కౌలాస్‌లో పెరుగుతున్న నీటిమట్టం
జుక్కల్ : మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ నీటిమట్టం 455.30 మీటర్లకు చేరిందని జేఈ గజానన్ తెలిపారు. గురువారం ప్రాజెక్ట్ ఎగువ భాగాన కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి 200 కూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోందని పేర్కొన్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురిసిన నీటికి ప్రాజెక్ట్‌లో వరద వస్తుందని అన్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 458 మీటర్లకు గాను ప్రస్తుతం 455.30 మీటర్ల వరకు నీరు ఉందన్నారు. మరో 2 మీటర్ల మేర నీరు చేరితే గేట్లు ఎత్తి వేస్తామని జేఈ తెలిపారు.