ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

Published Fri, Nov 10 2023 5:36 AM

- - Sakshi

అనకాపల్లి టౌన్‌: సామాజిక సాధికార యాత్రతో అనకాపల్లి పట్టణంలో పండగ వాతావరణం నెలకొంది. మారేడుపూడి జాతీయ రహదారిలో ప్రారంభమైన బస్సు యాత్ర కశింకోట బయ్యవరం మీదుగా తేగాడ గ్రామానికి చేరుకుని అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన పలువురు మంత్రులు తిరిగి స్థానిక ఎన్టీఆర్‌ క్రీడా మైదానానికి చేరుకుంది. అక్కడ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలతో సభా స్థలి జనసంద్రమైంది. అనకాపల్లి పట్టణ, మండల, కశింకోట మండలం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధిని మంత్రుల ప్రసంగంలో విని ప్రజల్లో ఉత్సాహం ఉరకలేసింది. అనకాపల్లి నియోజకవర్గ రాజకీయ చరిత్రలో ఇటువంటి భారీ బహిరంగ సభ చేపట్టలేదనే చెప్పాలి. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం ఏర్పడకుండా తాగునీరు, మజ్జిగ, బిస్కెట్లు, మైదానంలో గ్యాలరీలు ఏర్పాటు చేయడంతో కడ వరకు ఆసక్తిగా ప్రసంగాన్ని విన్నారు. స్థానిక ప్రధాన రహదారులన్నీ జనసంద్రంగా మారాయి. ఎక్కడ చూసినా బస్సుయాత్రపై చర్చే కనిపించింది. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రిగా వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని గెలిపించుకుని మంచి పాలన పొందాలనే భావన ప్రతి ఒక్కరిలో మొదలైందనే చెప్పాలి. విశాఖ జోన్‌ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మారుతి ప్రసాద్‌ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

హుషారెత్తించిన పులి వేషాలు
1/1

హుషారెత్తించిన పులి వేషాలు

Advertisement
Advertisement