లైంగిక ఆరోపణలు.. సహజమే అన్న మహిళా ప్యానెల్‌!

Kerala Women's Panel Chief Says Mistakes Happen On MLA Accused Of Sex Abuse - Sakshi

తిరువనంతపురం: కేరళా మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ ఎంసీ జోసెఫిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక పార్టీ ఎమ్మెల్యేపై వచ్చిన లైంగిక ఆరోపణలపై స్పందిస్తూ మానవులు తప్పులు చేయడం సహజమేనని, ఓ రాజకీయ పార్టీలో ఉన్న కూడా అలాంటి తప్పులు జరుగుతాయని వ్యాఖ్యానించారు. షోర్నూర్‌ ఎమ్మెల్యే అయిన పీకే శశిపై ఓ మహిళా నేత లైంగిక ఆరోపణలు చేశారు.  అయితే ఈ కేసును నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని జాతీయ మహిళా కమిషన్‌ ఆదేశించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర డీజీపీ, పోలీస్‌ ఉన్నతాధికారులకు బాధిత మహిళలకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఓ లేఖ ద్వారా సూచించింది.

దీనిపై మహిళా ప్యానెల్‌ స్పందిస్తూ..  సదరు మహిళా ఈ విషయంలో కేరళ మహిళా కమిషన్‌ను ఆశ్రయించలేదని, సుమోటోగా కేసు నమోదు చేద్దామన్నా ఫిర్యాదుకు సబంధించిన విషయాలు మీడియాలో  రాలేదన్నారు. అలాంటప్పుడు ఎలా కేసు నమోదు చేస్తామని ప్రశ్నించారు. మార్క్సిస్ట్‌ పార్టీకి ఇలాంటి కేసులు విచారించడంలో సొంత ఎజెండా ఉంటుందన్నారు.  

మరోవైపు ఈ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో మహిళా కమిషన్‌ ప్రేక్షక పాత్ర పోషిస్తుందని విమర్శించారు. సదరు బాధిత మహిళ ఈ మెయిల్‌ ద్వారా సీపీఐ(ఎం) పొటిట్‌బ్యూరో అభ్యర్థి బృందా కారత్‌, జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరిలకు ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను నీరుగార్చేందుకు ఇలాంటి అసత్య ఆరోపణలతో కుట్ర చేస్తున్నారని ఎమ్మెల్యే శశి పేర్కొన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top