11 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు | Dussehra holidays for schools from 11th October Andhra Pradesh | Sakshi
Sakshi News home page

11 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు

Oct 7 2021 3:08 AM | Updated on Oct 7 2021 10:02 AM

Dussehra holidays for schools from 11th October Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలల విద్యార్థులకు ఈనెల 11వ తేదీనుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈసారి  రెండో శనివారం, ఆదివారాలు కలసి రావడంతో సెలవు రోజుల సంఖ్య పెరగనుంది. 11వ తేదీనుంచి 16వ తేదీ వరకు ఆరు రోజుల పాటు దసరా సెలవులుగా పాఠశాల విద్యా క్యాలెండర్‌లో పొందుపరిచారు.

అయితే ఈనెల 9వ తేదీ రెండో శనివారం, ఆ తరువాత 10వ తేదీ ఆదివారం కావడంతో పాఠశాలలు 8వ తేదీ వరకే పనిచేయనున్నాయి. ఇక 17వ తేదీ ఆదివారం రావడంతో పాఠశాలలు 18వ తేదీనుంచి పునఃప్రారంభం కానున్నాయి. దసరాకు మొత్తంగా 9 రోజులు సెలవులు కలసి రానున్నాయి.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement