-
హైదరాబాద్‌పై కన్నేశారు.. జాగ్రత్త!
కరీంనగర్/ వేములవాడ: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలకు కాంగ్రెస్, బీజేపీ తెరలేపాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు ఆరోపించారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు ఆ రెండు పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్కు పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే వారి కుట్రలను ఛేదిస్తామని పేర్కొన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో, వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బూత్ లెవల్ కమిటీలతో కేటీఆర్ సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంచేలా ఒప్పందం జరిగింది. వచ్చే జూన్ 2తో ఆ గడువు ముగుస్తోంది. హైదరాబాద్‌పై కన్నేశారు.. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రె స్, బీజేపీలు హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటింపజేసేందుకు కుట్రలు మొ దలుపెడతాయి. అలా చేస్తే అడ్డుకునే శక్తి గులాబీ పార్టీకి మాత్రమే ఉంది. రాష్ట్రంలో బీఆర్ఎస్ను దెబ్బతీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయి. పరస్పరం సహకరించుకుంటూ.. బలహీనమైన అభ్యర్థులను బరిలో నిలిపాయి. రాష్ట్రంలో పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే తెలంగాణ ప్ర యోజనాలే లక్ష్యంగా ఆ రెండు పారీ్టల కుట్రలను ఛేదిస్తాం. దేశంలో 400 ఎంపీ సీట్లలో గెలిస్తే.. రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లను ఎత్తివేస్తా మని బీజేపీ నాయకులు ప్రగ ల్భాలు పలుకుతున్నారు. అలాంటి వాటిని కూ డా అడ్డుకునే శక్తి కూడా గులాబీ పారీ్టకే ఉంది.వారితో ఒరిగేదేమీ లేదు..2014 నుంచి కేంద్రంలో బడేభాయ్ మోదీ.. వంద రోజుల నుంచి రాష్ట్రంలో చోటే భాయ్ రేవంత్.. ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారు. గాలి మాటల సీఎం రేవంత్‌రెడ్డి, మాయమాటల ప్రధాని మోదీలతో తెలంగాణకు ఒరిగేదేమీ లేదు. రాష్ట్ర విభజన సమయంలో ఇచి్చన హామీలను మోదీ సర్కార్ అమలు చేయలేదు. హైదరాబాద్‌కు ప్రకటించిన ఐటీఐఆర్‌ను కూడా ఎత్తివేసింది. మోదీ పదేళ్ల పాలనలో ప్రజలకు తీరని ద్రోహం చేశారు. రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తామని.. వారి కష్టాలను మాత్రం డబుల్ చేశారు. 2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధరను ఇప్పుడు రూ.1,200కు పెంచారు.సామాన్యులపై పెను భారం పడుతోంది. జాతీయ రహదారుల కోసం సెస్ పేరిట రూ.30లక్షల కోట్లు వసూలు చేసి.. ఇందులో సగం రూ.14 లక్షల కోట్లు అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ రుణ ఎగవేతదారులకు అందించారు. యువతలో మతవిద్వేషాలు నింపి తప్పుదోవ పట్టిస్తున్నారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలు, యువత మరోసారి బీజేపీ మాయలో పడొద్దన్నారు. ఈ సమావేశాల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు కష్టమే: కేటీఆర్
సాక్షి,కరీంనగర్: బీజేపీకి మెజారిటీ ఇస్తే రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గోదావరి జలాలు మనకు అందక ముందే కిందకు పంపాలని బీజేపీ చూస్తోందన్నారు. నియోజకవర్గాలు పునర్విభజన చేసి మన నియోజకవర్గాలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తోందన్నారు. మానకొండూర్‌లో ఆదివారం(ఏప్రిల్27) నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడారు. ‘బండి ఒక్క పనైనా చేశావా చెప్పు...? బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోంది. 2014లో జన్ ధన్ ఖాతాల పేరిట బడాభాయ్ మోదీ మోసం చేశాడు. 2024లో ఆరు గ్యారెంటీల పేరుతో చోటేభాయ్ రేవంత్ మోసం చేశాడు. అలుగునూర్ చౌరస్తాలో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నిలబడితే గుర్తు పట్టేటోడు లేడు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో ప్రణాళిక లేకనే మనం ఓడిపోయాం. బండి సంజయ్ కు ఏమీ తెలవదు. ఏమీ తెలియదన్న విషయం కూడా ఆయనకు తెలియదు. దేవుళ్ళ పేరు చెప్పి ఓట్లు అడగడం తప్ప వేరే ఏమీ తెలియని వాడు బండి సంజయ్. ఇలాంటి బీజేపీ నాయకుణ్ణి ఓట్లతోనే తొక్కాలి. దేశానికి మోదీ ప్రధాన ద్రోహి. నిత్యావసర సరుకుల పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నాడు. రాష్ట్రాల నుంచి జీఎస్టీ రూపంలో 30 లక్షల కోట్లు వసూల్ చేశాడు. అదానీ కంపెనీ వాళ్లకు రూ. 15 లక్షల కోట్లు మాఫీ చేసిన మోదీ దేశ ద్రోహి. ఈడీ దాడులతో నాయకులను భయపెట్టుడం తప్ప ఏమీ చేయడు. మన కాలర్ ఎగిరేయాలంటే 10,12 ఎంపీ స్థానాలు గెలిపించాలి’ అని కేటీఆర్ కోరారు. -
నామినేషన్లకు 2 రోజులే.. ఇంకా సస్పెన్స్‌లో కాంగ్రెస్ పెండింగ్ సీట్లు
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల సమయంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అనిశ్చితి నెలకొంది. మరో రెండు రోజుల్లో నామినేషన్ల పర్వం ముగియనున్న నేపథ్యంలో ఖమ్మం, కరీంనగర్, సికింద్రాబాద్ అభ్యర్థుల ఎంపిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఖమ్మం అభ్యర్థి ఎంపికపై భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే బెంగుళూరులో సమావేశమయ్యారు. మరో వైపు, కరీంనగర్ అభ్యర్థిగా వెల్చాల రాజేందర్రావు నామినేషన్ వేయగా, పార్టీ ఆదేశించకుండా నామినేషన్ వేయడంపై ఆశావహుడు ప్రవీణ్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సికింద్రాబాద్ అభ్యర్థి విషయంలోనూ ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కేసీ వేణుగోపాల్ ఆదేశించారని.. లేని పక్షంలో అభ్యర్థిని మార్చే యోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. దానం నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. -
ఎకరాకు రూ.14 వేల బోనస్ ఎందుకివ్వడం లేదు?
కరీంనగర్ టౌన్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్ వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఎందుకివ్వడం లేదని బీజేపీ జాతీయ ప్రధా న కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. ఇచ్చిన హామీల మేరకు తాలు, తరుగు, తేమతో పనిలేకుండా వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో హుస్నాబాద్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్కు చెందిన తాజా, మాజీ సర్పంచులు పలువురు బీజేపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం సంజయ్ మాట్లాడు తూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో సర్పంచుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. మోదీ ప్రభు త్వం పంచాయతీలకు నిధులివ్వడంతోనే సిబ్బందికి జీతాలిస్తున్నారని తెలిపారు. దేశమంతా మోదీ గాలి వీస్తుందని, తొలివిడతలోనే 102 ఎంపీ స్థానాల్లో గెలవబోతున్నట్లు జోస్యం చెప్పారు. -
Ponnam Prabhakar: 14న కరీంనగర్లో దీక్ష చేస్తాం
సాక్షి, హైదరాబాద్: గత పదేళ్లుగా బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తూ ఈనెల 14న కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో దీక్ష చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రంలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో దీక్షలు చేస్తామని మంత్రి తెలిపారు. గాంధీభవన్‌లో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, టీపీసీసీ ఫిషర్మెన్ సెల్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్‌రెడ్డి, అధికార ప్రతినిధి కోట శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి పొన్నం మాట్లాడారు. గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయకుండా విభజన చట్టంలోని ఏ ఒక్క హామీని నెర వేర్చకుండా ఏ మొహం పెట్టు కుని బీజేపీ నేతలు లోక్‌సభ ఎన్నికల్లో ఓట్లడుగుతారని వారు ప్రశ్నించారు. దేశంలోని నవరత్నాల కంపెనీలను అమ్మే స్తున్న బీజేపీకి ఒక ఎజెండా లేదని, కేవలం రాము డుపేరిట అక్షింతలు, కుంకుమలను ప్రజలకిచ్చి ఓట్లడుగుతున్నారని మండిపడ్డారు. దళితులు, బీసీలు, మైనార్టీలకు బీజేపీ వ్యతిరేకమని చెప్పారు. తెలంగాణ ఉద్యమాన్ని, ఉద్యమంలో యువత బలిదానాలను బీజేపీ అవహేళన చేసిందని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. కేంద్రమంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి సికింద్రాబాద్‌కు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్య లకు బీజేపీనే కారణమని విమర్శించారు. కరీంనగర్ లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నది ఏఐసీసీ నిర్ణయిస్తుందని వెల్లడించారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎమ్మెల్యే కనకయ్యకు మంత్రి పరామర్శ
వడదెబ్బతో ముగ్గురు మృతి
భార్య హత్య కేసులో భర్తకు జీవితఖైదు
చికిత్స పొందుతున్న వ్యక్తి...
బీజేపీతోనే సుస్థిర పాలన
మద్యం స్వాధీనం
గిరిజనుల ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
మిత్రపక్ష పార్టీల కోఆర్డినేటర్లు వీరే...
హైదరాబాద్‌కు సుప్రీం బెంచ్ తెస్తాం
అకాల వర్షంతో ఆందోళన
తప్పక చదవండి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
Advertisement