breaking news
launch new party
-
జన తెలంగాణ పార్టీ ఆవిర్భావం
హైదరాబాద్: జన తెలంగాణ పార్టీ (జేటీ పీ) పేరుతో ఓయూ విద్యార్థులు సోమవారం కొత్త పార్టీ స్థాపించారు. రాష్ట్రం ఏర్పడి ఐదేళ్లు గడిచినా ప్రజల జీవన విధానంలో ఎలాంటి మార్పు రానందున పార్టీని స్థాపించినట్లు జేటీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి కొర్వి బాలకృష్ణముదిరాజ్ వెల్లడించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు, నిరుద్యోగుల ఆధ్వర్యంలో పార్టీని స్థాపించినట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడి మన వారే పాలిస్తున్నా.. రైతులు నష్టపోతూనే ఉన్నారని, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు సన్న గిల్లుతున్నాయని పేర్కొన్నారు. మరోవైపు అసమానతలు పెంచేందుకు ప్రైవేట్ వర్సిటీల స్థాపనకూ రంగం సిద్దం చేశారన్నారు. నిరుద్యోగులకు ఉద్దేశపూర్వకంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను దూరం చేస్తున్నారని, రాష్ట్రంలో భూస్వామ్య వ్యవస్థకు పురుడు పోస్తూ ప్రజల్ని వెట్టి వైపు మళ్లించేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించారు. ఇలా అనేక అంశాలను చర్చించి కొత్త పార్టీని స్థాపించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యార్థులు, నిరుద్యో గులు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజానీ కాన్ని కలుపుకొని సాగుతామని బాలకృష్ణ వివరించారు. కార్యక్రమంలో జీటీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దగౌని సుదర్శన్, నాయకులు గోపికృష్ణ, శివ, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ పెట్టాలా? వద్దా ?
-
ఈ నెల 23 తర్వాత సీఎం కొత్త పార్టీ!
-
ఈ నెల 23 తర్వాత సీఎం కొత్త పార్టీ!
సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల 23 తర్వాత కొత్త పార్టీ పెట్టడం ఖాయమని ఉత్తరాంధ్రకు చెందిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుక్రవారం ఇక్కడ స్పష్టం చేశారు. ఈ మేరకు ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని తెలిపారు. గతేడాదే రిజిస్టర్ అయిన ఓ పార్టీ పేరుతోనే సీఎం పార్టీని ప్రారంభిస్తారన్నారు. కొత్తపార్టీ నమోదుకు గడువు లేకపోవడంతో ఇప్పటికే తనవెంట వచ్చే ఎమ్మెల్యేల సంఖ్యపై ఆయన కసరత్తు చేస్తున్నట్లు ఆ ఎమ్మెల్యే వివరించారు. తన వెంట వచ్చే ప్రతి ఎమ్మెల్యేకు ఎన్నికల ఖర్చు కింద కోట్లాది రూపాయిలు సమర్పించుకునేందుకు ఇప్పటికే సీఎం కిరణ్ సిద్ధమైయ్యారని చెప్పారు. తెలుగుదేశం పార్టీతో సీఎం పెట్టనున్న పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లడించారు. తన పేరు మాత్రం వెల్లడించవద్దంటు ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే విలేకర్లను కోరడం ఇక్కడ కొసమెరపు.


