-
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్‌రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్‌లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్‌రావుకు సవాల్ విసిరారు. హరీశ్‌కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్‌కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు. -
జనసేనకు మూకుమ్మడి రాజీనామా..!
-
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 500 మంది వాలంటీర్లు రాజీనామా
-
చిరాగ్ పాశ్వాన్‌కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్‌జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
టీడీపీ, జనసేన వేధింపులు తాళలేకపోతున్నాం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను టీడీపీ, జనసేన నాయకులు వేధిస్తుండడంతో రాజీనామా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరానికి చెందిన 15 మంది వలంటీర్లు చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు వారి రాజీనామాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం 1వ డివిజన్ 2వ సచివాలయానికి చెందిన ఒకరు, 48వ డివిజన్ 89వ సచివాలయానికి డివిజన్‌కు చెందిన ఐదుగురు, 90వ సచివాలయానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు రాజీనామాలను అడ్మిన్ సెక్రటరీలకు అందజేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువ అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో విధినిర్వహణ సమయంలో టీడీపీ, జనసేన నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మిత్రులు, బంధువులతో మాట్లాడినా అనుమానంగా చూస్తున్నారని, ఇది భరించలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వలంటీర్లుగా కొనసాగలేమని చెప్పారు. ఈ విషయమై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి స్పందిస్తూ.. 15 మంది వలంటీర్ల రాజీనామాలు అందాయన్నారు. వాటిపై కమిషనర్‌కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు
డ్రైవర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్యం
చంద్రబాబూ 14 ఏళ్లు ఏం చేశావు?
నీట్‌కు ఏర్పాట్లు పూర్తి
‘పోస్టల్ బ్యాలెట్’ను వినియోగించుకోండి
పార్లమెంట్లో గళం వినిపిస్తా..
స్వర్ణకవచాలంకరణలో రామయ్య
హామీలపై ఆశలు..
నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement