ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Published Sat, May 25 2024 4:40 PM

ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

అనంతపురం ఎడ్యుకేషన్‌: ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇన్‌చార్జ్‌ జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌ నగరంలోని కేఎస్‌ఆర్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల కేంద్రాన్ని పరిశీలించారు. ట్రైనీ కలెక్టర్‌ బి.వినూత్న టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ప్రశ్నపత్రాల పంపిణీని పర్యవేక్షించారు. తర్వాత కేఎస్‌ఆర్‌ బాలికల జూనియర్‌ కళాశాల, ఎస్‌ఎస్‌బీఎన్‌ జూనియర్‌ కళాశాల, శ్రీ సత్యసాయి బాలికల జూనియర్‌ కళాశాల కేంద్రాలను వినూత్న పరిశీలించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం మొదటి సంవత్సరం పరీక్షకు 183 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌ విద్యార్థులు 3,517 మందికి గాను 3,346 మంది హాజరయ్యారు. 171 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 207 మందికి గాను 195 మంది హాజరయ్యారు. 12 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్‌ విద్యార్థులు 507 మందికి గాను 479 మంది హాజరయ్యారు. 28 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విద్యార్థులు 89 మందికి గాను 85 మంది హాజరయ్యారు. నలుగురు గైర్హాజరయ్యారు. ఇంటర్‌ పరీక్షల నిర్వహణ కమిటీ జిల్లా కన్వీనర్‌ ఎం.వెంకటరమణనాయక్‌ 5 కేంద్రాలు, డీఈసీ సభ్యులు నాలుగు, ఫ్లయింగ్‌స్క్వాడ్‌ సభ్యులు ఆరు కేంద్రాలను తనిఖీ చేశారు.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జిల్లాలోని 45 కేంద్రాల్లో శుక్రవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తెలుగు పరీక్షకు 5,423 మంది విద్యార్థులకు గాను 2,576 మంది హాజరయ్యారు. 2,847 మంది గైర్హాజరయ్యారు. డీఈఓ వరలక్ష్మి గుంతకల్లులో రెండు కేంద్రాలు, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ గోవింద్‌నాయక్‌ అనంతపురంలో మూడు కేంద్రాలు పరిశీలించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement