సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి

Published Mon, Nov 20 2023 2:02 AM

- - Sakshi

కొయ్యూరు: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి, వాటి పూర్తి వివరాలు సేకరించాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎస్‌.హరికృష్ణ ఆదేశించారు. ఆదివారం కొయ్యూరు ,మంప పోలీసుస్టేషన్లను చింతపల్లి అదనపు ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తిస్తే దాని ఆధారంగా భద్రత కల్పించేందుకు వీలు కలుగుతుందన్నారు. సారా తయారీ నిరోధంపై దృష్టి సారించాలని సూచించారు.గిరిజనులకు మరింత చేరువ అయ్యేందుకు వీలుగా కమ్యూనిటీ పోలీసింగ్‌ను విస్తరించాలని ఆదేశించారు.

Advertisement
Advertisement