-
‘భాగ్ రాహుల్ భాగ్’.. రాహుల్ గాంధీపై బీజేపీ సెటైర్లు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ నుంచి పోటీ చేయడంపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. దక్షిణాదిలో ఓటమి భయంతో రాహుల్ గాంధీ వాయనాడ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ మాట్లాడుతూ.. భాగ్ రాహుల్ భాగ్, రాహుల్ భాగ్ ఇదే ట్రెండ్ అవుతోంది. రాహుల్ గాంధీ మీరు ప్రధాని మోదీని చూసి బయపడొద్దని చమత్కరించారు. రాహుల్ గాంధీ చిన్న పిల్లాడు అతడిని ప్రోత్సహించాలి. కానీ ప్రజలు అతనిని తిరస్కరించారని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రాయ్‌బరేలీ నుంచి కూడా పోటీ చేయాలనే రాహుల్ నిర్ణయం వయనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ ద్రోహం చేశారని బీజేపీ నేత ఆరోపించారు. వాయనాడ్ ఓటమి భయంతో అమేథీకి బదులు రాయ్‌బరేలీ (ఎన్నికల్లో పోటీ చేసేందుకు) వచ్చారని దుష్యంత్ కుమార్ గౌతమ్ పేర్కొన్నారు.కాగా, గత రెండు దశాబ్దాలుగా తన తల్లి సోనియా గాంధీ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి రాహుల్ గాంధీ శుక్రవారం నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. -
కేసీఆర్‌పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
హైదరాబాద్, సాక్షి : మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకుంది. సిరిసిల్లలో గత నెలలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ తమపై, తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది.ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్‌పై చర్యలకు ఉపక్రమించింది. ఈరోజు(బుధవారం) రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా నిషేధం విధించింది. నిషేధ సమయంలో ఎలాంటి రోడ్‌షోలు, ఇంటర్వ్యూలు ఇవ్వొద్దని ఈసీ తన ఆదేశాల్లో పేర్కొంది. -
సుల్తాన్పూర్ లోక్‌సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ సుల్తాన్ పుర్ లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి క్రితికా జోత్నకు నామినేషన్ ప్రతాలు అందించారు. నామినేషన్ దాఖలు సమయంలో ఎన్డీఏ కూటమి పార్టీలు నిషాద్ పార్టీ అధ్యక్షుడు సంజయ్ నిషాద్, అప్నాదల్ నేత, కేబినెట్ మంత్రి అశిష్ పటేల్‌లు ఆమె వెంట ఉన్నారు.నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మేనకా గాంధీ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల చేసిన అభివృద్ది కంటే వచ్చే ఐదేళ్లలో మరిన్ని అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. లోక్‌సభ నియోజకవర్గాన్ని అభివృద్దిలో మరింత ముందుకు తీసుకెళ్లాలి. ఇక్కడి ప్రజలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద మరిన్ని ఇళ్లను అందించాలని కోరుకుంటున్నామని అన్నారు.ప్రతిపక్షాల ఆరోపణలపైబీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ ప్రతిపక్షాల ఆరోపణలపై మేనకా గాంధీ ఖండించారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్ బరేలీలో బీజేపీ నుంచి తన కుమారుడు వరుణ్ గాంధీ పోటీ చేస్తారన్న ఊహాగానాలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.వరుణ్ గాంధీకి నో టికెట్వరుణ్ గాంధీ ఇటీవల గతంలో ఎన్నడూ లేనివిధంగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో పిలిభిత్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ నిరాకరించింది. జితిన్ ప్రసాదకు అప్పగించింది.2009 లోక్‌సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీ తొలిసారిగా పిలిభిత్ నుంచి ఎంపీ అయ్యారు. 2014లో బీజేపీ ఆయనను సుల్తాన్పూర్ నుంచి బరిలోకి దిపింది. అక్కడ ఆయన గెలుపొందారు. మళ్లీ 2019లో మళ్లీ పిలిభిత్ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. -
రాయ్‌బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
కాంగ్రెస్‌కు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉత్తర్ ప్రదేశ్ రాయబరేలీ, అమోథీ లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల ఎంపికపై కొనసాగుతున్న ఉత్కంఠతకు కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటి (సీఈసీ) తెరదించింది.24 గంటల్లోగా ఆ రెండో స్థానాల అభ్యర్ధుల్ని ప్రకటిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున్ ఖర్గే, పార్టీ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ స్పష్టం చేశారు.అయితే నామినేషన్ల తుది గడువు మే 3 వరకు ఉండగా..మే 20న ఎన్నికలు జరగనున్నాయి. కానీ ఇప్పటి వరకు ఆయా లోక్‌సభ స్థానాల అభ్యర్ధులు ఖరారు చేయకపోవడంపై కాంగ్రెస్ అధిష్టానంపై రకరకాల ఊహాగానాలు తెరపైకి వచ్చాయి. ఈ తరుణంలో అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ పెద్దలు స్పష్టత ఇచ్చారు -
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాలుగు లోక్‌సభ స్థానాల అభ్యర్ధులను ప్రకటించింది.అయితే లోక్‌సభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు మూడు రోజులు సమయం ఉండడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకమైన అమేథీ, రాయ్‌బరేలీ నియోజకవర్గాల అభ్యర్ధుల ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతోంది.కాంగ్రెస్ మంగళవారం విడుదల చేసిన లోక్‌సభ స్థానాల అభ్యర్ధుల్లో గుర్గావ్ నియోజకవర్గం నుంచి రాజ్ బబ్బర్, హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా నియోజకవర్గం నుండి మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ ,హమీర్పూర్ నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే సత్పాల్ రైజాదాను పోటీకి దించింది. ముంబై నార్త్ నుంచి భూషణ్ పాటిల్‌ను ఖరారు చేసింది.హమీర్పూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ నేత, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇప్పటికే నాలుగుసార్లు గెలిచారు. అనురాగ్ ఠాకూర్ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ప్రేమ్ కుమార్ ధుమాల్ ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव 2024 के लिए हरियाणा, हिमाचल प्रदेश और महाराष्ट्र के कांग्रेस उम्मीदवारों की लिस्ट। pic.twitter.com/ys7tVzC61y— Congress (@INCIndia) April 30, 2024
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్‌కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్‌గా
గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్‌తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement