వాహ్‌! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే.. | Vijayawada in The Shade of Blue Sky and White Clouds, Krishna River, Durga Ghat | Sakshi
Sakshi News home page

వాహ్‌! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే..

Oct 18 2022 5:53 PM | Updated on Oct 18 2022 6:11 PM

Vijayawada in The Shade of Blue Sky and White Clouds, Krishna River, Durga Ghat - Sakshi

నీలాకాశం, తెల్లటి మేఘాల నీడలో బెజవాడ నగరం కొత్త అందాలను సంతరించుకుంది. దుర్గాఘాట్‌, కృష్ణా నది తీరం, ప్రకాశం బ్యారేజ్‌.. బ్యూటీఫుల్‌గా మెరిసిపోయాయి. మనసును రంజింప చేసే ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్‌ మనిపించింది.


సమర్పణం 

విజయవాడ దుర్గాఘాట్‌లో సోమవారం కృష్ణవేణి సాక్షిగా అర్ఘ్యం సమర్పిస్తున్న దృశ్యం


దర్పణం  

మేఘాల ఘుమఘుమలు.. పుడమికి నీలి ఆకాశం సరిగమలు.. దుర్గాఘాట్‌లో దర్పణంలా వాననీటిలో ఆకాశం ప్రతిబింబం 


మేఘాల తెరచాప

ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంపై దట్టంగా అలుముకున్న మేఘాల తెరచాప


మేఘాల హొయలు
కృష్ణా నది  తీరంపై అందంగా హొయలు పోతున్న మేఘమాలలు 


నీలాకాశం నీడలో..
నీలాకాశం నీడలో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్‌ పరిసరాలు


సంస్మరణం
అక్టోబర్‌ 21న జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో నీలాకాశం నీడలో పోలీసు సిబ్బంది కవాతు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ

Advertisement
 
Advertisement
Advertisement