851 కిలోల గంజాయి పట్టివేత | 851 kg ganja seized by police in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

851 కిలోల గంజాయి పట్టివేత

Oct 1 2024 4:07 AM | Updated on Oct 1 2024 4:08 AM

851 kg ganja seized by police in Andhra Pradesh

కొయ్యూరు : రూ.20 లక్షలకు పైగా విలువ చేసే 851 కిలోల గంజాయిని సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. గంజాయితోపాటు ఒక బైక్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. కొయ్యూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం సాయంత్రం బూదరాళ్ల రహదారి నుంచి మైదాన ప్రాంతానికి తరలించేందుకు గంజాయితో రెండుకార్లు వస్తున్నాయన్న ముందస్తు సమాచారంతో చీడిపాలెం జంక్షన్‌ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు.

అయితే, కార్లు రావడానికి ముందు పైలట్‌గా బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూడగానే పారిపోయారు. అదే సమయంలో ఒక కారులో ఉన్న ముగ్గురు, మరో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా పరారయ్యారు. డ్రైవర్లు సైతం పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు రెండు కార్ల డ్రైవర్లను పట్టుకున్నారు. వాటిని వెనక్కి తీసుకెళ్లే క్రమంలో స్మగ్లర్లు కారును వేగంగా డ్రైవ్‌ చేస్తుండగా దొడ్డవరం వెళ్లే మలుపు వద్ద కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కారును వదిలి వారు పరారయ్యారు. స్వాధీనం చేసుకున్న కారు నుంచి 185 గంజాయి ప్యాకెట్లు, మరో కారు నుంచి 94 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement