ఇదొక అందమైన ప్రదేశం.. కానీ...
మనం ఎదైనా సుందరమైన, అద్భుతమైన ప్రదేశాలను సందర్శించినపుడు వాటి జ్ఞాపకాలు ఎప్పటికీ మనతోనే ఉండాలని వాటిని కెమెరాల్లో బంధిస్తుంటాం. దానికి ఎవరూ అడ్డుచెప్పరు. అలా తీసిన ఫొటోలను మనం ఫేస్బుక్, ట్వీటర్, ఇన్స్టాగ్రామ్ లాంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి... వచ్చిన లైక్‌లు, షేర్లు, కామెంట్లను చూసి మురిసిపోతుంటాం. ఇదిలా ఉంటే... యూరోప్‌లోని స్విస్ ఆల్పస్ అనే సుందరమైన, అద్భుతమైన పర్వతాలతో కూడిన ఓ గ్రామం ఉంది.
ఈ ప్రదేశంలో ఫొటోలు తీయడంపై స్థానిక అధికారులు మాత్రం నిషేధం విధించారు. దీనికి అధికారులు ఓ వింతైన కారణాన్ని చూపుతున్నారు. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు ఇక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటారు. అయితే ఈ ఫొటోలను చూసిన వారు మాత్రం జెలసీగా ఫీల్ అవుతున్నారట. అంతేకాకుండా ఇంత అద్భుత ప్రదేశాన్ని వెంటనే చూడలేకపోతున్నామని డిప్రెషన్‌కు లోనవుతున్నారట. ఈ కారణంతో ఫొటోలు తీయడంపై నిషేధం విధించామని అధికారుల చెబుతున్నారు.