breaking news
net ball
-
National games: తెలంగాణకు 2 కాంస్యాలు
డెహ్రాడూన్: జాతీయ క్రీడల్లో గురువారం తెలంగాణ రాష్ట్రానికి రెండు పతకాలు లభించాయి. నెట్‌బాల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో తెలంగాణ జట్టుకు కాంస్య పతకం దక్కగా... షూటింగ్ మిక్స్డ్ స్కీట్ టీమ్ ఈవెంట్లో బత్తుల మునేక్–రష్మీ రాథోడ్ జోడీ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.నెట్‌బాల్‌లో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య జరిగిన కాంస్య పతకం మ్యాచ్ 31–31 పాయింట్లతో ‘డ్రా’గా ముగిసింది. దాంతో రెండు జట్లకు కాంస్య పతకాలు ఖరారయ్యాయి. తెలంగాణ నెట్‌బాల్ జట్టు తరఫున బోడ విక్రమ్ రెడ్డి, అబ్దుల్ ఖాన్, అబ్దుల్ షరీఫ్, మొహమ్మద్ ఖాజాయుద్దీన్, శ్రవణ్ కుమార్, రఘునందన్, పులి రితిక రెడ్డి, గేయశ్రీ, శ్రుతి, గోపీ చంద్రిక, ముద్దం కీర్తన, సంహిత ప్రాతినిధ్యం వహించారు.షూటింగ్ మిక్స్డ్ స్కీట్ ఫైనల్లో ఆరు జోడీలు పోటీపడ్డాయి. 138 పాయింట్లతో ఇషాన్ సింగ్–రైజా ధిల్లాన్ (హరియాణా) జంట స్వర్ణం దక్కించుకోగా... భవతేజ్ సింగ్–గనీమత్ సెఖోన్ (పంజాబ్) ద్వయం రజతం సంపాదించింది. 133 పాయింట్లతో మునేక్–రష్మీ జంటకు కాంస్యం లభించింది. గురువారం పోటీలు ముగిశాక తెలంగాణ 18 పతకాలతో (3 స్వర్ణాలు, 3 రజతాలు, 12 కాంస్యాలు) 26వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ 14 పతకాలతో (7 స్వర్ణాలు, 1 రజతం, 6 కాంస్యాలు) 18వ స్థానంలో కొనసాగుతోంది. -
రేపటి నుంచి ఎస్జీఎఫ్ గేమ్స్
సాక్షి, హైదరాబాద్: అండర్-19 హైదరాబాద్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పోటీలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. నగరంలోని వివిధ వేదికల్లో మొత్తం 19 క్రీడాంశాల్లో బాలబాలికల విభాగాలలో ఈ పోటీలను నిర్వహిస్తారు. సెప్టెంబర్ 16: చెస్ జీజేసీ, కూకట్పల్లి సెప్టెంబర్ 16: టార్గెట్బాల్, ఎల్బీ స్టేడియం హ్యాండ్‌బాల్ పీజీ సెప్టెంబర్ 16: సైక్లింగ్, ఓయూ సైక్లింగ్ స్టేడియం సెప్టెంబర్ 16: వెయిట్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: పవర్ లిఫ్టింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: ఫెన్సింగ్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: జిమ్నాస్టిక్స్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: యోగా, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నికాయిట్, ఎల్బీ స్టేడియం సెప్టెంబర్ 16: టెన్నిస్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, ముషీరాబాద్ పీజీ సెప్టెంబర్ 16: బీచ్ వాలీబాల్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ సెప్టెంబర్ 17: స్విమ్మింగ్, జీహెచ్ఎంసీ, సికింద్రాబాద్ స్విమ్మింగ్‌పూల్ సెప్టెంబర్ 18: సాఫ్ట్ టెన్నిస్, ఇందిరాపార్క్ టెన్నిస్ కోర్ట్ సెప్టెంబర్ 18: సూపర్‌సెవెన్ క్రికెట్, భవన్స కాలేజ్, సైనిక్‌పురి సెప్టెంబర్ 19: బాస్కెట్‌బాల్, వీపీజీ జీహెచ్ఎంసీ, బాస్కెట్‌బాల్ కోర్ట్ సెప్టెంబర్ 20: ఫీల్డ్ ఆర్చరీ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స సెప్టెంబర్ 20: సెపక్తక్రా వీపీజీ, ఇండోర్ స్టేడియం సెప్టెంబర్ 22: నెట్‌బాల్, జీజేసీ, కాచిగూడ సెప్టెంబర్ 22: బేస్‌బాల్, జీసీపీఈ