బర్త్డే ఖర్చు 9వేల కోట్లు
లండన్: బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా దేశమంతటా సంబరాలు జరిపేందుకు ప్రజలు బిలియన్ పౌండ్లు (రూ.9 వేల కోట్లు) ఖర్చుచేస్తారని ‘ద సండే టైమ్స్’ పత్రిక సర్వేలో వెల్లడైంది. 90వ ఏట అడుగుపెడుతున్న ఎలిజబెత్ బర్త్డే వేడుకలను ఏప్రిల్ 21 (అసలు బర్త్డే) మొదలుకుని జూన్ 11న(అధికారిక) వరకు జరపనున్నారు.
వేడుకల్లో మూడో వంతు బ్రిటిషర్లు హాజరై.. పబ్బులు, బార్లు, వీధి పార్టీల్లో పాల్గొంటారని తెలిపింది. ఇందుకోసం ఒక్కో బ్రిటన్ పౌరుడు 42.98 పౌండ్లు ఖర్చుపెట్టనున్నట్లు పేర్కొంది. జూన్ 12న జరిగే సంబరాల ముగింపు ఉత్సవంలో ప్రిన్స్ విలియమ్, హ్యారీ పాల్గొననున్నారు.