రేపు ‘అల్లూరి’ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన  | CM Jagan To Visit Alluri Sitarama Raju District on december 21 | Sakshi
Sakshi News home page

రేపు ‘అల్లూరి’ జిల్లాలో సీఎం జగన్‌ పర్యటన 

Dec 20 2023 5:29 AM | Updated on Dec 20 2023 5:35 AM

CM Jagan To Visit Alluri Sitarama Raju District on december 21 - Sakshi

సాక్షి,అమరావతి: సీఎం జగన్‌ ఈ నెల 21న (గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్‌లు అందజేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్‌లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Advertisement
 
Advertisement
Advertisement