చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ! | Shocking Incident in Collector Of Puttaparthi | Sakshi
Sakshi News home page

చేతిలో సంచి.. అందులో కత్తి.. పుట్టపర్తి కలెక్టరేట్‌కు మహిళ!

Nov 4 2024 1:43 PM | Updated on Nov 4 2024 3:10 PM

Shocking Incident in Collector Of Puttaparthi

పుట్టపర్తి (శ్రీ సత్యసాయి జిల్లా):  అచ్చం ఫ్యాక్షన్‌ సినిమా మాదిరిగానే ఉంది తాజా ఘటన. చేతిలో సంచి.. అందులో కత్తి  పెట్టుకుని ఒక మహిళ ప్రభుత్వ కార్యాలయానికి రావడం ఫ్యాక్షన్‌ సినిమాను తలపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. 

పుట్టపర్తి కలెక్టరేట్‌కు ఓ మహిళ కత్తితో రావడం తీవ్ర కలకలం రేపింది.  చేతిలో సంచి పట్టుకుని అందులో కొన్ని డాక్యుమెంట్స్‌తో పాటు కత్తిని తీసుకుని కలెక్టరేట్‌కు రావడం చర్చనీయాంశమైంది. గత కొంతకాలంగా తనకున్న భూ సమస్యతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే తన భూ సమస్యకు సంబంధించి డాక్యుమెంట్స్‌ ను సంచిలో తీసుకొచ్చింది ప్రేమలత అనే మహిళ.

అయితే సంచిలో కత్తి కూడా ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కర్నీ తనిఖీలు చేసే క్రమంలో ఆమెను కూడా తనిఖీ చేయగా కత్తి బయటపడింది. దాంతో  అక్కడున్న పోలీస్‌ సెక్యూరిటీ ఒక్కసారిగా అలెర్ట్‌ అయ్యింది. అసలు ఆమెను కత్తిని ఎందుకు తీసుకొచ్చావ్‌ అని ప్రశ్నించగా, ఆత్మరక్షణ కోసం అంటూ సమాధానమిచ్చింది.  దాంట్లో ఎంత వరకూ వాస్తవం ఉందని పదే పదే ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను విడిచిపెట్టి కత్తిని మాత్రం స్వాధీనం చేసుకున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement