breaking news
	
		
	
  Vishitha
- 
  
    
                
      ఏడాదిన్నర ప్రేమించుకున్నాం
 - 
      
                   
                               
                   
            పెళ్లికి ముందు ఉదయ్ కిరణ్, నేను ఏడాదిన్నర ప్రేమించుకున్నాం

 సినీ హీరో ఉదయ్ కిరణ్, తాను తమ పెళ్లికి ముందు ఏడాదిన్నర ప్రేమించుకున్నామని ఆయన భార్య విషిత చెప్పారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన గురించి పోలీసులు మరోసారి విషితను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె పలు విషయాలు వెల్లడించారు. ఉదయ్ కిరణ్ తండ్రి మూర్తి ఆరేళ్లుగా దూరంగా ఉంటున్నారని చెప్పారు.
 
 ఉదయ్ కిరణ్కు ఆర్థిక సమస్యలూ ఉన్నాయని విషిత చెప్పారు. ఆయన స్టార్ ఇమేజ్ చట్రంలో ఇరుకున్నారని, దాన్నుంచి బయటపడలేకపోయారని, ప్రతిక్షణం ఇమేజ్ ఆలోచించేవారని తెలిపారు. తెలుగు సినిమబా వందేళ్ల వేడుకకు ఆహ్వానించకపోవడంతో కలత చెందారని విషిత వెల్లడించారు.
 
 గత కొంత కాలంగా సినిమా అవకాశాలు లేక సతమతం అవుతున్న ఉదయ్ కిరణ్....ఆదివారం రాత్రి శ్రీనగర్ కాలనీనలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అతను ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు, తన కెరీర్ ఆశాజనకంగా లేక పోవడమే కారణమని తెలుస్తోంది. ఈ సంఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారించారు. ఆ రోజు రాత్రి ఉదయ్ భార్య తన స్నేహితుడు పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లారు. ఉదయ్ తాను మళ్లీ పార్టీకి వస్తానంటే వెళ్లానని, అంతలోనే ఘోరం జరిగిపోయిందని విషిత చెప్పారు. - 
  
    
                
      ఆత్మహత్యకు కారణాలు తెలియవు:విషిత తండ్రి
 


