-
పునర్నవి ప్రెగ్నన్సీ పై, అషు తో ప్రేమ పై క్లారిటీ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్
-
పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్.. ఛీ ఛీ నన్నెందుకు ఇరికిస్తారు?
బిగ్‌బాస్ షోతో ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది పునర్నవి భూపాలం. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పున్ను ఆ తర్వాత పలు చిత్రాలు చేసినా వర్కవుట్ కాలేదు. కానీ ఎప్పుడైతే బిగ్‌బాస్ మూడో సీజన్లో అడుగుపెట్టిందో అప్పుడే యూత్ క్రష్‌గా మారిపోయింది. ఈ రియాలిటీ షోలో పునర్నవి- రాహుల్ సిప్లిగంజ్ లవ్ ట్రాక్ బాగా క్లిక్కయింది. కానీ బయటకు వచ్చాక మాత్రం ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నారు. పునర్నవితో రాహుల్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నత చదువులు చదువుతున్న పునర్నవి గర్భం దాల్చిందంటూ ఆ మధ్య వార్తలు వచ్చాయి. దీనిపై పున్నూ ఘాటుగా స్పందిస్తూ పిచ్చిరాతలు రాయకండి. నేను ప్రెగ్నెంట్ ఏంటి? అని సీరియస్‌గానే కౌంటరిచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కూడా ఇదే ప్రశ్న ఎదురైంది. అషూ రెడ్డితో రాహుల్ ఈ విషయంపై రాహుల్ మాట్లాడుతూ.. 'ఛీ ఛీ.. నన్నెందుకు ఇరికిస్తారు? జీవితంలో ఇద్దరం ఎవరిదారి వారు చూసుకున్నాం. బిగ్‌బాస్ తర్వాత ఎన్నో హిట్ పాటలు పాడా. బిజినెస్ మొదలుపెట్టా. తన కెరీర్లో తను బిజీగా ఉంది. ఎప్పుడైనా ఒకసారి మాట్లాడుకుంటామంతే! అషూ విషయానికి వస్తే తను నా బెస్ట్ ఫ్రెండ్. తను ఎంత మంచిదంటే.. చుట్టూ ఉన్న ఎంతో మందికి సాయం చేస్తుంటుంది. మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహం మాకు తెలుసు. ప్రతిసారి అందరికీ వివరించి చెప్పలేను' అని చెప్పుకొచ్చాడు. -
గుడ్‌న్యూస్ చెప్పిన పునర్నవి, ట్విస్ట్ ఇచ్చిన నటి తల్లి
ఉయ్యాల జంపాల సినిమాతో ప్రేక్షకులను తనవైపు ఆకర్షించింది పునర్నవి భూపాలం. ఆ తర్వాత బిగ్‌బాస్ నాలుగో సీజన్‌తో బుల్లితెర ఆడియన్స్‌కు దగ్గరైంది. రాహుల్ సిప్లిగంజ్‌తో లవ్ ట్రాక్ నడిపి మరింత ఫేమస్ అయింది. అయితే విచిత్రంగా ఈ షో తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. కాగా ప్రస్తుతం యూకేలో ఉంటున్న పునర్నవి తాజాగా ఓ గుడ్‌న్యూస్ షేర్ చేసుకుంది. పీజీ డిప్లొమా ఇన్ డ్రామా అండ్ మూవ్మెంట్ థెరపీ కోర్సు పూర్తైందని తెలిపింది. మరి ఇండియాకు ఎప్పుడొస్తావక్కా? అన్న ప్రశ్నకు 'వచ్చే నెల నుంచి ఇండియాకే అంకితం.. పండగ చేస్కోండి పో' అని రిప్లై ఇచ్చింది. వెంటనే పున్నూ తల్లి స్పందిస్తూ.. తను అబద్ధం చెప్తోంది.. వచ్చే నెలాఖరు నుంచి అమెరికాలో ఉండబోతోంది అని క్లారిటీ ఇచ్చింది. దీంతో సీక్రెట్ రివీలైపోయిందనుకున్న షన్నూ.. ఎందుకు చెప్పావమ్మా అన్నట్లుగా ఓ ఎమోజీని షేర్ చేసింది. చదవండి: ఇలాంటివాళ్లను బాయ్‌కాట్ చేయాలి.. రష్మికపై ట్రోలింగ్ -
గేతో పునర్నవి ప్రెగ్నెంట్ అంటూ పిచ్చిరాతలు.. స్పందించిన నటి
బిగ్‌బాస్ బ్యూటీ పునర్నవి భూపాలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఉయ్యాల జంపాల సినిమాలో తొలిసారి కనిపించిన పునర్నవి ఆ తర్వాత కొన్ని చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బిగ్‌బాస్ సీజన్-3లో పాల్గొని యూత్ క్రష్‌గా మారిపోయిందీ బ్యూటీ. ఆ మధ్య వెబ్‌సిరీస్‌లో కనిపించినా ఆ తర్వాత సినిమాలు, సిరీస్‌లకు గుడ్‌బై చెప్పేసి లండన్‌కు వెళ్లిపోయింది. సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన అప్డేట్స్ని షేర్చేసుకునేది. ఈ క్రమంలో రీసెంట్గా పునర్నవి పెళ్లి కాకుండానే తల్లి కాబోతుందంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యకాలంలో ఆమె షేర్ చేసిన ఫోటోల్లో పునర్నవి పొట్ట భాగం కాస్త పెద్దదిగా కనిపించడంతో ఈ రూమర్స్‌కి మరింత వైరల్ అయ్యాయి. ఈ విషయం పునర్నవి దాకా చేరడంతో ఆమె కాస్త బోల్డ్‌గానే స్పందించింది. ''నా గే బెస్టీతో ప్రెగ్నెన్సీ వచ్చిందని కొన్ని యూట్యూబ్ చానెల్స్‌లో ఇష్టారీతిన వార్తలు రాసేశారు. ఇది నాన్ సెన్స్. గత నెలలో నేను కాస్త సిక్ అయ్యాయని చెబితే, ప్రాణాపాయం అని రూమర్స్ సృష్టించారు. ఇప్పుడేమో నేను ప్రెగ్నెంట్ అని రాశారు. సోషల్ మీడియాలో చూసి నమ్మేయకండి. ఏది నిజమో, కాదో తెలుసుకోండి. మీరు రాసే పిచ్చిరాతలు అవతలి మనిషిని ఎంతలా ప్రభావితం చేస్తాయో ఆలోచించండి'' అంటూ ఘుటుగానే బదులిచ్చింది. ప్రస్తుతం పునర్నవి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
కొత్త సంవత్సరంలో బ్యాడ్ న్యూస్ చెప్పిన పునర్నవి
ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్ ద్వారా పాపులర్ అయిన నటి పునర్నవి భూపాలం. అంతకు ముందు ఉయ్యాల జంపాల వంటి పలు చిత్రాల్లో నటించినప్పటికీ అవి అమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ బిగ్‌బాస్ మూడో సీజన్లో పాల్గొని, తనదైన ఆటతీరుతో అందరిని ఆకట్టుకుంది. ఏ విషయంలోనైనా ఓపెన్‌గా మాట్లాడుతూ..బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చకుంది. బిగ్‌బాస్ షో తర్వాత చాలా సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ.. నో చెప్పి పై చదువుల కోసం లండన్ వెళ్లింది. ప్రస్తుతం ఆమె లండన్‌లో సైకాలజీలో హయ్యర్ స్టడీస్ చేస్తోంది. లండన్ వెళ్లినప్పుటికీ సోషల్ మీడియా తరచూ తన పోస్ట్‌లు పెడుతూ ఫ్యాన్స్‌కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు వీలు చిక్కినప్పుడల్లా లైవ్‌చాట్‌లో ఫ్యాన్స్‌తో చిట్‌చాట్ చేస్తుంది. కొద్ది రోజులుగా సైలెంట్‌గా ఉన్న పునర్నవి కొత్త సంవత్సరంలో ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ చెప్పింది. తాను కొద్ది రోజుల క్రితం అనారోగ్యం బారిన పడ్డానంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ షేర్ చేసింది. ‘కొద్ది రోజులుగా ఛాతి(ఊపిరితిత్తులకు సంబంధించిన) సమస్య(Chest Congestion) వ్యాధితో బాధపడుతున్నా. నా కొత్త సంవత్సరం ఇలా మొదలైంది. చాలా రోజులుగా(long sick) అనారోగ్యంతో బాధపడటం ఇదే మొదటిసారి. ఇదే చివరిసారి కావాలని ఆశిస్తున్నా’ అంటూ తన ఫొటో షేర్ చేసింది. అలాగే మరో ఫొటో షేర్ చేస్తూ.. ‘ఇప్పటికీ అనారోగ్యంగానే(Still Sick)’ ఉన్నాను అంటూ క్యాప్షన్ ఇచ్చింది. చదవండి: వ్యాపారవేత్తతో శ్రీముఖి పెళ్లి? త్వరలోనే అధికారిక ప్రకటన!
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
ఇరాన్ నుంచి పారిపోయి కొచ్చికి భారత మత్స్యకారులు
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement