్ద అక్షరాలతో రాసి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement