తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలి

కై లాస్‌నగర్‌: జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కా ర్యదర్శి శాంతికుమారి హైదరాబాద్‌ నుంచి జిల్లా కలెక్టర్లతో తాగునీటి సరఫరా, ధాన్యం కొనుగో లు కేంద్రాల ఏర్పాటు, సీఎంఆర్‌ లక్ష్యాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కల్పించాల్సిన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సా రించాలన్నారు. యాసంగి పంట కొనుగోలుకు ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకొని తాగునీటి సరఫరా,టెంట్లు వంటి ఏర్పాట్లు చేయాలన్నారు. వే సవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీచర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో ట్రె యినీ అసిస్టెంట్‌ కలెక్టర్‌ వికాస్‌ మహతో, అదన పుకలెక్టర్‌ శ్యామలాదేవి తదితరులు పాల్గొన్నారు.

Election 2024

Read latest Adilabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top