breaking news
Pencil cut
-
హెప్పెప్టిప్టాప్
హెప్ అంటే ఇంగ్లిషులో చాలా స్టైలిష్. లేటెస్ట్‌లో లేటెస్ట్ అన్నమాట. ఇక పెప్ అంటే సూపర్ ఎనర్జీ ఉందన్నమాట. కొత్తగా వచ్చిన పెప్లమ్ జాకెట్స్లో హెప్ ఉంది పెప్ ఉంది. అలాంటి జాకెట్స్ వేసుకుంటే హెప్పెప్టిప్టాపే మరి... పెప్లమ్ డిజైనర్ టిప్స్ పొట్టి స్కర్ట్లు, ఫిటెడ్ జాకెట్స్, బ్లౌజ్,.. లకు నడుము వద్ద అదనంగా మరో ఫ్యాబ్రిక్‌ను జత చేయడాన్నే పెప్లమ్ అంటారు. పెప్లమ్ అనే పదం ప్రాచీన గ్రీకు మహిళల గార్మెంట్‌ను ఉద్దేశించి వాడింది. అంటే, నాటి నుంచి పెప్లమ్ రకరకాల స్టైల్స్‌ను చూపుతూనే ఉందన్నమాట. ఒక్క పెప్లమ్ టాప్ వార్డ్‌రోబ్‌లో ఉంటే చాలు ఎన్ని రకాల స్టైల్స్ అయినా వేషధారణలో చూపించవచ్చు. పెప్లమ్లో స్లిమ్‌గా కనిపించాలంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్‌ను ఎంచుకోవాలి. బాటమ్‌గా పెన్సిల్ కట్ స్కర్ట్, ప్యాంట్స్ ఎంచుకోవాలి. కాంట్రాస్ట్ ఆభరణాలు మెడలో వేసుకోవాలి. హ్యాండ్ బ్యాగ్ బదులు క్లచ్ చేత పట్టుకోవాలి. పెప్లమ్ గౌన్లు రెడ్‌కార్పెట్ వేదికలకు ప్రముఖ సినీతారలు ధరిస్తుంటారు. అవర్గ్లాస్ బాడీ కొలతలు గలవారికీ పెప్లమ్ గౌన్ మరింత అందాన్నిస్తుంది. -
హలో మిస్టర్... ఇదిగో ధోతీ
హలో మిస్టర్ చూశారా ఈ విడ్డూరం!! మీరు ధోతి మానేసి పెన్సిల్‌కట్, వెయిస్ట్కట్, కట్,.. కట్... అంటూ జీన్ ప్యాంట్స్ వేసుకోవడం మొదలుపెట్టారు. అంతటితో ఆగారా..! మన ధోతి గొప్పతనమే మర్చిపోయారు. లలనామణులు అలా కాదు. మీకు ధోతిని గుర్తుచేయడమే కాకుండా.. దానిని చీరతో జతచేసి ఓ డిఫరెంట్ స్టైల్‌తో వెలిగిపోతున్నారు చూడండి. మరి, ఆడాళ్లా మజాకా..! మూలం ఇదీ... గుజరాతీ మహిళల చీరకట్టును చూశారా! ఆ కట్టును పోలినట్టుగా ఉండే ఈ స్టైల్‌కి కొంచెం వెస్టర్న్ కట్స్‌ను జోడించారు డిజైనర్లు. రాచరికమైన ఆకర్షణ ఈ కట్టులో ఉండటంతో వేడుకలలో మెరిసిపోవడం మొదలైంది. సందర్భానికి తగ్గ వేడుకకు డిజైనర్ కొత్త టచ్ ఇవ్వడంతో మరింతగా మెరిసిపోతోంది. సోనమ్ కపూర్.. ధోతి కట్టు శారీ అనగానే సోనమ్ కపూర్ కళ్లముందు దర్శనమిస్తుంది. అంతగా ఈ కట్టుకు ఆమె ప్రాచుర్యం తీసుకువచ్చింది. డిజైనర్లు అనామికా ఖన్నా, తరుణ్ తహిల్యాని, నిఖిల్ తంబి, గారంగ్.. వంటి ప్రముఖ డిజైనర్లు ధోతీకట్టులో ఎన్నో ఆకర్షణీయమైన మార్పులు తీసుకువచ్చారు. గ్లామర్... నాటి రోజుల్లో నారీమణులు ధరించిన నారచీరల కట్టు ఎలా ఉండేదో మనకు సుపరిచితమే. దానినే పోలినట్టుగా ఉండే ఈ ధోతీ స్టైల్ అతివల మనసును అమాంతం లాగేసుకుంది. సంప్రదాయ చీరకట్టుకు కాస్త గ్లామర్ టచ్ ఇవ్వడానికి టాలెంట్ గల డిజైనర్లు మగవారి ధోతి కట్టును, చీరకు జత కలిపారు. దీంట్లో ఎన్నో సృజనాత్మకమైన స్టైల్స్‌ను తీసుకువచ్చారు. ఆరు గజాల చీరను మూడు గజాలకు తగ్గించి, పెట్టీకోట్గా లెగ్గింగ్, ధోతీ ప్యాంట్స్/ఎలిఫెంట్ ప్యాంట్స్/ ఫ్లేర్డ్ ప్యాంట్స్/.. మీదకు కొంగులా ధరిస్తే చాలు ఈ చక్కని రూపం మీ సొంతం. ధోతీ శారీ టిప్స్... పండగల్లోనూ విశేషంగా నిలుస్తోన్న ఈ స్టైల్నిమీరూ ఇంట్లోనే ఫాలో అయిపోవచ్చు.రెడీ మేడ్ ధోతినీ ధరించి, నడుముభాగాన ఒకవైపు 3-4 చీరకుచ్చులను టక్ చేయాలి. కుచ్చులు మరీ పెద్దగా, అలాగని చిన్నవిగా కాకుండా కనీసం 4 ఇంచులు ఉండాలి.ఎడమవైపు కొంగు భాగాన్ని నడుము చుట్టూ తిప్పి, ఎడమ భుజం మీదకు తీసుకొచ్చి పిన్ చేయాలి.కుచ్చిళ్లు ముందు, వెనక, భుజం మీదుగా సరిగ్గా వచ్చాయో లేవో చెక్ చేసుకుంటే సరిపోతుంది. - ఎన్.ఆర్