breaking news
Ladies finger
-
మెట్ట ప్రాంతంలో లాభసాటిగా బెండకాయ సాగు..
-
15 ఏళ్లుగా బెండ సాగు.. నెలకు 50 వేలు లాభం
-
గుంటూరు కారం కథ తెలుసా అసలు.?
బంగాళాదుంప , మొక్క జొన్న , వేరుశెనగ , పైన్ ఆపిల్ , నారింజ , పొగాకు , బాదం , బెండకాయ , సపోటా , బొప్పాయి , మిరపకాయ , జీడిపప్పు, .. ఇవి లేని జీవితాన్ని ఊహించండి ! అంటే … మసాలా దోస , మిర్చి బజ్జి , వేరుశనిగ చట్నీ , బెండకాయ పులుసు , జీడీ పప్పు ఉప్మా … ఇవన్నీ ఉండవన్న మాటే కదా ! “ అహో ఆంధ్ర భోజా ! .. శ్రీకృష్ణ దేవా రాయా ! శిలలపై శిల్పాలు చెక్కించావు .. కానీ గుంటూరు కారం రుచి చూడలేదు .. ఉడిపి మసాలా దోస రుచి తెలియదు. ఏంటి ప్రభు? అని టైం మెషిన్ లో వెనక్కు వెళ్లి అడిగితే .." నేనేమి చేసేది మా కాలానికి ఈ పంటలు లేవు అంటాడు. ఎందుకంటే ఈ పంటలను , అటు పై పోర్చుగీస్ వారు, లాటినా అమెరికా దేశాలనుంచి సేకరించి మన దేశంలో ప్రవేశపెట్టారు. మరి ఆ రోజుల్లో మనాళ్ళు మసాలా దినుసులుగా ఏమి వాడేవారు? అల్లం , పసుపు , ఆవాలు , దాల్చిన చెక్క , ఏలకులు , లవంగాలు, ధనియాలు, ఇంగువ , మెంతులు ... ఇవన్నీ మన పంటలే . వీటిని మసాలా దినుసులుగా వాడేవారు ! అదండీ గుంటూరు కారం కథ ! కేవలం నాలుగు వందల సంవత్సరాల చరిత్ర . నల్ల మిరియాలు అనాదిగా ఇండియా లో పండించేవారు. దాన్ని పోర్చుగీస్ వారు ఎగుమతి చేసుకున్నారు. ఇప్పుడు రాజ్యమేలుతున్న ఎన్నో వంటకాలు మనవి కాదు, కానీ తొందరగానే మన జీవితాలను పెనవేసుకుపోయాయి. మార్పు సహజం .. కానీ కొత్తొక వింత కాదు . పాతొక రోత కాదు. ఏది మంచి ? ఏది చెడు అని- నా వక్తిగత అభిప్రాయం కాకుండా సామజిక శాస్త్రం - మానవ శాస్త్రం - జీవ శాస్త్రం కోణం నుంచి శాస్త్రీయ విశ్లేషణలు చేస్తున్నా. వాసిరెడ్డి అమర్ నాథ్, మానసిక శాస్త్ర విశ్లేషకులు, ప్రముఖ విద్యావేత్త -
వావ్! బెండర్‌ఫుల్
బెండకాయ ముదిరినా బ్రహ్మచారి ముదిరినా... అని సామెత బ్రహ్మచారి సంగతేమో కానీ... బెండకాయను మాత్రం లేతగా ఉండగానే వండాలి దీనిలో ఎ, బి, సి విటమిన్లు, పలు పోషకాలతోపాటు అయోడిన్ కూడా ఉండటం వల్ల అనేక వ్యాధులను దరిచేరనివ్వదు అన్నట్లు ఓపిక ఉండి వండాలేకానీ బెండతో రకరకాల వెరయిటీలు చెయ్యొచ్చు రుచి చూశారంటే బెండర్‌ఫుల్ అనాల్సిందే! బెండకాయ 65 కావలసినవి: అల్లం – చిన్న ముక్క; పచ్చిమిర్చి – 4; వెల్లుల్లి రెబ్బలు – 4; బెండకాయలు – అర కిలో; సెనగ పిండి – పావు కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; గరం మసాలా – అర టీ స్పూను; పచ్చి కొబ్బరి – పావు కప్పు. తయారీ: అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయలను శుభ్రంగా కడిగి ఆరబెట్టి తడి పూర్తిగా పోయాక చిన్న చిన్న ముక్కలుగా తరగాలి ఒక ప్లేటులో బెండకాయ ముక్కలు, సెనగ పిండి, బియ్యప్పిండి, జీలకర్ర పొడి, మిరప కారం, కొద్దిగా నీళ్ళు వేసి కలపాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక పల్లీలు వేసి డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచాలి అదే నూనెలో కరివేపాకు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి అదే నూనె మరోసారి కాగాక బెండకాయ ముక్కలను పకోడీలుగా వేసి, మీడియం మంట మీద సుమారు పావు గంట సేపు వేయించి దింపాలి గరం మసాలా, వేయించి ఉంచిన పల్లీలు , పచ్చి కొబ్బరి తురుము ఒకదాని తరవాత ఒకటి వేసి బాగా కలపాలి. బెండకాయ రైస్ కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఎండు కొబ్బరి – పావు కప్పు; పుట్నాల పప్పు – అర కప్పు; కారం – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత; పల్లీలు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; ఆవాలు – ఒక టీ స్పూన్; జీలకర్ర – ఒక టీ స్పూన్; పచ్చి సెనగ పప్పు; మినప్పప్పు – ఒక టీ స్పూన్; ఎండు మిర్చి – 3; పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెమ్మలు; నూనె – 4 టేబుల్ స్పూన్లు; అన్నం – పావు కేజీ బియ్యం ఉడికించాలి. తయారీ: మిక్సీలో ఎండు కొబ్బరి, పుట్నాల పప్పు, ఉప్పు, కారం, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా పొడి చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె కాగాక బెండకాయ ముక్కలు వేసి వేయించి, మూత ఉంచాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి, చిటికెడు ఉప్పు జత చేసి ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి అదే బాణలిలో పల్లీలు వేసి వేయించాలి ఆవాలు, జీలకర్ర, సెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి అన్నం జత చేయాలి పుట్నాల కారం జత చేసి అన్నీ కలిసే వరకు బాగా కలపాలి వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూడు నిమిషాల తరువాత దింపేయాలి. బెండకాయ మసాలా కర్రీ కావలసినవి: నూనె – 2 టేబుల్ స్పూన్లు; బెండకాయలు – పావు కిలో; జీలకర్ర – ఒక టీ స్పూన్; ఉల్లి తరుగు – పావు కప్పు; అల్లం వెల్లుల్లి ముద్ద ఒక టీ స్పూన్; పసుపు – కొద్దిగా; మిరప కారం – 2 టీ స్పూన్లు; జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్; ధనియాల పొడి – ఒక టీ స్పూన్; గరం మసాలా – అర టీ స్పూన్; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – పావు కప్పు; పెరుగు – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: బెండకాయలను శుభ్రంగా కడిగి తడి పోయే వరకు ఆరబెట్టాక పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, బెండకాయ ముక్కలు వేసి బాగా వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి అదే బాణలిలో జీలకర్ర వేసి కొద్దిగా వేగాక ఉల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి పసుపు, మిరపకారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి టొమాటో తరుగు జత చేసి, బాగా కలిపి మెత్తబడేవరకు ఉడికించాలి పెరుగు జత చేసి, కలియబెట్టి, కొద్దిసేపు మూత ఉంచాలి బెండకాయ ముక్కలు జత చేసి, ముక్కలకు మసాలా పట్టే వరకు మీడియం మంట మీద ఉడికించి, కొద్దిగా నీళ్ళు జత చేసి మరి కాసేపు ఉడికించాలి కొత్తిమీరతో అలంకరించి దింపేయాలి. స్టఫ్డ్ బెండకాయ ఫ్రై కావలసినవి: బెండకాయలు – పావు కేజీ; పల్లీలు – 100 గ్రా. (వేయించి పొట్టు తీసేయాలి); ఉప్పు – తగినంత; నూనె – 4 టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్; ధనియాలు – ఒక టేబుల్ స్పూన్; పచ్చి సెనగపప్పు – ఒక టేబుల్ స్పూన్; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూన్; నువ్వులు – ఒక టేబుల్ స్పూన్; ఎండు మిర్చి – 10; పసుపు – కొద్దిగా. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక సెనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి జీలకర్ర, ధనియాలు జత చేసి మరోమారు వేయించాలి నువ్వులు కూడా వేసి బాగా కలపాలి ∙ఎండుమిర్చి, వెల్లుల్లి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించి, మంట ఆపేయాలి పల్లీలు జత చేసి కలపాలి ∙బాగా చల్లారాక ఉప్పు, పసుపు జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి బెండకాయ తొడిమలు తీసేసి, పొడవునా ఒక వైపు చీల్చాలి ∙తయారు చేసిన మసాలా మిశ్రమాన్ని స్టఫ్ చేయాలి స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక స్టఫ్ చేసిన బెండ కాయలు వేసి వేయించాలి కొద్ది సేపటి తర్వాత మూత ఉంచి మీడియం మంటలో మగ్గనిచ్చి దింపేయాలి. బెండకాయ పులుసు కావలసినవి: బెండకాయ ముక్కలు – పావు కేజీ; ఉల్లి తరుగు – కప్పు; టొమాటో తరుగు – కప్పు; పచ్చిమిర్చి – 3; నూనె –3 టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర –కొద్దిగా; పసుపు – చిటికెడు; మిరప కారం – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; వేయించిన ధనియాల పొడి – ఒక టీ స్పూన్; ఎండు కొబ్బరి పొడి – ఒక టేబుల్ స్పూను; చింతపండు రసం – అర కప్పు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; అల్లం వెల్లుల్లి ముద్ద – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి పచ్చిమిర్చి, ఉల్లి తరుగు జత చేసి వేయించాలి అల్లం వెల్లుల్లి ముద్ద జతచేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి మూత ఉంచాలి ఒక గిన్నెలో టొమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా అయ్యేవరకు చేతితో బాగా కలపాలి చింతపండు రసం కూడా జత చేసి మరోసారి కలపాలి ఉల్లి తరుగు బంగారు రంగులోకి వచ్చాక కరివేపాకు జత చేయాలి కలిపి ఉంచుకున్న టొమాటో, చింతపండు రసం జత చేసి మూతపెట్టి, సన్నటి మంట మీద నాలుగు నిమిషాలు ఉడికించాలి బెండకాయ ముక్కలు జత చేసి కలపాలి రెండు కప్పుల నీళ్ళు జత చేసి, మూత ఉంచి, ఏడు నిమిషాలు మరగనివ్వాలి ఎండు కొబ్బరి పొడి, ధనియాల పొడి వేసి కలపాలి కొత్తిమీర జత చేసి, మరో ఐదు నిమిషాలు ఉడికించి దింపేయాలి. బెండకాయ టొమాటో కూర కావలసినవి: నూనె – 3 టేబుల్ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – ఒక రెమ్మ; ఎండు మిర్చి – 2; టొమాటో తరుగు – పావు కప్పు; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; బెండకాయలు – పావు కేజీ; మిరప కారం – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక, ఉల్లి తరుగు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేయించాలి టొమాటో తరుగు జత చేసి బాగా కలపాలి ∙ఉప్పు, పసుపు జత చేసి టొమాటో ముక్కలు కొద్దిగా మెత్తబడే వరకు మగ్గించాలి బెండకాయ ముక్కలు జత చేసి బాగా కలిపి, మూత ఉంచాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసి, మిరప కారం, ధనియాల పొడి వేసి రెండు నిమిషాలు కలపాలి కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి. -
ధర పతనం.. రైతుల దైన్యం
కొవ్వూరు రూరల్ : బెండకాయల ధర పతనం కావడంతో రైతులు అల్లాడుతున్నారు. కోత కూలి కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 10 కిలోలు కేవలం రూ. 50 మాత్రమే పలుకుతోంది. కొద్దిరోజులుగా ధర క్రమేపీ పతనమైంది. జిల్లాలో దాదాపు 4 వేల ఎకరాల్లో బెండ సాగులో ఉంది. కొవ్వూరు, పెరవలి, తాళ్లపూడి తదితర మండలాలతో పాటు మెట్ట, డెల్టా ప్రాంతాల్లో పలు చోట్ల సాగు చేస్తున్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో 500 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. పెళ్లిళ్ల సీజన్, శ్రావణమాసంలో కూరగాయల ధరలు పెరగాల్సి ఉండగా ప్రస్తుతం అందుకు విరుద్ధంగా ఉండడం గమనార్హం. కూలి ఖర్చులకూ దిక్కు లేదు ప్రస్తుతం బెండకాయల ధర చూస్తే కూలి ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఒక బస్తా (70 కేజీలు) బెండకాయలు కోయడానికి ఆడ కూలికి రూ.130, టిఫిన్‌కు రూ.15, రవాణా ఖర్చులు రూ.25, సంచి ఖర్చు రూ.15లు కలుపుకుంటే మొత్తం రూ.185 వరకూ ఖర్చవుతోంది. ఇవి గాక మూడు నెలల కాలానికి పొలం కౌలు రూ.10 వేలు, పంట సాగుకు మరో రూ.15 వేలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. ఒక కూలి వచ్చి రోజులో 50 కేజీల వరకూ బెండకాయలను కోస్తారు. ప్రస్తుతం ఉన్న ధరను బట్టి రైతుకు రూ.250 వరకూ ఆదాయం వస్తుంది. దీంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు గగ్గోలు పెడుతున్నారు. దీంతో కోత ఖర్చులు కూడా రాక పెట్టుబడులు కోల్పోతున్నామని వారు చెబుతున్నారు. నష్టాలు వస్తుండడంతో కొందరు రైతులు కాపు కాస్తున్నా బెండ పంటను తొలగిస్తున్నారు. ధర పతనం కావడంతో హోల్‌సేల్ మార్కెట్లో వ్యాపారులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదని రైతులు వాపోతున్నారు. తోటను తొలగించా బెండకాయల ధర గిట్టుబాటు కాకపోవడంతో తోటను తొలగించాను. సాగు ఖర్చులు నష్టపోయాను. 20 రోజులుగా ధర పతనం కొనసాగుతోంది. రోజూ కష్టపడి మార్కెట్‌కు తరలించినా నష్టాలు తప్పడం లేదు – కంటిపూడి శ్రీనివాస్, రైతు, నందమూరు రూ.50 కూడా రావడంలేదు బెండకాయలు ప్రతి రోజు తప్పనిసరిగా కోయాలి. లేదంటే చేలోనే ముదిరిపోయి పంట దెబ్బతింటుంది. తోటను కాపాడుకోవడానికి రోజూ కోస్తుంటే ధర లేక నష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం 10 కేజీలకు రూ.50 కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. – యండపల్లి రాంబాబు, రైతు, నందమూరు -
గర్భిణి బెండకాయ తింటే.. !
వెజ్ఫ్యాక్ట్స్ *బెండకాయలో... ఐరన్, క్యాల్షియం, పొటాషియం, సోడియం, కాపర్, మెగ్నీషియం, సిలీనియం, మాంగనీస్, జింక్ వంటి పోషకాలతోపాటు సి,ఎ, ఇ,కె విటమిన్లు ఉంటాయి. జీర్ణవ్యవస్థకు దోహదం చేసే పీచు కూడా ఉంటుంది. * బెండకాయ తింటే అధిక బరువు, కొలెస్ట్రాల్ తగ్గుతాయి. మధుమేహం ఉన్న వారు వారానికోసారయినా తింటే మంచిది. ఈ కూరగాయ... చర్మకాంతిని మెరుగుపరిచి, ఎముకలను శక్తిమంతం చేస్తుంది. * బెండకాయ కోలన్ క్యాన్సర్(పెద్దపేగు క్యాన్సర్), ఊపిరితిత్తుల క్యాన్సర్లను నివారిస్తుంది. దంత క్షయాన్ని కూడా నివారిస్తుంది. * గర్భవతిగా ఉన్నప్పుడు బెండకాయ తినడం వల్ల పిండం ఎదుగుదల బావుంటుంది. ఫోలేట్ అనే పోషకం సమృద్ధిగా అందడం వల్ల బిడ్డ మెదడు నిర్మాణం ఆరోగ్యకరంగా ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ నాడీవ్యవస్థ ఆరోగ్యకరంగా ఏర్పడడానికి దోహదం చేస్తుంది. గర్భధారణ జరిగిన నాలుగు నుంచి పన్నెండు వారాల లోపు ఈ పోషకాలు చాలా అవసరం. - ఉషశ్రీ, న్యూట్రిషనిస్ట్