-
ఏపీలో రేపటి నుంచి భారీ వర్షాలు
గుంటూరు, సాక్షి: భానుడి భగభగలతో.. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో.. ఉక్కపోతలతో అల్లలాడిపోతున్న ఏపీ ప్రజలకు చల్లటి కబురు. వాతావరణంలో మార్పులతో రాబోయే మూడు నాలుగు రోజులు ఎండలు, వడగాలులు తగ్గు ముఖం పట్టనున్నాయి. అదే సమయంలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్నాయి.రేపటి నుంచి మూడు రోజులు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ, గుంటూరుతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది.అలాగే.. తీవ్ర ఉష్ణోగ్రతలతో నిప్పుల కొలిమిని తలపిస్తున్న కోస్తా, రాయలసీమ జిల్లాల పరిధిలోనూ రెండ్రోజులపాటు(7-9 తేదీల మధ్య) వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్ష ప్రభావంతో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయంది. అలాగే మిగతా ప్రాంతాల్లోనూ తేలికపాటి వర్షాలు ఉండొచ్చని వాతావరణ శాఖ తెలిపింది.దక్షిణ ఛత్తీస్ ఘడ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. ఇదిలా ఉంటే.. ఆదివారం నంద్యాల జిల్లా మహానందిలో 45.8 డిగ్రీల సెల్సియస్, కర్నూలు జిల్లా సింగవరంలో 45.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
తెలంగాణ అంతటా భారీ వర్ష బీభత్సం (ఫొటోలు)
-
దుబాయ్‌లో దంచికొట్టిన వాన.. సముద్రాన్ని తలపిస్తున్న ఎడారి దేశాల (ఫొటోలు)
-
ఏడాది వర్షం ఒకే రోజు.. దుబాయ్ అతలాకుతలం.. 18 మంది మృతి!
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధాని దుబాయ్ భారీ వర్షాలకు తల్లడిల్లిపోయింది. ఎడతెగని వర్షాలు వీధులు, ఇళ్లు, మాల్స్‌ను జలమయం చేశాయి. హఠాత్తుగా వస్తున్న ఉరుములు, మెరుపులు ప్రజలను భయకంపితులను చేశాయి. సోమవారం అర్థరాత్రి ప్రారంభమైన భారీ వర్షం మంగళవారం ఉదయం వరకు కొనసాగింది. జాతీయ వాతావరణ కేంద్రం దేశంలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఒమన్‌లో భారీ వర్షాల కారణంగా 18 మంది మృతి చెందారు. ఏడాది మొత్తం మీద కురవాల్సిన వర్షం ఒకే రోజు కురవడంతో దుబాయ్ నగరం అతలాకుతలమైపోయింది. గత 75 ఏళ్లలో ఎన్నడూ లేని రీతిలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. Everything Problem has a Solution, But...#Dubai #dubairain #DubaiStorm #dubairains #meme #Dubaifloods pic.twitter.com/IqoiuElg3J — Ashique Hussain / عاشق حسين (@47aq_) April 17, 2024 ఖలీజ్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం జాతీయ వాతావరణ కేంద్రం దుబాయ్, అబుదాబి, షార్జా ప్రజలను అప్రమత్తం చేస్తూ, రాబోయే 48 గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది. బుధవారం వరకు ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. Easy guys @LarryMadowo @kipmurkomen #DubaiMetro pic.twitter.com/sPyy97EMBK — EVOLUTION EXPRESS LOGISTICS (@LetsGoEvolution) April 16, 2024 జాతీయ వాతావరణ కేంద్రం నిపుణుడు అహ్మద్ హబీబ్ మాట్లాడుతూ దుబాయ్, అబుదాబి, షార్జా, ఎమిరేట్స్‌లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా. సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్క్ చేయాలని సూచించారు. This is the Dubai airport after the biggest flood of history. pic.twitter.com/Kv2Hgam9jM — Baba Banaras™ (@RealBababanaras) April 17, 2024 దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి మాట్లాడుతూ తుఫాను కారణంగా మంగళవారం మధ్యాహ్నం 25 నిమిషాల పాటు కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేశామని, ఆ తరువాత తిరిగి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. మరోవైపు మెట్రో సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 🚨🇦🇪 Severe weather today in Dubai#برشلونه_باريس #TSTTPD #bbtvi #Dubai #dubairain #dubairains pic.twitter.com/n426GYnZX7 — Imranzeemi (@imranzeemi) April 17, 2024 వీటిని ఎప్పుడు పునరుద్ధరిస్తారో తెలియక వందలాది మంది జనం దుబాయ్ మాల్లో చిక్కుకుపోయారు. భారీ వర్షాల కారణంగా యూఏఈ అంతటా పాఠశాలలను మూసివేశారు. యూఏఈలోని కొన్ని ప్రాంతాల్లో 24 గంటల వ్యవధిలో 80 మిల్లీమీటర్ల (3.2 అంగుళాలు) కంటే అధిక వర్షపాతం నమోదయ్యింది. దుబాయ్‌లో కురిసిన భారీ వర్షానికి విమానాశ్రయం, మెట్రో స్టేషన్లు, మాల్స్, రోడ్లు, వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గడచిన 24 గంటల్లో దాదాపు 160 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది ఒక రోజులో దాదాపు 1.5 సంవత్సరాల సగటు వర్షపాతం. Dubai: Timelapse of the massive storm that caused a historic flood. pic.twitter.com/tackWMYJzO — Pagan 🚩 (@paganhindu) April 17, 2024 తుఫాను కారణంగా పలు పాఠశాలలను మూసివేయగా, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఈ భారీ వర్షాలు దాదాపు అన్ని అరబ్ దేశాలలో విపత్తుకు కారణంగా నిలిచాయి. వాతావరణ మార్పుల కారణంగా కుండపోత వర్షపాతం సంభవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వాతావరణ శాస్త్రవేత్త అహ్మద్ హబీబ్ తెలిపిన వివరాల ప్రకారం క్లౌడ్ ఫార్మేషన్ల నుంచి ప్రయోజనాన్ని పొందడానికి గల్ఫ్ స్టేట్‌లోని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియోరాలజీ అల్ ఐన్ విమానాశ్రయం నుండి సీడింగ్ విమానాలను పంపింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనూ భారీ వర్షాలు పడ్డాయి. 🚨 UAE🇦🇪 View of Dubai Airport after heavy Rain pic.twitter.com/wY2ALp35A8 — Izlamic Terrorist (@raviagrawal3) April 16, 2024 -
Afghan: ఆకస్మిక వరదలు.. 33 మంది మృతి!
అఫ్గానిస్తాన్‌లో కురిసిన భారీ వర్షాలు వరద బీభత్సాన్ని సృష్టించాయి. ఈ వరదల కారణంగా 33 మంది మృతి చెందగా, 27 మంది గాయపడ్డారు. రాజధాని కాబూల్‌తో పాటు పలు రాష్ట్రాల్లో అకస్మాత్తుగా వరదలు సంభవించాయి. తాలిబాన్ ప్రతినిధి అబ్దుల్లా జనాన్ సాక్ దేశంలో సంభవించిన వరదలకు సంబంధించిన వివరాలను మీడియాకు తెలిపారు. వరదల కారణంగా దేశంలో 600కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని అబ్దుల్లా జనాన్ తెలిపారు. వర్షాల కారణంగా 200 పశువులు మృతిచెందాయని, 800 హెక్టార్లలోని పంటలు దెబ్బతిన్నాయన్నారు. 85 కిలోమీటర్లకు పైగా రోడ్లు దెబ్బతిన్నాయని ,పశ్చిమ ఫరా, హెరాత్, సదరన్ జాబుల్, కాందహార్లకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. అఫ్గానిస్తాన్‌లోని 34 రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. గత ఫిబ్రవరిలో తూర్పు అఫ్గానిస్తాన్‌లో భారీ హిమపాతం కారణంగా కొండచరియలు విరిగిపడి 25 మంది మృతి చెందారు. మార్చిలో కురిసిన వర్షాలకు 60 మంది మృత్యువాత పడ్డారు. అఫ్గానిస్తాన్‌లోని వాతావరణ పరిస్థితుల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయని ఐక్యరాజ్యసమితి గత ఏడాది హెచ్చరించింది. దీనికి గ్లోబల్ వార్మింగ్ కారణమని పేర్కొంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్‌కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement