-
లైంగిక ఆరోపణలు.. సహజమే అన్న మహిళా ప్యానెల్!
తిరువనంతపురం: కేరళా మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ ఎంసీ జోసెఫిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్పందిస్తూ మానవులు తప్పులు చేయడం సహజమేనని, ఓ రాజకీయ పార్టీలో ఉన్న కూడా అలాంటి తప్పులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. షోర్నూర్ ఎమ్మెల్యే అయిన పీకే శశిపై ఓ మహిళా నేత లైంగిక ఆరోపణలు చేశారు. అయితే ఈ కేసును నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులకు బాధిత మహిళలకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఓ లేఖ ద్వారా సూచించింది. దీనిపై మహిళా ప్యానెల్ స్పందిస్తూ.. సదరు మహిళా ఈ విషయంలో కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేదని, సుమోటోగా కేసు నమోదు చేద్దామన్నా ఫిర్యాదుకు సబంధించిన విషయాలు మీడియాలో రాలేదన్నారు. అలాంటప్పుడు ఎలా కేసు నమోదు చేస్తామని ప్రశ్నించారు. మార్క్సిస్ట్ పార్టీకి ఇలాంటి కేసులు విచారించడంలో సొంత ఎజెండా ఉంటుందన్నారు. మరోవైపు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. సదరు బాధిత మహిళ ఈ మెయిల్ ద్వారా సీపీఐ(ఎం) పొటిట్‌బ్యూరో అభ్యర్థి బృందా కారత్, జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరిలకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను నీరుగార్చేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలతో కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే శశి పేర్కొన్నారు. -
వాట్సాప్‌లో తలాఖ్
కొట్టయం: పెళ్లయిన పదిరోజులకే వాట్సాప్‌లో నవవధువుకు ‘తలాఖ్... తలాఖ్... తలాఖ్’ అంటూ మెసేజ్ పంపాడో ఎన్ఆర్ఐ. ఇంతటితో నీకూ నాకూ చెల్లు అన్నాడు. అవాక్కయిన వధువు కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. అలప్పుజ జిల్లాలోని చెర్తాలాకు చెందిన 21 ఏళ్ల యువతి బీడీఎస్ చదువుతోంది. బెర్ దుబాయ్‌లో ఉద్యోగం చేసే వ్యక్తితో ఆమెకు కిందటి నెలలో పెళ్లయింది. పదిరోజులు నవదంపతులు ఆనందంగా గడిపారు. ఉద్యోగానికంటూ దుబాయ్‌కి బయలుదేరాడు కొత్త పెళ్లికొడుకు. తర్వాత అతని నుంచి ఎలాంటి సమాచారమూ లేదు. భార్య ఎన్నోసార్లు ఫోన్ చేసింది. మెసేజ్‌లు పెట్టింది. చివరికి ఒకరోజు అతని నుంచి వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. ‘నువ్వెందుకు అదేపనిగా ఫోన్లు చేస్తున్నావు? నువ్వంటే ఇష్టం లేదు. నాకోసం వేచిచూడొద్దు. ఆపిల్ పండును ఇష్టపడ్డామనుకో... అంతమాత్రాన ప్రతిరోజూ దాన్నే తినలేం కదా. ఇతర ఫలాలనూ తినాలి కదా. తలాఖ్... తలాఖ్. తలాఖ్’ ఇదీ దాని సారాంశం. బాధితురాలు తమను ఆశ్రయించిందని మహిళా కమిషన్ సభ్యురాలు ప్రమీల తెలిపారు. అతని ఆచూకీ కనిపెట్టమని ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖను కోరామన్నారు. ఇలాంటి తలాఖ్‌లు చెల్లవని థంగల్ అనే ఇస్లామిక్ పండితుడు చెప్పాడన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
టీ20 వరల్డ్‌కప్‌కు స్కాట్లాండ్ జట్టు ప్రకటన..
పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. ఫోటోలు వైర్
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement