-
నువ్వూ వద్దు నీ ప్రేమా వద్దు..
తన పేరు బుజ్జి నా జూనియర్. హ్యాపిడేస్ సినిమాలో లాగా తనని మొదటిసారి చూడగానే ప్రేమించా. వెంటనే తనకి చెప్పా. మా ఇంట్లో ఇలాంటివి ఒప్పుకోరు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని చెప్పింది. కానీ నేను మాత్రం తనని వదులుకోలేకపోయా. నా చదువు పూర్తవగానే జాబ్‌లో జాయిన్ అయ్యాను. అలా ఒక సంవత్సరం గడిచిపోయింది. ఒకరోజు తన నుంచి కాల్ వచ్చింది. ఓ ప్రాజెక్ట్‌లో హెల్ప్ కావాలి అని. అలా తను నాకు మళ్లీ దగ్గరైంది. అప్పుడే తన మనసులో మాటని నాతో పంచుకుంది. నువ్వంటే నాకిష్టమే. కానీ మంచి జాబ్‌లో స్థిరపడితే మా ఇంట్లో వాళ్లని ఒప్పిస్తా అంది. అప్పటికి నా జీతం 16 వేలు మాత్రమే. సో ఇంకా మంచి జాబ్ కోసం కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను. ఉద్యోగం సంపాదించి వాళ్లింటికి వెళ్లి మా ప్రేమ గురించి చెప్పి ఒప్పించాలనుకున్నా. అందుకే బాగా కష్టపడేవాడ్ని. ఈ గ్యాప్‌లో తనతో పెద్దగా ఫోన్లో మాట్లాడుకునే టైం దొరికేది కాదు. దీంతో మా ఇద్దరి మధ్యా గొడవలు వచ్చేవి. ఎంత గొడవపడినా మళ్లీ తనే కాల్చేసి మాట్లాడేది. కానీ ఓరోజు మా మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. నా ఓప్కి నశించి తనమీద గట్టిగా అరిచేశా. అంతే ..నీమీద ఉన్న నమ్మకం అంతా పోయింది నువ్వు నాకొద్దు. నీ ప్రేమా వద్దు అని చెప్పి వెళ్లిపోయింది. అరిచింది నా బుజ్జిపైనే కదా ఎప్పటిలానే తనే మళ్లీ కాల్ చేస్తుంది అనుకున్నా. కానీ నా మాటలు తనని ఎంత గాయపరిచాయో అప్పుడు అర్థమైంది. కాల్ చేసేది కాదు. నేను ఫోన్ చేసినా మాట్లాడేది కాదు. కొన్నిరోజులకి నాకు పెళ్లి అని తన నుంచి కాల్ వచ్చింది. ముందుగా నేను నమ్మలేదు. ఏదో కోపంగా అంటుంది అనుకున్నా .తర్వాత వాళ్ల ఫ్రెండ్స్ చెప్పాకా ఒక్కసారిగా నా గుండె ఆగిపోయినంత పనైంది. తనకి పెళ్లి అని తెలిసినప్పటినుంచి కన్నీళ్లతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నా. చివరిగా తను నాతో అన్న ఒకే ఒక్కమాట..నన్ను ప్రశాంతంగా బతకనివ్వు అని. ఇప్పడు జాబ్ చేయడం మానేశా. కోచింగ్ కూడా వదిలేశా. వచ్చే నెలలో తన పెళ్లి. తను ఎక్కుడున్నా ఎవరితో ఉన్నా సంతోషంగా ఉండాలి. --హరీష్ రాజు, నెల్లూరు -
లాగిపెట్టి కొట్టి ‘పిచ్చిదానిలా కనిపిస్తున్నానా?’..
నేను తొమ్మిదవ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తను ఏడవ తరగతి చదువుతుండేది. ఒకే ఊరు కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్లం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసే వాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ, ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు! నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్ వేసుకుని, ఆ పేపరు బ్యాగులో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ల ఇంట్లో వాళ్లు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడతున్నానని. ఇక అప్పటినుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్లినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ల పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. అలా రెండేళ్లు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్లీ మాట్లాడింది. కానీ, ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్లం. అందుకు వాళ్ల చెల్లెలు కూడా మాకు హెల్ప్ చేసింది. మెసేజెస్, కాల్స్ చేసుకునేవాళ్లం. మాకు ఆస్తిలేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ల మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. తను అప్పటినుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదు. నా వయసు 19 తనను తీసుకుని వెళ్లలేను. అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయింది. ఒకసారి అడిగా నేనంటే అంత ఇష్టమా అని తను లాగిపెట్టి కొట్టింది. ‘నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు. ఇంకెప్పుడూ అలా అడగకు. నువ్వంటే నాకు చాలా ఇష్టం! ఇలా అడుగుతావని నేనెప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకుని చచ్చిపోతాను. ఎప్పటికీ నీ కోసమే ఆలోచిస్తూ బ్రతుకుతాను’ అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్‌లో ఆరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా ‘మరి నాతో వచ్చేయొచ్చు కదా’ అని. తను రాను అంది. ఏం అంటే ‘మా ఇంట్లో వాళ్లకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్లు అవమానపడకూడదు.’ అంది. ‘మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు’ అన్నాను. ‘ నా లైఫ్ అంతే! ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు’ అంది. చాలా బాధగా అనిపించింది. అప్పుడు తనో కోరిక కోరింది. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా’ అని. ‘అదేంటీ?’ అన్నా. ‘ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి అనే ఫీలింగ్ నాకు చాలు. నువ్వు నన్ను చేసుకో’ అంది. తన బర్త్‌డే రోజు బొట్టు పెట్టించుకుంది. ‘నా బర్త్ డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తుంచుకుంటా’ అని ఏడ్చింది. ‘ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా’ అని అక్కడినుంచి వెళ్లిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్లల్లోనే తెలుస్తుంది. తన కళ్లు ఎప్పుడూ నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్లు చూస్తే ఆ కళ్లు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థం అవుతుంది. ఇంకో లైఫ్ ఉంటే నువ్వు నాతో లైఫ్ లాంగ్ ఉండాలని కోరుకుంటున్నా. నువ్వు ప్రేమించే నీ ప్రేమని, ఐ మిస్ యూ బంగారం! - స్వామి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
నువ్వు కుదరదంటే చచ్చిపోతా!!
అతడి పేరు సుభాష్! మా ఇంటి పక్కనే వాళ్ల ఇళ్లు. మా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది. ఒక రకంగా చెప్పాలంటే దూరపు బంధుత్వం కూడా. తను నాకు బావ వరుస అవుతాడు. చాలా స్నేహంగా ఉండేవాళ్లం చిన్నప్పటినుంచి. ఇంటర్ ఫైనల్ ఇయర్లో ఉన్నపుడు నాకు ప్రపోజ్ చేశాడు. నేనప్పుడు ఓకే చెప్పలేదు. డిగ్రీ ఇద్దరం ఒకే కాలేజ్‌లో చేరాము. నెలకోసారైనా నాకు ఐ లవ్ యూ చెప్పేవాడు. తెలిసిన వ్యక్తి, మంచి వాడు, పైగా రెండు కుటుంబాల మధ్య మంచి రిలేషన్ ఉంది! కాబట్టి, పెళ్లికి ఒప్పుకుంటారని నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్‌లో ఓకే చెప్పాను. నాతో చాలా ప్రేమగా ఉండేవాడు. ఓ వ్యక్తినాపై ఇంతలా ప్రేమ చూపించడం నాకు బాగా నచ్చేది. చూస్తుండగానే మా ప్రేమలో ఏడేళ్లు ఇట్టే గడిచిపోయాయి. ఈ ఏడేళ్లలో ఎన్నో మార్పులు. నాకు, అతడికి మధ్య ఎన్నో కలవని పాయింట్లు ఉన్నాయి. రోజురోజుకు అతడిపై ప్రేమ తగ్గుతూ వచ్చింది. ఇక మీదట అతడితో కలిసి ఉండటం కుదరదనిపించింది. ఇదే విషయం అతడికి చాలాసార్లు చెప్పి చూశాను. ‘ నేను నీతో కలిసి ఉండలేను’ అని. దానికి అతడు చాలా సీరియస్ అయ్యేవాడు, బాగా తిట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత క్షమాపణలు చెప్పి, ‘ నువ్వు కుదరదంటే నేను చచ్చిపోతాను’ అనేవాడు. అయినా పట్టువదలకుండా అతడికి నచ్చజెప్పటానికి ప్రయత్నించేదాన్ని. ‘మనిద్దరి దార్లు వేరు.. ఎప్పటికీ కలవవు’ అని. పట్టించుకునేవాడు కాడు. మేమిద్దరమూ పెళ్లి చేసుకోవాలనుకున్న విషయం మా ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు. నేను మా ఇంట్లో ఈ విషయం చెప్పటానికి ప్రయత్నించినపుడు వాళ్లు కూడా నా మాట వినలేదు. అతడితో బ్రేకప్ చెప్పి, మా రిలేషన్‌కు ఓ ఎండ్‌కార్డ్ వేద్దామని చేస్తున్న ప్రయత్నం ఎప్పటికి ఫలిస్తుందో. - శీ విధ్య, సూర్యాపేట లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
తనతో గొడవ.. ఫైనల్ రౌండ్లో..
కాలేజీకి వెళ్లి చదువు కోవడం.. ఇంట్లో పని చేయడం తప్ప ఏమీ తెలియని నా జీవితంలోకి అనుకోకుండా ఓ అమ్మాయి వచ్చింది. ఎప్పుడూ గొడవ పడే మేము ఫ్రెండ్స్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. నేను ఏ అమ్మాయి గురించి మాట్లాడినా గొడవ పడేది. అప్పుడే అర్థం అయింది.. తను నన్ను ప్రేమిస్తోందని. తన పుట్టినరోజుకు ముందు రోజు నాకు ప్రపోజ్ చేసింది. అప్పుడు నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు కానీ, హాలిడేస్‌కు తను ఇంటికి వెళుతుంటే నాకు ఏడుపొచ్చింది. ఆ రోజు అర్థమైంది! తనని నేను ప్రేమిస్తున్నానని. ‘నేను ఎక్కడికీ వెళ్లను బుజ్జి! మళ్లీ వస్తాగా’ అని తను వెళ్లిపోతుంటే చాలా బాధ. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను వచ్చి వెళ్లిన ప్రతీసారి బాధ పడుతూనే ఉన్నా. ఎందుకంటే ఎంత సేపు చూసినా తను నన్ను వదిలి వెళ్లే చివరి నిమిషం చాలా బాధిస్తోంది. అందరి లవ్ స్టోరీలో లాగే మా లవ్‌లో కూడా గొడవలు వచ్చాయి. కానీ, అపుడు మేము విడిపోలేదు. అడ్జస్ట్ అవుతూనే వచ్చాము. కానీ మా ప్రేమ పెళ్లి వరకు తీసుకు వెళ్లాలంటే మనీ, క్యాస్ట్ ప్రాబ్లమ్స్‌గా మారాయి. క్యాస్ట్ మార్చలేం కదా అందుకే మనీ అయినా ఉండాలనుకున్నాం. మాది ఒక పూర్ ఫ్యామిలీ! ఎంత పూర్ అంటే తనతో ఒక నైట్ ఫోన్ కాల్ మాట్లాడాలంటే వన్ డే హోటల్ సర్వర్‌గా పనిచేసే వాడిని. తనకి ఒక రింగ్ కొనాలని రెండు నెలలు బార్లో సర్వర్‌గా పని చేశా. తను రిచ్ గాళ్! ఎలా అయినా మా ఫ్యామిలీ, నేనూ డెవలప్ అవ్వాలనుకున్నాం. మా డాడీని ఒప్పించి చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాం. ఎలాగో డెవలప్ అయ్యాం. ఇక నేను మంచి జాబ్ చేయాలనుకున్నపుడు! ‘సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చెయ్’ అని చెప్పింది. ఎందుకంటే కొద్ది టైంలో ఎక్కువ శాలరీ రావాలంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్ కరెక్ట్ అనుకున్నాం. తనని సీఏ చేయమని చెప్పా. నాకా ఒక ముక్క ఇంగ్లీష్ రాదు! సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎలా? అనుకున్నా అప్పుడే వాళ్ల అక్కకి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాయి. తరువాత తనకి, సో! త్వరగా కోర్స్ చేసి మంచి జాబ్ తెచ్చుకోవాలి. ఆరు నెలల్లో చేయాల్సిన కోర్స్ ఒక నెలలో చేసి జాబ్ ట్రైల్స్‌కు ఫిబ్రవరి 14న వెళ్లా. నాకు తన దగ్గరకి వెళ్లాలని ఉండేది. తనకేమో నేను జాబ్ కోసం వెళ్లాలని ఉండేది. జాబ్‌కోసం సెర్చ్ చేస్తున్న టైంలో తనకి ఎగ్జామ్స్. నేను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యా! ఎంతో కష్టపడి ఇంటర్వ్యూ ఫైనల్ రౌండ్‌కు వెళ్లా. మా ఇద్దరి మధ్యా చిన్న గొడవ వల్ల సరిగా ఏకాగ్రత ఉంచలేక ఫైనల్ రౌండ్లో జాబ్ మిస్ అయింది. చదవకుండా టైం వేస్ట్ చేస్తోందని తనని తిట్టా. కానీ, మామూలే మళ్లీ చదవకుండా ఉండే సరికి కోపంలో బాగా తిట్టి, ‘నెల రోజులు వెయిట్ చెయ్ అమ్ము! గొడవ పడటానికి కరెక్ట్ టైం కాద’ని చెప్పా. వన్ మంత్ మాట్లాడలేదు. నాకు జాబ్ వచ్చేసింది! ఫుల్ హ్యాపీతో తనకి చెప్పా. అంతే ఏమైందో తెలీదు. ఆ వన్ మంత్ తను చాలా బాధ పడి నాపై ద్వేషం పెంచుకుంది. ‘నేను నీ సెకండ్ ఆప్షన్! నేను ఉంటే జాబ్ తెచ్చుకోలేవా’ అని వెళ్లి పోయింది. తనే తిరిగి వస్తుందిలే అనుకున్నా. కానీ రాలేదు . తను వస్తుందని 4 సంవత్సరాలుగా వెయిట్ చేస్తూనే ఉన్నా. ‘తప్పకుండా వస్తావ్ కదా అమ్ము .. నీకోసం ఎదురు చూస్తూనే వుంటా . మిస్ యూ అమ్ము.. లవ్ యు బంగారం ...లవ్ యూ ఫరెవర్ బంగారం.. - బుజ్జి లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి -
కోర్టు కేసులు, జైలు.. మూడేళ్ల ప్రేమ
తొండంగి కొమ్మనాపల్లి గ్రామానికి చెందిన నులక తాటి సతీష్, కృష్ణా జిల్లా వీర్లుపాడు మండలం జయంతి గ్రామానికి చెందిన పడిగెల అఖిల మధ్య మూడేళ్ల క్రితం ప్రేమ చిగురించింది. చిట్టచివరకు కోర్టు కేసులు,జైలు తదితర పరిణామాలను అధిగమించి చట్టప్రకారం ఒక్కటైంది ఆ జంట. సతీష్‌ది కొమ్మనాపల్లిలో కూలీ పని చేసుకుని జీవించే చిన్న కుటుంబం. ఆశించిన స్థాయిలో పని లేకపోవడంతో ఆర్థిక సమస్యలతో నాలుగేళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. చిక్కడ్పల్లి ప్రాంతంలో అపార్ట్మెంట్ వాచ్‌మన్‌గా అతడి తండ్రి దాసు పనిచేయటంతో కుటుంబం అంతా అక్కడే నివాసం ఉంది. ఇంటర్ వరకూ చదువుకున్న సతీష్ మాదాపూర్‌లోని సాఫ్ట్వేర్ కంపెనీలో ఆఫీస్‌బాయ్‌గా చేరాడు. అదే అపార్ట్మెంట్లో కృష్ణాజిల్లా వీర్లుపాడు మండటం జయంతి గ్రామానికి చెందిన పి.అయ్యప్ప వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. దీంతో అతడి కుటుంబం కూడా అక్కడే నివాసం ఉంటోంది. ఆఫీస్ బాయ్‌గా ఉన్న సతీష్ వస్తూపోతూ ఉండడంతో అయ్యప్ప కుమార్తె అఖిలకు, అతడికి మధ్య స్నేహం ఏర్పడింది. 2017నాటికి అది కాస్తా ప్రేమగా మారింది. అదే ఏడాది జనవరి 20న వారిద్దరూ ప్రేమ బాసలు చేసుకున్నారు. కాలక్రమంలో వారి వ్యవహారం పెద్దలకు తెలిసింది. కులాలు వేరు కావటంతో అఖిల తండ్రి ఆమెను స్వగ్రామం జయంతికి పంపించారు. సుమారు ఆరునెలల అనంతరం ఫోన్ల ద్వారా మాట్లాడుకున్నారు. ఆగస్టులో వారిద్దరూ ఎవరికీ చెప్పకుండా చెన్నై వెళ్లారు. దీంతో అఖిల తల్లిదండ్రులు స్వగ్రామం పరిధి పోలీస్ స్టేషన్లో సతీష్‌పై మైనర్ అయిన తన కుమార్తెను కిడ్నాప్ చేశాడని ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సతీష్ తల్లిదండ్రులుకు సతీష్, అఖిల చెన్నైలో ఉన్నారని తెలియడంతో ఫోన్లో వారికి నచ్చచెప్పారు. దీంతో సతీష్, అఖిల ఇద్దరూ తొండంగి మండలంలోని స్వగ్రామం కొమ్మనాపల్లికి వచ్చారు. సతీస్ తల్లిదండ్రులు వీరిద్దరినీ ఒంటిమామిడి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. అప్పటికే అఖిల తండ్రి సతీష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అయ్యప్పను కూడా రప్పించారు. మైనర్ కావటంతో పోలీసులు అఖిలను అయ్యప్పతో పంపించారు. కేసుకు సంబంధించి వీర్లుపాడు పోలీస్స్టేసన్నుంచి ఒంటిమామిడి పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు. అప్పటికే సతీష్‌పై కేసు నమోదు చేయడంతో ఫోక్సో చట్టం కింద అరెస్టు చేశారు. కోర్టు ఉత్తర్వుల మేరకు నందిగామ సబ్‌జైలులో సతీష్ సుమారు 63రోజులు ఉన్నాడు. అనంతరం బెయిల్‌పై బయటకు వచ్చి కోర్టు వాయిదాలకు తిరుగుతున్నాడు. కాలం గడుస్తోంది. సతీష్ మళ్లీ హైదరాబాద్‌లో ఉద్యోగంలో చేరాడు.అఖిల నందిగామలో టైలరింగ్ నేర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ ద్వారా సతీష్ నెంబర్ సేకరించిన అఖిల ఫోన్ చేసి తన ప్రేమను కొనసాగించింది. ఈ ఏడాదితో మైనార్టీ తీరి జనవరి నాటికి మేజర్ కావడంతో సతీష్‌ను పెళ్లిచేసుకునేందుకు నందిగామ నుంచి అన్నవరం చేరుకుంది. అన్నవరంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్దల సమక్షంలో ఇద్దరూ ఒక్కటయ్యారు. 2017లో తన ప్రియురాలు తనకు ప్రపోజ్ చేసిన రోజైన జనవరి 20నే వివాహం చేసుకున్నట్లు సతీష్ తెలిపాడు. లేదా worldoflove@sakshi.comకు మెయిల్ చేయండి
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement