-
వండర్‌బుక్‌లో మణిపూసలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్బుక్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజిలప్పకు సన్మానం... బొంరాస్‌పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు. -
5 కిలోమీటర్లు పరుగెత్తిన నిండు గర్భిణీ
కరీంనగర్ : కరీంనగర్‌కు చెందిన కామారపు లక్ష్మి(43) అనే తొమ్మిది నెలల గర్భిణీ 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తి అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమేకాదు, 'తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో స్థానం సంపాదించింది. ఆదివారం స్థానిక అంబేద్కర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో 5 కిలోమీటర్ల దూరాన్ని 30 నిమిషాల 20 సెకన్లలో చేరుకుని రికార్డు నెలకొల్పింది. ప్రత్యక్షంగా తిలకించిన తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఆమెకు గుర్తింపు పత్రం అందజేశారు. నిండు గర్భిణీగా ఉండి, 5 కిలోమీటర్ల దూరం పరుగెత్తటం తెలంగాణ రాష్ట్రంలో ఇదే ప్రథమమని తెలిపారు. గిన్నిస్ బుక్ నిర్వాహకులకు కూడా సిఫారసు చేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా క్రీడాకారిణి అయిన లక్ష్మి భర్త రవీందర్ కూడా క్రీడాకారుడే. వారికి మూడేళ్ల కూతురు ఉంది. ఈ వారంలోనే ఆమెకు కాన్పు కానుందని తెలిసింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్‌స్టాప్‌గా...
- ఐపీఎల్‌పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్‌లో 'హీరామండి'.. సిరీస్‌పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్‌లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్‌బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement