breaking news
Willem-Alexander
-
నెదర్లాండ్స్‌కు యువ సారథి
ద హేగ్: నెదర్లాండ్స్‌లో నూతన సంకీర్ణ సర్కారు కొలువుదీరింది. 38 ఏళ్ల రాబ్ జెటెన్ దేశ ప్రధానిగా సోమవారం బాధ్యతలు స్వీకరించారు. రాబ్, ఆయన మంత్రివర్గ సభ్యులతో రాజు విలియం అలెగ్జాండర్ ప్రమాణస్వీకారం చేయించారు. దేశ చరిత్రలోనే అత్యంత పిన్న వయసు్కడైన ప్రధానిగా రాబ్ రికార్డు సృష్టించారు. తాను స్వలింగ సంపర్కిని అని కూడా రాబ్ గతంలోనే బాహాటంగా వెల్లడించడం విశేషం. తద్వారా, ఇలా ప్రకటించుకున్న తొలి ప్రధానిగా కూడా ఆయన నిలిచారు! ఈ పరిణామాన్ని స్వాగతిస్తున్నట్టు నెదర్లాండ్స్ ఎల్జీబీటీక్యూఐ సంస్థ పేర్కొంది. తమ సామాజిక వర్గానికి రాబ్ రోల్‌మోడల్‌గా నిలుస్తారంటూ ఆశాభావం వెలిబుచ్చింది! ఆధునిక ప్రపంచ చరిత్రలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధాని రికార్డు సెబాస్టియన్ కుర్జ్ పేరిట ఉంది. ఆయన 2017లో 32 ఏళ్ల వయసులోనే ఆ్రస్టియా ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు 1783లో విలియం పిట్ ద యంగర్ కేవలం 28 ఏళ్ల వయసులో గ్రేట్ బ్రిటన్ ప్రధాని అయ్యారు! విషమ పరీక్షే మూడు పార్టీలతో కూడిన మైనారిటీ సర్కారును నాలుగేళ్ల పూర్తి కాలం పాటు నెట్టుకురావడం రాబ్‌కు సవాలేనని పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే 150 స్థానాలున్న పార్లమెంటు దిగువ సభలో రాబ్‌కు చెందిన డెమొక్రాట్స్66 పార్టీ సారథ్యంలోని పాలక సంకీర్ణానికి 66 సీట్లే ఉన్నాయి! పైగా ఎగువ సభలో కూడా సంకీర్ణానికి మెజారిటీ లేదు. ‘రోబో’ముద్ర నుంచి.. ప్రధాని పీఠం దాకా! రోబో! నెదర్లాండ్స్ రాజకీయ వర్గాల్లో ఒకప్పుడు రాబ్ జెటెన్‌కు ఉన్న ముద్దుపేరు! మీడియా ఏ ప్రశ్నలడిగినా పెద్దగా ఆలోచించకుండా యథాలాపంగా నోటికొచ్చింది చెబుతారని జర్నలిస్టులే ఆయనకు ఆ పేరును ఖాయం చేశారు. అలాంటి స్థితి నుంచి ప్రధాని పీఠం దాకా రాబ్ది ఆద్యంతం ఆసక్తికర ప్రస్థానం. ఆయన దక్షిణాది నగరమైన ఉడెన్లో పుట్టి పెరిగారు. బిజినెస్ అడ్మిని్రస్టేషన్లో మాస్టర్స్ అనంతరం కొంతకాలం ప్రభుత్వ రంగ రైల్వే కంపెనీ ప్రొరైల్లో పని చేశారు. అథ్లెట్‌గా కూడా రాణించారు. 2017లో డి66 పార్టీ తరఫున తొలిసారిగా పార్లమెంటుకు ఎన్నికయ్యారు. రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో మీడియాను సీరియస్‌గా తీసుకునేవారు కాదు. జర్నలిస్టుల ప్రశ్నలకు నోటికొచ్చిన జవాబులిచ్చేవారు. దాంతో పెద్దగా సీరియస్‌నెస్ లేని నాయకునిగా ముద్రపడ్డారు. అయితే తర్వాతి కాలంలో రాజకీయంగా తనకు తాను సానబెట్టుకుంటూ వచ్చారు. తద్వారా పరిణతి చెందిన నేతగా గుర్తింపు పొందారు.‘43 ఏళ్ల’రికార్డు... 43 ఏళ్లకు బద్దలు! 38 ఏళ్లకే నెదర్లాండ్స్ ప్రధాని పదవి చేపట్టడం ద్వారా రాబ్ చరిత్ర సృష్టించారు. అంతకుముందు ఆ రికార్డు రుడ్ లబర్స్ పేరిట ఉండేది. క్రిస్టియన్ డెమొక్రాట్ పారీ్టకి చెందిన లబర్స్ 1982లో 43 ఏళ్ల వయసులో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా 43 ఏళ్ల ఆ రికార్డును తర్వాత రాబ్ బద్దలు కొట్టడం విశేషం! లబర్స్ 1994 దాకా 12 ఏళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. నెదర్లాండ్స్ చరిత్రల్లో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. మరి ఆ రికార్డును కూడా రాబ్ అధిగమిస్తారేమో చూడాలి. -
ఆ రాజుకు అదో సరదా!
న్యూఢిల్లీ: ఒక దేశానికి రాజు కానీ సరదా కోసం పైలెట్ గా మారాడు. ఇప్పుడే కాదు గత 21 సంవత్సరాలుగా కో పైలెట్ గా సేవలందిస్తున్నాడు. కానీ ఈ విషయం ఆ దేశ పౌరులకు, ఆ విమానాల్లో ప్రయాణించిన ప్రయాణీకులకు సైతం తెలియదు. ఏ దేశ రాజు అబ్బా అనుకుంటున్నారా.. ఆ రాజు ఎవరో కాదు నెదర్లాండ్ రాజు విల్లెం అలెగ్జండర్.. అవును ఆయనే స్వయంగా టెలిగ్రాఫ్ పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ రహస్యాన్ని వెల్లడించాడు. కింగ్ అవ్వక ముందు గెస్ట్ పైలెట్ గా కొందరికి తెలిసిన ఈ రాజు అనంతరం రహస్యంగా నెలకు రెండు సార్లు కేఎల్ ఎమ్ రాయల్ డచ్ ఏయిర్ లైన్స్ వంటి కమర్షియల్ విమానాలకు కో పైలెట్ గా విధులు నిర్వర్తించేవాడని.. రాయల్ ఏయిర్ లైన్స్ బోయింగ్ 737 జెట్ ప్యాసెంజర్ ప్లైట్ శిక్షణ కూడా తీసుకుబోతున్నాడని డచ్ న్యూస్ పేపర్ ప్రచురించింది. ఎందుకుంటే ఈ రాజు ఇప్పటి వరకు కేఎల్ఎమ్ ఫోకర్ 70 వంటి చిన్న ప్లేన్ లోనే పైలెట్ గా చేశాడు. గెస్ట్ పైలెట్ గా కేఎల్ ఎమ్ 737 ప్లైట్ లో విధులు నిర్వర్తించాలని ఉందని కింగ్ విల్లెం అలెగ్జండర్ తన మనసులోని కోరికను వెల్లడించాడు. ఏదైనా పెద్ద విమానంలో ఓ రాత్రంతా విధులు నిర్వర్తించి నెదర్లాండ్స్ లో అత్యవసర పరిస్తితులు ఏర్పడినపుడు తిరిగిరాకుండా ఉండాలనుందని ఈ 50 ఏళ్ల డచ్ కింగ్ పేర్కొన్నాడు. విమానాల్లో పైలెట్ గా విధులు నిర్వర్తించడం తనకు ఓ అలవాటని, రాజుగా విధులను పక్కకు పెట్టి పైలెట్ గా ప్లైయింగ్ పై దృష్టి సారించడంతో విశ్రాంతి దొరుకుతుందని ఈ కింగ్ అభిప్రాయపడ్డాడు. ఇక రాయల్ ఏయిర్ లైన్స్ మాత్రం యూనిఫాంలో ఉన్న కింగ్ ను ప్యాసెంజర్లు ఎప్పుడు గుర్తించ లేదని తెలిపింది.


