breaking news
Wanke Srinivas
-
పోర్ట్‌ఫోలియో
పోర్ట్‌ఫోలియో.. ఒక వ్యక్తి ఏంటో అతని పోర్ట్‌ఫోలియో చెబుతుంది. అప్‌కమింగ్ మోడల్స్... ఆస్పైరింగ్ నటీనటుల జీవితంలో పోర్ట్ఫోలియోది క్రూషియల్ రోల్. ఆ ఒక్క చాన్స్ రావాలంటే... నవరసాలను ప్రతిబింబించే పోర్ట్‌ఫోలియో తప్పనిసరి. ఫ్యాషన్, సినిమా రంగాల వారే కాక.. ఇప్పుడు చాలామంది తమ ఫొటోషూట్స్‌తో పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. ఫ్యామిలీ ఫొటోలతో, వినోద, విహార ప్రదేశాల సందర్శన చిత్రాలతో కలకాలం గుర్తుండిపోయేలా పోర్ట్‌ఫోలియోలను పదిలపర్చుకుంటున్నారు. - వాంకె శ్రీనివాస్ ఫ్యాషన్.. సినిమా.. ఫీల్డ్ ఏదైనా పోర్ట్ఫోలియోది పవర్ఫుల్ రోల్. ఎంతోమంది మోడల్స్, సినిమా హీరోలు, హీరోయిన్లు కావడానికి తొలి ‘క్లిక్’ పోర్ట్‌ఫోలియోనే. ఈ రంగాల్లో దీనికెందుకు ఇంత ప్రాధాన్యం అంటే.. మనం ఏంటో తెలియాలంటే ఫొటోషూట్ తప్పనిసరి. ‘ఫొటోషూట్ అనేది ఓ వ్యక్తి హైట్, అప్పియరెన్స్ మాత్రమే కాదు.. హావభావాలను చూపిస్తుంది. సినిమాలు, మోడలింగ్, డిజైనర్స్.. ఇలా ఆర్ట్ ఏదైనా వాళ్లకు అవకాశాలు ఇప్పించేది పోర్ట్‌ఫోలియోనే’ అంటున్నారు ఈ రంగంలో కొనసాగుతున్న చందన్ వెనిగళ్ల. హీరో నాగశౌర్య, హీరోయిన్లు స్వాతి, మానస, నందిని రాయ్, మంజులా రాథోడ్.. వీరంతా ఆయన పోర్ట్‌ఫోలియోల్లో అందమైన ‘బొమ్మలు’గా ఒదిగిపోయారు. వీరందిరినీ బ్యూటీఫుల్ పిక్చర్స్‌లో బంధించిన చందన్.. ఎన్నో అవకాశాలకు తెర తీసారు. ఎలా ఉన్నామో.. ఉండాలో చెబుతుంది.. సెలబ్రిటీలు కచ్చితంగా ఆరునెలలకు ఒకసారి పోర్ట్‌ఫోలియో తీయించుకుంటారు. ఎందుకంటే బాడీలో ఎలాంటి మార్పులొచ్చాయి, ఆన్‌స్క్రీన్ ఇంకా అందంగా కనిపించాలంటే ఎలాంటి వర్కవుట్స్ చేయాలి అని తెలియజెప్పేది పోర్ట్‌ఫోలియోనే. ఫ్యాషన్ పోర్ట్‌ఫోలియో మిగతా వాటితో పోలిస్తే కాస్త డిఫరెంట్. హెయిర్సై ్టల్, మేకప్, డ్రెస్సింగ్, సై ్టలిష్.. ఒక్కముక్కలో చెప్పాలంటే మేకప్ ఎక్కువగా ఉండి కలర్ఫుల్గా ఉండాలి. అదే ఫిల్మ్ విషయానికొస్తే ఫేస్ ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్, యాక్టింగ్ సై ్టల్, డిఫరెంట్ యాంగిల్స్, వాకింగ్ చేసేటప్పుడు, క్లోజ్ఆప్, అల్ట్రా క్లోజ్ అప్ ఫొటోలు అవసరమవుతాయి. ఇప్పుడు అందరూ.. సినిమా, ఫ్యాషన్ రంగాల్లో ఉన్న వారే కాక ఇప్పుడు చాలామంది పోర్ట్‌ఫోలియోలను తయారు చేయించుకుంటున్నారు. సాధారణంగా ఇంతకుముందు పెళ్లిళ్లు, ఫంక్షన్లలో తీసిన ఫొటోలనే ఆల్బమ్‌గా చేసుకుని దాచుకునే వారు. ఇప్పుడు రకరకాల సందర్భాల్లో ప్రత్యేక ఫొటోషూట్స్ తీయించుకోవడం ట్రెండ్‌గా మారింది. ‘ఫొటో అనగానే పోజులివ్వడం, లెన్స్‌కు కళ్లప్పగించడం చేస్తుంటాం. కానీ డైలీ లైఫ్‌ను కళ్లకు కట్టే నేచురల్ పోర్ట్ఫోలియోలంటే క్రేజీగా ఉన్నారు సిటీవాసులు’ అంటున్నారు చందన్. హైటెక్‌సిటీలో ఉన్న ఈయన స్టూడియో వర్ధమాన తారల ఫొటోషూట్స్‌తో సందడిగా ఉంటుంది. నేచురల్కి క్రేజీ.. నేచురల్ పోర్ట్‌ఫోలియోల మేకింగ్ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. పెళ్లి, బర్త్‌డే.. ఈవెంట్ ఏదైనా మనకు తెలియకుండా లెన్స్‌లో బంధించడమే నేచురల్ పోర్ట్‌ఫోలియో. ఆ అకేషన్లో మన ఎక్స్‌ప్రెషన్స్‌ని... మన ఫ్యామిలీకి కళ్లకు కట్టినట్టు చూపిస్తారు పోర్ట్‌ఫోలియో ఫొటోగ్రాఫర్లు. కుటుంబ శుభకార్యాలే కాదు... ఆఫీస్‌లు సైతం తమ వర్కింగ్ స్పేస్‌ని నేచురల్ పోర్ట్‌ఫోలియోగా మార్చుకునేందుకు ఇష్టపడుతున్నాయి. ఆఫీసు వెదర్‌ను, వర్కింగ్ స్టైల్‌ను పలువురు ఫొటోలుగా తీయించుకుని దాచుకుంటున్నారు. నాన్న కొనిచ్చిన కెమెరాతోనే.. పోర్ట్‌ఫోలియోల తయారీ ఇప్పుడు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లకు కెరీర్‌గానూ మారింది. ‘టెన్త్ సమయంలో నాన్న కొనిచ్చిన కెమెరాతో ఫొటోలు తీస్తుండే వాడిని. అలా చిన్నప్పటి నుంచే ఫొటోగ్రఫీ పాషన్‌గా మారింది. ఇందులో ఎలాంటి క్రియేటివ్ కోర్సులు చేయలేదు’ అని చెప్పారు చందన్. విజయవాడకు చెందిన ఈ కుర్రాడు పెరిగిందంతా హైదరాబాద్‌లోనే. కూకట్‌పల్లిలోని ప్రతిభ విద్యానికేతన్‌లో టెన్త్ వరకు చదివి.. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో బీకామ్ కంప్యూటర్స్ పూర్తి చేశాక ఫుల్‌టైమ్ ఫొటోగ్రాఫర్‌గా మారిపోయాడు. ప్రస్తుతం వచ్చే నెలలో విడుదల కానున్న ‘ఫటేతక్ నాచ్నా’ అనే బాలీవుడ్ మూవీలో నాలుగు పాటలకు సినిమాటోగ్రఫీ కూడా చేశాడు. -
ఆటే మంత్రం
నేడు ప్లే టెన్నిస్ డే పదేళ్లు కూడా నిండని చిన్నారులు రాకెట్ పట్టుకుని బంతులను బలంగా బాదుతుంటారు. కాలేజీకి వెళ్లే అమ్మాయిలు మంచు తెరలు వీడక ముందే మైదానాల్లో ఎడతెరిపి లేకుండా సాధన చేస్తుంటారు. ఫోర్ హ్యాండ్... బ్యాక్ హ్యాండ్... వాలీ... ఆఫ్ వాలీ... ఓవర్‌హెడ్... డ్రాప్ షాట్... అక్కడ వినిపించే మాటలివే. కోచ్‌ల శిక్షణలో మెరికల్లా మారే ప్రయత్నం... సిటీలో కనిపించే దృశ్యం. వీళ్లందరికీ స్ఫూర్తి... భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా. ఈ హైదరాబాదీని ఆదర్శంగా తీసుకుని ఎందరో టెన్నిస్‌ను తమ టార్గెట్ చేసుకున్నారు. పోటీల్లో అదరగొట్టి నగరానికే వన్నె తెస్తున్నారు. నేడు ‘ప్లే టెన్నిస్ డే’. ఈ సందర్భంగా సిటీలోని టెన్నిస్ అకాడమీలు, స్టేడియాల్లో ఏం జరుగుతుందో ఓసారి చూసొద్దాం... పొద్దున్నే గంట ఆరు కొట్టక ముందే ఎల్బీ స్టేడియంలో అటెండెన్స్. ఓ అరగంట వార్మప్... ఆపై తోటి ఆటగాళ్లతో ప్రాక్టీస్. అలా మూడు గంటల పరిశ్రమ. తరువాత నాన్నతో కలసి ఇంటికి వెళ్లడం. సాయంత్రం... ఆరు గంటలు. జూబ్లీహిల్స్ జీవీకే టెన్నిస్ అకాడమీలో ప్రత్యక్షం. కోచ్‌ల డెరైక్షన్‌లో... మరో మూడు గంటల కఠోర సాధన... సబ్‌జూనియర్, జూనియర్, ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీల్లో ఆడుతున్న యడ్లవల్లి ప్రాంజల రోజువారీ షెడ్యూల్ ఇది. మాటలు రావు. కానీ... టెన్నిస్ అంటే పిచ్చి. ‘నువ్వేం ఆడతావే’ అన్న బంధువుల ఎత్తిపొడుపు మాటలకు రాకెట్‌తోనే సమాధానం. ఎల్బీ స్టేడియంలో ఉదయం... సాయంత్రం... రోజుకు ఏడు గంటల పాటు అలుపెరుగని కృషి... ఆటపై అమితమైన మక్కువ, కసితో అండర్-12, 14, 16, ఏఐటీఏ టైటిల్స్ సాధించి పెట్టాయి షేక్ జాఫ్రిన్‌కు. రెండేళ్ల కిందట బధిర జాతీయ క్రీడల్లో స్వర్ణ పతకం దక్కించుకుని మరెందరిలోనో స్ఫూర్తి నింపుతోందీ బాలిక. వీరిద్దరే కాదు... ఇలా ఎందరో తమకు తాము లక్ష్యాలను నిర్దేశించుకుని టెన్నిస్‌ను శ్వాసిస్తూ ముందుకు సాగుతున్నారు. వివిధ పోటీల్లో సత్తా చాటుతున్నారు. సిటీని టెన్నిస్‌కు కేరాఫ్‌గా మారుస్తున్నారు. పెద్దల్లోనూ క్రేజ్... క్రికెట్ ఇతర క్రీడల్ని డామినేట్ చేస్తున్న సమయంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో టెన్నిస్‌కు క్రేజ్ తెచ్చింది సానియామిర్జా. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న సానియాను చూసిన చాలామంది తల్లిదండ్రుల చూపు ఈ క్రీడపై పడింది. ఫలితంగా తమ పిల్లలను దగ్గరుండి మరీ టెన్నిస్ అకాడమీలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పిస్తున్నారు. వారు ప్రాక్టీస్ చేసినంత సేపూ స్టేడియంలోనే ఉండి ప్రోత్సహిస్తున్నారు. బాలబాలికలూ అంతే శ్రద్ధగా ఆటపై పట్టు బిగిస్తున్నారు. ఫలితంగా జాతీయ స్థాయి క్రీడాకారులు నగరం నుంచి పుట్టుకొస్తున్నారు. ఆట వల్ల ఆరోగ్యం, శరీర దారుఢ్యం, ఆలోచనా ధోరణిలో మార్పు, ఉద్యోగ అవకాశాలు... ఇలా ఎన్నో ఉపయోగాలున్నాయని పిల్లలతో పాటు తల్లిదండ్రులు గ్రహించడం వల్లే నగరంలో టెన్నిస్‌కు క్రేజ్ పెరుగుతుందన్నది నిపుణుల మాట. ప్రోత్సహించాలనే... టెన్నిస్ అంటే హైదరాబాద్ గుర్తు రావాలన్న ఆలోచనతోనే చాంపియన్ టెన్నిస్ లీగ్‌లో ‘హైదరాబాద్ ఏసెస్’ జట్టును కొన్నాం. సిటీలోనూ మ్యాచ్‌లు జరిగేలా చూశాం. సానియా మిర్జాలా మరెంతో మంది టెన్నిస్ తారలను వెలుగులోకి తీసుకు రావాలనుకుంటున్నాం. మన సిటీలో టెన్నిస్‌కు మంచి ఆదరణ కనబడుతోంది. అదే స్థాయిలో ప్రతిభ కలిగినవారూ ఉన్నారు. ఇలాంటి వారిని ప్రోత్సహించాలన్నదే మా ఉద్దేశం. భవిష్యత్‌లో సిటీ క్రీడాకారులకు మంచి అవకాశాలు వస్తాయి... అంటున్నారు హైదరాబాద్ ఏసెస్ జట్టు యజమానులు రాజేశ్ దండు, రామరాజు. తాము పారిశ్రామికవేత్తలమైనా... టెన్నిస్‌పై ఉన్న అభిమానమే సీటీఎల్ వైపు నడిపించిందన్నారు. - వాంకె శ్రీనివాస్