1,037 మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాల పంపిణీ | Sakshi
Sakshi News home page

1,037 మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాల పంపిణీ

Published Mon, Apr 8 2024 1:30 AM

-

అనంతపురం అగ్రికల్చర్‌: పాడి రైతులు, గొర్రెల కాపర్ల సంక్షేమానికి జగన్‌ సర్కారు ప్రాధాన్యత ఇస్తోంది. ప్రధానంగా గడ్డికొరత నివారణకు దాణామృతం (టోటల్‌ మిక్చర్‌ రేషన్‌ –టీఎంఆర్‌) గడ్డితో పాటు పశుగ్రాసం పెంపకానికి హైబ్రీడ్‌ రకం జొన్న విత్తనాలు (ఫాడర్‌ సీడ్‌), అలాగే మేత వృథా కాకుండా చాఫ్‌కట్టర్స్‌ (గడ్డి కత్తిరించే యంత్రాలు) అందిస్తోంది. అర్హత కలిగిన రైతులకు ఈ ఏడాది ఆర్‌బీకే వేదికగా 60 శాతం సబ్సిడీతో 895 మెట్రిక్‌ టన్నుల టీఎంఆర్‌ గడ్డి, 75 శాతం సబ్సిడీతో 142 మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాలు... మొత్తం 1,037 మెట్రిక్‌ టన్నులు అందించడంతో పాటు 2 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన 110 చాఫ్‌కట్టర్లనూ సకాలంలో రైతులకు పంపిణీ చేశారు. వీటి పూర్తి విలువ రూ.1.94 కోట్లు కాగా రాయితీ పోనూ రైతులు తమ వాటా కింద రూ.83 లక్షల మేర చెల్లించినట్లు పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ వై.సుబ్రహ్మణ్యం తెలిపారు.

Advertisement
Advertisement