breaking news
Nigeria Government
-
మేం ఆకలితో చస్తుంటే... మీకు మరో విమానమా?
ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలి నైజీరియా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో అధ్యక్షుడు బోలా టినుబు కోసం కొత్త విమానాన్ని కొనడంపై నైజీరియన్లు మండిపడుతున్నారు. ఆకలి, పెరుగుతున్న జీవన వ్యయంపై దేశవ్యాప్తంగా అసంఖ్యాకులు రోడ్లపైకెక్కి నిరసన వ్యక్తం చేసిన రెండు వారాలకే ఈ పరిణామం జరిగింది. ఆఫ్రికాలో అత్యధిక జనాభా కలిగిన దేశం నైజీరియా. గతేడాది అధ్యక్షునిగా ఎన్నికైన టినుబు పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించడానికి, దీర్ఘకాలిక వృద్ధికి ఊతమివ్వడానికి తప్పదంటూ ఇంధన సబ్సిడీలను తొలగించారు. దాంతో ద్రవ్యోల్బణం చుక్కలనంటుతోంది. దీంతో తన సొంత పరివారంతో సహా అధికారిక ప్రయాణాలను, ప్రతినిధులను తగ్గిస్తున్నట్లు జనవరిలో ప్రకటించారు. ఉన్నట్టుండి ఇప్పుడిలా ఎయిర్ బస్ ఎ330 విమానాన్ని కొనుగోలు చేశారు. ఆయన సొంత విమానాల శ్రేణిలో ఇది ఏడోది! కొత్త విమానంలోనే గత సోమవారం ఫ్రాన్స్ వెళ్లారు.డబ్బు ఆదా అవుతుందట!తాము ఆకలితో చస్తుంటే అధ్యక్షునికి కొత్త విమానం కావాల్సొచందా అంటూ నైజీరియన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మెరుగైన రేపటి కోసం ఈ రోజు కష్టాలు భరించక తప్పదంటూ అధ్యక్షుడు సుద్దులు చెప్పారు! ఇదేనా ఆ మెరుగైన రేపు?’’అంటూ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. 150 నైజీరియన్ బిలియన్లు పెట్టి మరీ విమానం కొనుక్కోవడం సగటు నైజీరియన్ల పట్ల అధ్యక్షునికి ఏమాత్రం బాధ్యత లేదనేందుకు రుజువంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అధికారులు మాత్రం విమాన కొనుగోలును సమర్థించుకుంటున్నారు. పాత విమానాలకు కాలం చెల్లడంతో వాటి నిర్వహణ వ్యయం తడిసి మోపెడవుతోంది. ఆ లెక్కన కొత్త విమానం వల్ల డబ్బు ఆదాయే అవుతుంది’’అంటూ అధ్యక్షుని మీడియా సహాయకుడు సూత్రీకరించడం విశేషం! ప్రస్తుత విమానాలు సురక్షితం కాదంటూ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుని కోసం రెండు కొత్త విమానాల కొనుగోలుకు చట్టసభ సభ్యులు గతంలోనే సిఫార్సు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళా డ్రగ్స్ స్మగ్లర్ మృతి వెనుక అంతుచిక్కని మిస్టరీ..
అది 1985, ఏప్రిల్ 22, నేషనల్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్(ఎన్ఎస్ఓ) 35 ఏళ్ల మహిళ గ్లోరియా ఒకాన్‌ను హెరాయిన్‌తో పాటు ఇతర హార్డ్ డ్రగ్స్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నందుకు నైజీరియాలోని అమీను కానో అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేసింది. ఆ సమయంలో ఆమె నుంచి 56.70 గ్రాముల మత్తు పదార్ధాలు, 301 డాలర్లు, 60 పౌండ్ల స్టెర్లింగ్, 20,000యెన్లు,19,000 ఇటాలియన్ లిరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో ఆమె నైజీరియా నుండి ఇంగ్లండ్‌కు వెళుతోంది. గ్లోరియా ఒకాన్ చేస్తున్న మత్తుమందుల రవాణాకు సంబంధించిన వార్తలు స్థానిక, అంతర్జాతీయ మీడియాలో సంచలనంగా మారాయి. నైజీరియన్లు ఆమె గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి చూపారు. ఎందుకంటే నాటి బుహారీ మిలిటరీ.. నిషేధిత డ్రగ్స్‌తో ఎవరైనా పట్టుబడితో మరణశిక్ష విధిస్తామని ప్రకటించింది. గ్లోరియా ఒకాన్‌ను అరెస్టు చేసిన ఆరు రోజుల తర్వాత అంటే 1985, ఏప్రిల్ 28న కస్టడీలో ఉన్న ఆమె వివాదాస్పద రీతిలో మరణించింది. ఆమె మృతికి ఫుడ్ పాయిజనింగ్ కారణమని మెడికల్ రిపోర్టు వెల్లడించింది. అరెస్టు చేసిన సమయంలో ఆమెలో అనారోగ్య సంకేతాలు లేవని దానిలో పేర్కొన్నారు. తొలగని అనుమానాలు.. గ్లోరియా ఒకాన్‌ను కస్టడీలో ఉంచిన కస్టమ్స్ అధికారి మాట్లాడుతూ ఆమెను అరెస్టు చేసిన రోజున, ఆమె రైస్, బీన్స్ అడిగిందని, ఆ తరువాత ఆమె అనారోగ్యానికి గురయ్యానని తెలిపిందన్నారు. ఆ తరువాత ఆమె మరణించిందని అన్నారు. అయితే ఆమె మరణానికి ముందు ఆమెను పోలీసులు విచారించారు. కానీ ఆమె మాట్లాడేందుకు నిరాకరించింది. అయితే ఆమె ఒక క్లూని మాత్రంవదిలి వెళ్లింది. బస్సీ అనే పేరును విచారణలో ఆమె ప్రస్తావించింది. కాగా గ్లోరియా ఒకాన్ బంధువులెవరూ ఆమె మృతదేహాన్ని క్లెయిమ్ చేయడానికి రాలేదు. అది మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. నాటి పాలకుడు బాబాంగిడా బుహారీని అధికారం నుండి తొలగించిన తర్వాత, గ్లోరియా ఒకాన్ కేసు దర్యాప్తును తిరిగితోడేందుకు నైజీరియన్ న్యాయవాది గని ఫవేహిన్మి సిద్ధమయ్యారు. అయితే గ్లోరియా ఒకాన్ కేసులో ఎటువంటి ముగింపు లేకపోవడంతో నైజీరియన్లలో అనేక ఊహాగానాలు చెలరేగాయి. Her mule, Gloria Okon was caught redhanded, reports claimed she was dead but infact she was secretly pardoned by Babangida, and Dele Giwa had proof of this, he even had a picture of this Gloria and Maryam Babangida in London, Chilling! pic.twitter.com/xs6muRlT48— Ronu Spirit (@ronuspirit) March 17, 2023 సాధారణ జీవితం గడుపుతూ.. గ్లోరియా ఒకాన్ నాటి నైజీరియన్ ఆర్మీ జనరల్ బాబాంగిడా కోసం పనిచేస్తున్నదని కొందరు భావించారు. అందుకే ఆమెను హత్య చేశారని అనుకున్నారు. గ్లోరియా ఒకాన్ మరణం అసహజమైనదని, ఆమె కుటుంబసభ్యులకు పంపిన మృతదేహం ఆమెది కాదని కొందరు వాదించారు. నైజీరియాలో అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఆమె సాధారణ జీవితాన్ని గడిపేదని కూడా అంటారు. జూన్ 2009లో నైజీరియన్ ప్రొఫెసర్ తైమివో ఒగునాడే ది నేషన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ “గ్లోరియా ఒకాన్ అసలు పేరు చిన్యెరే. ఆమె ఛార్లెస్ "జెఫ్" చాండ్లర్ను వివాహం చేసుకుంది. అతను న్జియోగ్వు హత్య జరిగిన మర్నాడు హతమయ్యాడు. కాగా చిన్యేరే, మరియమ్, ప్రిన్సెస్ అట్టా మొదలైనవారంతా స్నేహితులు. వారందరూ మిలిటరీలోని వారిని వివాహం చేసుకున్నారు. నాటి రోజుల్లో మిలటరీలో పనిచేసేవారిని ఎంతో గౌరవించేవారు. కేసు రీఓపెన్ అవుతుందా? ఇమో స్టేట్‌కు చెందిన టివ్... చిన్యెరేను వివాహం చేసుకున్నాడు. భర్త మరణంతో చిన్యెరే వితంతువుగా మారింది. అనంతరం ఆమె యూకే- నైజీరియా మధ్య డ్రగ్స్ వ్యాపారాన్ని ఆశ్రయించింది. ఆపై ఆమె డ్రగ్స్‌తో పట్టుబడింది. కానో నుండి లండన్‌కు వెళ్లే విమానంలో చిన్యేరేను ఎక్కించిన మమ్మన్ వత్సా ఆమె చనిపోయిందని పేర్కొన్నారు. ఈ నాటి వరకు గ్లోరియా ఒకాన్ అనుమానాస్పద మృతి కేసు మిస్టరీగానే మిగిలింది. మూసివేసిన ఈ కేసును తిరిగి తెరవడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు. కేసు రీఓపెన్ అవుతుందా? లేదా అనేది వేచిచూడాల్సిందే. He doesn't know the Gloria Okon Saga story small kids pic.twitter.com/2iDxIDcCBF— LUCA BRASI -5.0 The UnderBoss (@donortez) November 14, 2022 ఇది కూడా చదవండి: పళ్లను చూసి పెళ్లాడేస్తారు.. -
భర్త కబురు లేక కలవరం
కొలిక్కిరాని కిడ్నాప్ ఉదంతం రెండు రోజులపాటు నైజీరియా గవర్నమెంట్‌కు సెలవులు విశాఖపట్నం : రోజులు గడుస్తున్నా నైజీరియాలో కిడ్నాపైన విశాఖ ఇంజినీరు సాయిశ్రీనివాస్ జాడ కానరావడం లేదు. ఎనిమిది రోజులు గడిచినా కబురు లేకపోవడంతో కుటుంబ సభ్యులు కలవరపడుతున్నారు. ఇంట్లోని సెల్ మోగగానే చల్లని కబురు వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. తీరా శ్రీనివాస్ ఆచూకీ కోసం బంధువులు ఫోన్ చేశారని తెలిసి నీరశించిపోతున్నారు. పిల్లలు స్కూల్‌కు వెళ్లకుండా అమ్మతోనే ఉంటూ నాన్న కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీనివాస్ భార్య లలిత అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా కిడ్నాప్‌పై నైజీరియాలోని భారత హైకమిషన్ చేపడుతున్న చర్యలు తెలుసుకుంటున్నారు. నేడు, రేపు అంటూ కాలయాపన జరుగుతుందే తప్ప పురోగతి ఉండడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక కుటుంబ సభ్యులు దిగులు చెందుతున్నారు. మరో రెండు రోజుల తర్వాతే... రంజాన్ సందర్భంగా నైజీరియా గవర్నమెంట్‌కు రెండు రోజుల పాటు సెలవులు వచ్చాయని అక్కడి భారత హైకమిషన్ నుంచి సమాచారం వచ్చిందని శ్రీనివాస్ భార్య లలిత తెలిపారు. దీంతో మరో రెండు రోజుల తర్వాతే కిడ్నాప్ ఉదంతం కొలిక్కివచ్చే అవకాశం ఉంది. భారత హైకమిషన్ మాత్రం ఆందోళన చెంద వద్దని, సెలవుల అనంతరం కిడ్నాపర్ల చెర నుంచి సురక్షింతంగా శ్రీనివాస్‌ను విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారని, దీంతో ఆశగా ఎదురు చూస్తున్నామని లలిత చెబుతున్నారు.