-
ట్రైగ్లిజరైడ్స్ పెరగనివ్వకండి..! పెరిగితే..?
కొవ్వులు పెరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అంటుంటాం. అలాగే ట్రైగ్లిజరైడ్స్ పెరగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే కొవ్వుల్లాగే ఇవీ హానికరం. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ ఉండాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఉండే కండిషన్‌ను ‘హైపర్ ట్రైగ్లిజరైడెమియా’ అంటారు. ఇవి పెరగడం వల్ల గుండె జబ్బులు పెరిగే ముప్పు ఉంటుంది. అలాగే డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ ట్రైగ్లిజరైడ్స్ మోతాదులు పెరగడం వల్ల కూడా గుండెకూ, మెదడుకూ హాని కలగజేసే అవకాశం ఉంది. ఈ కింద జాగ్రత్తలు తీసుకోండి... ట్రైగ్లిజరైడ్స్‌ను అదుపులో ఉంచుకోండి. కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా... అంటే ఆహార నియమాలు, వ్యాయామం చేయడం వంటివి పాటించడం ద్వారా రక్తంలో వాటి పాళ్లను తగ్గించుకోవచ్చు. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు బాగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్‌లో పీచుట్రైగ్లిజరైడ్స్ను అదుపు చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకే వాటిని తరచూ తీసుకోవడం మంచిది. అయితే అందులోనూ జీడిపప్పు వంటి కొవ్వులు ఒకింత ఎక్కువగా ఉండే నట్స్ కంటే కొవ్వు తక్కువగా ఉండే బాదం వంటివి మేలు చేస్తాయి. భోజనానికి మందుగా వెజిటబుల్ సలాడ్స్, భోజనంలో భాగంగా తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవడం కూడా మంచిది. వీటిలోని పీచుపదార్థాలూ ట్రైగ్లిజరైడ్స్‌ను నియంత్రిస్తాయి. పీచు ఎక్కువగా ఉండేలా... పొట్టుతీయని తృణధాన్యాలు (అంటే... దంపుడు బియ్యం, మెుక్కజొన్న, పొట్టుతీయని రాగులు, గోధువులు, ఓట్స్ వంటి ధాన్యాలు), పొట్టుతీయని పప్పుధాన్యాలు, మొలకెత్తిన గింజలు (స్ప్రౌట్స్) తీసుకోవాలి. ఆహారంలో వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్‌ను, కొలెస్ట్రాల్ ఉండే ఆహారాన్ని బాగా తగ్గించాలి. అంటే కేవలం రుచికోసం చాలా కొద్దిగా మాత్రమే తీసుకోవాలి. అలాగే వూంసాహారం (వేటమాంసం, రొయ్యలు, చికెన్ స్కిన్ వంటివి) చాలా పరిమితంగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలను తగ్గించాలి. స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నవారు దాన్ని సాధారణ స్థాయికి తెచ్చుకునేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే తీసుకునే క్యాలరీల (క్యాలరీ ఇన్‌టేక్)ను తగ్గించుకోవాలి. ఆల్కహాల్ పూర్తిగా వూనేయాలి. ∙పొగతాగడం పూర్తిగా వూనేయాలి. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు శారీరక శ్రవు / వాకింగ్ వంటి వ్యాయావూలు చేయాలి. వారంలో కనీసం వుూడుసార్లు చేపలు తీసుకోవడం మంచిది. అయితే వాటిని కేవలం ఉడికించి వండాలి. లేదా గ్రిల్ చేసినవి తీసుకోవచ్చు. కానీ డీప్ ఫ్రై చేసినవి వద్దు. -
కార్డియాలజీ కౌన్సెలింగ్
ట్రై గ్లిజరైడ్స్ అంటే ఏమిటి? నా వయసు 48. ఎత్తు 5 అడుగుల ఆరంగుళాలు. బరువు 78 కేజీలు ఉన్నాను. నాకు ఇటీవల ఛాతీలో నొప్పిగానూ, శరీరమంతా భారంగానూ ఉన్నట్లు అనిపిస్తోంది. నడుస్తుంటే ఆయాసం వస్తోంది. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన నన్ను లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష చేయించుకోమని చెప్పారు. అందులో నాకు ట్రై గ్లిజరైడ్స్ ఉండవలసిన మోతాదు కన్నా చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇంతకూ ట్రై గ్లిజరైడ్స్ అంటే ఏమిటి? అవి అధికంగా ఉండటం వల్ల ఏమైనా ప్రమాదమా? వాటిని తగ్గించుకోవడం ఎలా? - వేణు బెక్కెం, విజయవాడ మీ ఎత్తుకు మీరు ఉండవలసిన దానికన్నా చాలా ఎక్కువ బరువున్నారు. అందుకే మీ డాక్టర్ మిమ్మల్ని ఆ పరీక్ష చేయించుకోమని సూచించి ఉండవచ్చు. రక్తంలో కొలెస్ట్రాల్లా, కొవ్వులో ఉండే ఒక రకం జీవ రసాయనాలను ట్రైగ్లిజరైడ్స్ అంటారు. ఇవి ఎక్కువగా ఉంటే ‘హైపర్ ట్రైగ్లిజరైడేమియా’ అంటారు. రక్తంలో వీటి పాళ్లు పెరిగితే అది గుండె జబ్బులకు దారితీయవచ్చు. డయాబెటిస్ వంటి జబ్బులు ఉన్న సందర్భాల్లోనూ రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు పెరిగే అవకాశం ఉంది. ట్రై గ్లిజరైడ్స్‌ను మరో విధంగా చెప్పాలంటే హానికరమైన కొవ్వు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను కొన్ని ఆహార నియమాలతో తగ్గించుకోవచ్చు. హైపర్ ట్రైగ్లిజరైడేమియా ఉన్నప్పుడు జీవనశైలిలో మార్పులు తప్పనిసరి. మీరు ఎక్కువ బరువుంటే దాన్ని సాధారణ స్థాయికి వచ్చేలా మీ ఆహారంలో మార్పులు చేసుకోవాలి. అంటే మీరు తీసుకునే క్యాలరీలను తగ్గించుకోవాలి.మీరు తీసుకునే ఆహారంలో నెయ్యి, వెన్న, మాంసాహారం (రొయ్యలు, చికెన్ స్కిన్), వేపుళ్లను తగ్గించాలి.ఆల్కహాల్ మానేయాలి. తాజా పళ్లు, కూరగాయలు, ఆకు కూరలు బాగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్‌లో పీచు ఎక్కువగా ఉండి, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి. దాంతోపాటు వెజిటబుల్ సలాడ్స్, తేలిగ్గా ఉడికించిన కాయగూరలు తీసుకోవాలి.స్వీట్స్, బేకరీ ఐటమ్స్ బాగా తగ్గించాలి. ప్రతిరోజూ 30 నిమిషాలపాటు శారీరక శ్రమ / వాకింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. కనీసం వారంలో మూడుసార్లు చేపలు తీసుకోవాలి. అది కూడా కేవలం ఉడికించి వండినవి, గ్రిల్డ్ ఫిష్ మాత్రమే తీసుకోవాలి.పొగ తాగడం పూర్తిగా మానివేయాలి. పైన చెప్పిన సూచనలను పాటిస్తూ, మీ డాక్టర్ రాసిచ్చిన మందులను క్రమబద్ధంగా వాడుతూ ఉంటే మీకు వచ్చిన సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి. డాక్టర్ అనూజ్ కపాడియా సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్‌పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
వైభవంగా త్రిశూల చక్ర స్నానం
రాజంపేట సెంటిమెంట్ ఎవరికో !
ఎన్నికల్లో బీజేపీకి సహకరించిన బీఆర్ఎస్
నృసింహుడికి ప్రత్యేక పూజలు
లెక్కలతో కుస్తీ
జరిమానాలతోనే సరి.. కల్తీ యథావిధి
అప్రమత్తతో తప్పిన ముప్పు
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
గ్రీన్‌లో ట్రేడవుతున్న స్టాక్‌మార్కెట్లు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
తప్పక చదవండి
- Bhuma VS AV! అఖిలప్రియ బాడీ గార్డ్ పరిస్థితి విషమం
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- అజిత్ షాకిచ్చిన త్రిష.. ఏకంగా చిరు, కమల్ కోసం!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- దేశంలో ఐఐఎం–అహ్మదాబాద్ టాప్
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం
Advertisement