AP Political News Jan 1st: పొలిటికల్‌ అప్‌డేట్స్‌ | Sakshi
Sakshi News home page

AP Political News Jan 1st: పొలిటికల్‌ అప్‌డేట్స్‌

Published Mon, Jan 1 2024 8:39 AM

AP Elections Political News Updates And Headlines 1 Jan 2024 Telugu - Sakshi

AP Elections Political Latest Updates Telugu

Jan1, 2024
ఎంపీ కేశినేని నాని సంచలన ప్రకటన

  • నేను నా కుటుంబ సభ్యులు బెజవాడ పశ్చిమం నుంచి పోటీ చేయం
  • బెజవాడ పశ్చిమ సీటు బీసీ లేదంటే మైనారిటీదే 
  • నేను విజయవాడ పార్లమెంట్‌ సీటుకు కాపలాదారుడ్ని
  • నేను బరిలో లేకుంటే.. దోచుకునేందుకు టీడీపీ తరఫున జగ్గయ్యపేట నుంచి కొందరు కాచుకుని ఉన్నారు
  • విజయవాడ వెస్ట్ నుంచి తన కూతురు శ్వేత పోటీ చేస్తుందన్న ప్రచారం ఖండించిన ఎంపీ కేశినేని
  • కొన్ని కబంధహస్తాల నుంచి వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నట్లు ప్రకటన

Jan1, 2024
తునిలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు

  • కాకినాడ టీడీపీలో బయటపడ్డ కుమ్ములాటలు 
  • తునిలో తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ 
  • సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు 
  • యనమల సోదరుల వర్గాలకు చెందిన టీడీపీ కార్యకర్తల వీరంగం
  • యనమల సోదరుడు కృష్ణుడు వర్గానికి, యనమల అన్న కుమారుడు రాజేష్ వర్గానికి మధ్య పరస్పర దూషణలతో బీభత్సం
  • వివాదం ముదిరి వేదికపైనే తన్నుకున్న ఇరువర్గాల టీడీపీ కార్యకర్తలు 


Jan1, 2024
జగన్‌ పాలన.. కులం చూడలేదు, మతం చూడలేదు

  • చిత్తూరు రొంపిచర్లలో 334 మందికి ఇంటి స్థలాల పంపిణీ
  • పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప
  • పేదలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు: పెద్దిరెడ్డి
  • గతంలో ఎప్పుడూ లేనివిధంగా పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వడమే కాకుండా గృహాలు కూడా కట్టిస్తున్నారు: పెద్దిరెడ్డి
  • గతంలో జన్మభూమి కమిటీ సభ్యులు సిఫారసు చేసే వారికి ఇంటి స్థలాలు వచ్చేవి: పెద్దిరెడ్డి
  • ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: పెద్దిరెడ్డి
  • ఇందుకే అన్ని వర్గాలు తిరిగి సీఎంగా జగన్ రావాలని కోరుకుంటున్నారు: పెద్దిరెడ్డి
  • చంద్రబాబు, వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలను బేరీజు వేసుకోవాలి: ఎంపీ మిథున్ రెడ్డి
  • చంద్రబాబు అధికారంలోకి వస్తే సచివాలయాలు జన్మభూమి కమిటీ ఆలయాలుగా మారుతాయి: ఎంపీ మిథున్ రెడ్డి
  • వాలంటీర్లు ఉండరు: ఎంపీ మిథున్ రెడ్డి
  • బడుగు బలహీన వర్గాలకు సీఎం జగన్ ఎంతో మేలు చేకూరుస్తున్నారు: ఎంపీ మిథున్ రెడ్డి
  • చంద్రబాబు పాలనలో అంత జన్మభూమి కమిటీలే దోపిడీ చేసేవి: ఎంపీ మిథున్ రెడ్డి
  • ఇప్పుడు ఆ పరిస్థితి లేదు: ఎంపీ మిథున్ రెడ్డి
  • ఇన్ని లక్షల మందికి ఇంటి స్థలాలు ఎప్పుడైనా చంద్రబాబు ఇచ్చాడా: ఎంపీ మిథున్ రెడ్డి
  • సీఎం జగన్ పాలనలో కులమతాలు పార్టీలు చూడలేదు: ఎంపీ మిథున్ రెడ్డి

Jan1, 2024
బీసీలపై దాడులకు పచ్చ బ్యాచ్‌ ప్లాన్‌

  • కొత్త ఏడాది రోజున దాడులు చేసిన టీడీపీ కార్యకర్తలు
  • బీసీ మహిళా మంత్రిపైనే దాడులు. 
  • బీసీలపై కక్ష గట్టిన ఎల్లో ముఠా. 
  • టీడీపీ, జనసేనకు ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదు. 

Jan1, 2024
బీసీ మహిళనైన నన్ను దాడులతో భయపెట్టలేరు: మంత్రి విడదల రజిని

  • దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. 
  • ఇది పక్కా ప్లాన్‌తో జరిగిన దాడి. రాళ్లు తీసుకువచ్చి దాడికి పాల్పడ్డారు. 
  • ఈ దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదు. 
  • అధికార దాహంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. 
  • ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇదంతా చేస్తున్నారు
  • నన్ను దాడులతో భయపెట్టలేరు
  • ఇటువంటి వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోండి. 
  • ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. ప్రజలు మద్దతు ఉన్నంత వరకూ ఎదుర్కొంటాం. 
  • ఈ ఘటన వెనుక ఉన్న వారికీ గుణపాఠం చెబుతాం. చంద్రబాబు, నారా లోకేష్‌కు బీసీలపై కపట ప్రేమ. 
  • బీసీ మహిళా మంత్రిగా ఉన్న నా కార్యాలయంపైనే దాడి చేశారు. 
  • బీసీలంటే ఎంత చిన్న చూపో అర్థం అవుతుంది. పక్కా ప్రణాళికతో ఇలా దాడికి పాల్పడ్డారు.

Jan 1, 2024

అర్ధరాత్రి ఎల్లో బ్యాచ్‌ ఓవరాక్షన్‌​..

  • రెచ్చిపోయిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.. మంత్రి విడదల రజిని ఆఫీసుపై దాడి
  • గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. 
  • మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడి
  • ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు. 
  • అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. 
  • ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. 
  • మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. 
  • ఈ క్రమంలో దాడి జరిగింది. 

Jan 1, 2024
అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని చూసి.. ఇప్పుడు నీతులు చెబుతావా లోకేష్‌

  • మేము అగ్రి గోల్డ్ బాధితులకు 7 కోట్లు (ఆత్మహత్య చేసుకున్న 142  మందికి ఒక్కొక్కరికి 5 లక్షలు చొప్పున ) ఇచ్చాం: లోకేష్‌
  • రాష్ట్రంలో 11 .57  లక్షల  మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్‌ సంస్థలో  డిపాజిట్‌ చేశారు
  • వారిలో 20 వేలు లోపు డిపాజిట్‌ చేసినవారికి  "930 కోట్లు చెల్లించి" 10.37లక్షల మంది అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నారు సీఎం జగన్ 
  • మిగిలిన వారికి కూడా డిపాజిట్‌ మొత్తం చెల్లించేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధంగా ఉంది
  • అగ్రి గోల్డ్ ఆస్తులను ఈడీ   అటాచ్ చేయడం తో ఏలూరు  కోర్ట్ లో కేసు వేసి పోరాడుతోంది జగన్ ప్రభుత్వం
  • అసలు అగ్రిగోల్డ్‌ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే
  • అగ్రిగోల్డ్‌ సంస్థ 8 రాష్ట్రాల్లో 19 లక్షల మంది (19,18,865 )డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది
  • అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు తనయుడు లోకేశ్‌ పంతం పట్టారు
  • టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి
  • అందుకోసం అగ్రిగోల్డ్‌ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది
  • ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్‌ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది
  • అగ్రిగోల్డ్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016 ఏప్రిల్‌ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం
  • అగ్రిగోల్డ్‌ ఆస్తుల అటాచ్‌మెంట్‌ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చౌదరి భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్‌ గ్రూప్‌ కంపెనీ అయిన రామ్‌ ఆవాస్‌ రిసార్ట్స్, హోటల్స్‌ గ్రూప్‌ డైరెక్టర్‌ ఉదయ్‌ దినకర్‌ నుంచి 14 ఎకరాలు కొన్నది
  • అగ్రిగోల్డ్‌ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు
  • రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు

Jan 1, 2024
కాకినాడలో కొలిక్కిరాని పవన్‌ కళ్యాణ్‌ కసరత్తులు

  • తూర్పుగోదావరిలో తప్పుతున్న పవన్‌ అంచనాలు
  • ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అద్భుత ఫలితాలు వస్తాయని తొలుత పవన్‌కు చెప్పిన నేతలు
  • తీరా క్షేత్రస్థాయిలో అందుకు విరుద్ధంగా పరిస్థితులు
  • నియోజకవర్గాల వారీగా పవన్‌ చేస్తోన్న సమీక్షల్లో తేడా కొడుతోన్న పరిస్థితులు
  • కాకినాడలోనే మకాం వేసి జనసేన నేతలను కలుస్తోన్న పవన్‌ కళ్యాణ్‌
  • చాలా వరకు మీడియాకు అనుమతి లేకుండా అంతర్గత సమావేశాలు
  • తమ అంచనాకు భిన్నంగా పరిస్థితి ఉందని తేల్చుతున్న నివేదికలు
  • కాకినాడలో 15 డివిజన్ల కార్యకర్తలతో పవన్ భేటీ 
  • అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ ఇన్‌ఛార్జులతో సమావేశం 
  • మొన్న రాత్రి పవన్ ను కలిసిన జగ్గంపేట వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు
  • అసలు తెలుగుదేశం-జనసేన కలిసి పని చేసే పరిస్థితి లేదని చెప్పిన చంటిబాబు

Jan 1, 2024
విశాఖ: తెలుగుదేశం పార్టీలో డబ్బు ఉంటేనే సీటు

  • ఎంపీ సీటుకు రూ.150 కోట్లు, ఎమ్మెల్యే సీటుకు రూ.50 కోట్లు ఎన్నికల్లో ఖర్చుపెట్టాలని కండీషన్‌
  • ఖర్చు చేయగలిగిన వారికే పార్టీలో సీట్లంటున్న చంద్రబాబు
  • 3 ప్రాంతాల్లో డిపాజిట్‌ మొదలు పెట్టిన చంద్రబాబు
  • బాబు తీరుపై మండిపడుతున్న టీడీపీ నేతలు
  • రూ.కోట్లు ఉంటే సీట్లు అంటున్న బాబు వైఖరిపై ఆగ్రహం
  • కష్టపడే వారికి పార్టీలో విలువ లేదంటూ మండిపాటు

Advertisement
Advertisement