నేడు తిరుమల డిసెంబర్‌ కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల | December quota tickets released online | Sakshi
Sakshi News home page

నేడు తిరుమల డిసెంబర్‌ కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల

Sep 18 2024 5:09 AM | Updated on Sep 18 2024 5:09 AM

December quota tickets released online

తిరుమల: శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన డిసెంబర్‌ కోటాను సెపె్టంబర్‌ 18న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎల్రక్టానిక్‌ డిప్‌ కోసం సెపె్టంబర్‌ 20న ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. కల్యాణోత్సవం, ఊంజల్‌ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను 21న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 

వర్చువల్‌ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనుంది. అంగప్రదక్షిణం టోకెన్లను 23న ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్ట్‌ టికెట్లను ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. 

24న ఎస్‌ఈడీ కోటా  
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల డిసెంబర్‌ కోటాను సెపె్టంబర్‌ 24న ఉదయం 10 గంటలకు..తిరుమల, తిరుపతిల్లో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. 27న తిరుమల–తిరుపతి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ మధ్యాహ్నం 1 గంటకు https:// ttdevasthanams.ap.gov.in లో టీటీడీ విడుదల చేయనుంది  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement