సంచలన నిర్ణయం.. 32 ఏళ్లకే రిటైర్మెంట్!
రెండుసార్లు ఒలింపిక్ చాంపియన్, డెన్మార్క్‌కు చెందిన స్టార్ షట్లర్ విక్టర్ ఆక్సెల్సెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 32 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను షాక్‌కు గురి చేశాడు. గత రెండేళ్లుగా తన కెరీర్‌ను తీవ్రంగా ప్రభావితం చేసిన దీర్ఘకాలిక తీవ్రమైన వెన్ను గాయం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆక్సెల్సెన్ తెలిపాడు.తన రిటైర్మెంట్ విషయాన్ని ఆక్సెల్సెన్ ఇన్స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. నేను చాలా కాలంగా వెన్నునొప్పితో బాధపడుతున్నాను. గత సంవత్సరం ఏప్రిల్‌లో శస్త్రచికిత్స జరిగింది. విస్తృతమైన పునరావాసం పొందాను, కానీ అక్టోబర్‌లో నాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అప్పటి నుంచి, నేను ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్నా. వెన్నునొప్పి కారణంగా ఆటపై కూడా సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నా. దీంతో ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చినట్లుగా అనిపించింది. అందుకే ఈ నిర్ణయం. డాక్టర్‌తో మాట్లాడిన తర్వాతే రిటైర్మెంట్పై ఒక నిర్ణయానికి వచ్చాను. డాక్టర్ కూడా దీర్ఘకాలిక ఆరోగ్యంపై దృష్టి పెట్టమని సలహా ఇచ్చారు. దీనిని అంగీకరించడానికి కష్టంగా ఉన్నప్పటికీ పరిస్థితులు ఈ నిర్ణయం తీసుకునేలా చేశాయి. త్వరలో వెన్నుకు సర్జరీ జరగనుంది. అది విజయవంతం కాకపోతే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇకపై ఆడడం కుదరదని తెలిసే ఈ నిర్ణయం తీసుకున్నా.1994లో జన్మించిన ఆక్సెల్సెన్ ఆరేళ్ల వయసులోనే బ్యాడ్మింటన్ ఆటపై ఇష్టాన్ని పెంచుకున్నాడు. 2010లో అతను బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకొని చరిత్ర సృష్టించాడు. అలా చేసిన మొదటి యూరోపియన్ ఆటగాడిగా నిలిచాడు. అదే సంవత్సరం, అతను సీనియర్ స్థాయిలో అరంగేట్రం చేసి, సైపర్స్ ఇంటర్నేషనల్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా తన కెరీర్‌ను ఘనంగా ప్రారంభించాడు. 2014లో స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ గెలిచాడు. ఇక ఒలింపిక్స్ విషయానికొస్తే 2016లో కాంస్యం, 2020, 2024 ఒలింపిక్స్‌లో ఏకంగా స్వర్ణాలు గెలుచుకున్నాడు. ఇక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 2014లో కాంస్యం గెలిచిన ఆక్సెల్సెన్ 2017, 2022లో స్వర్ణం కైవసం చేసుకున్నాడు. 2020, 2022లో ప్రతిష్ఠాత్మ ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొన్నాడు. అంతేకాదు 180 వారాలకు పైగా విక్టర్ ఆక్సెల్సెన్ నంబర్‌వన్ స్థానంలో కొనసాగాడు. సింగిల్స్‌లో 572 విజయాలు, 160 ఓటములతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు. View this post on Instagram A post shared by Olympic Khel (@olympickhel) View this post on Instagram A post shared by Viktor Axelsen (@viktoraxelsen)