Christmas-Sankranti Holidays: క్రిస్మస్, సంక్రాంతి సెలవులివే..

Christmas And Sankranti Festival Holidays List In AP - Sakshi

ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్‌సీఈఆఈర్టీ) అకడమిక్‌ క్యాలెండర్‌లో పొందుపరిచింది. క్రిస్మస్‌ సెలవులు డిసెంబర్‌ 23 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయి. క్రిస్టియన్‌ మిషనరీ స్కూళ్లకు మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి.

చదవండి: Srisailam temple: దుకాణాల వేలంలో అందరూ పాల్గొనవచ్చు: సుప్రీం కోర్టు

డిసెంబర్‌ 31న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. ఇక సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 15వ తేదీ వరకు ఉంటాయని ఎస్‌సీఈఆర్టీ వివరించింది. మిషనరీ పాఠశాలలకు మినహా తక్కిన పాఠశాలలకు ఈ సెలవులు వర్తిస్తాయి. 17వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. జనవరి 8వ తేదీ రెండో శనివారం, 9వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులూ సెలవే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top