ఉద్యోగుల ఆరోగ్యంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల ఆరోగ్యంపై ఆర్టీసీ ప్రత్యేక దృష్టి

Published Wed, Nov 15 2023 1:50 AM

ఆర్‌ఎం సోలోమన్‌ను పరీక్షిస్తున్న వైద్యురాలు 
 - Sakshi

● ఆర్‌ఎం సోలోమన్‌

ఆదిలాబాద్‌: ఉద్యోగుల ఆరోగ్యంపై ఆర్టీసీ ప్రత్యేకదృష్టి సారిస్తోందని ఆదిలాబాద్‌ రీజినల్‌ మేనేజర్‌ సోలోమన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో గ్యారేజీలో వరల్డ్‌ డయాబెటిక్‌ డే పురస్కరించుకొని ఉద్యోగులకు వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు ఒత్తిడికి లోనుకాకుండా, జీవనశైలిని మెరుగుపరచుకుంటే డయాబెటిస్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఆర్‌ఎంలు ప్రణీత్‌, ప్రవీణ్‌, డీఎం కల్పన, మెడికల్‌ ఆఫీసర్‌ భూమన్న తదితరులు పాల్గొన్నారు.

 
Advertisement
 
Advertisement