-
Sensex : జీవితకాల గరిష్టానికి ఇన్వెస్టర్ల సంపద
ముంబై: స్టాక్ సూచీల నష్టాలు ఒకరోజుకు పరిమితమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు సోమవారం ఒక శాతానికి పైగా లాభపడ్డాయి. అంచనాలకు మించి క్యూ4 ఆర్థిక ఫలితాల ప్రకటనతో బ్యాంకులు, ఫైనాన్స్ రంగాల షేర్లలో భారీ కొనుగోళ్లు నెలకొన్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని సానుకూలతలు కలిసొచ్చాయి. క్రూడాయిల్ ధరలు దిగిరావడం, ఇరాన్– ఇజ్రాయెల్ ఉద్రికత్తలు తగ్గుముఖం పట్టడం, డాలర్ ఇండెక్స్ బలహీనత వంటి అంశాలు సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 941 పాయింట్లు పెరిగి 74,671 వద్ద నిలిచింది. నిఫ్టీ 223 పాయింట్లు బలపడి 22,643 వద్ద నిలిచింది. సెన్సెక్స్ పరుగుతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.2.48 లక్షల కోట్లు పెరిగి జీవితకాల గరిష్టం రూ.406 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ సూచీలోని 30 షేర్లలో హెచ్‌సీఎల్ టెక్(– 6%), ఐటీసీ (–0.44%), విప్రో(–0.37%), బజాజ్‌ఫిన్‌సర్వ్(–0.10%) మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు లాభాలతో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో స్థిరంగా ముందుకు కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 941 పాయింట్లు ఎగసి 74,671 వద్ద, నిఫ్టీ బలపడి 236 పాయింట్లు దూసుకెళ్లి 22,656 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. ఐటీ, ఆటో, రియల్టీ మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు వరుసగా 0.79%, 0.07% చొప్పున రాణించాయి. ఆల్‌టైం హైకి బ్యాంక్ నిఫ్టీ: ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, పీఎస్బీ షేర్లు ఇంట్రాడేలో ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో ట్రేడింగ్‌లో బ్యాంక్ నిఫ్టీ సైతం 49,474 వద్ద ఆల్ టైం హైని నమోదు చేసింది. చివరికి 1,223 పాయింట్ల లాభంతో 49,424 వద్ద ముగిసింది. మొత్తం ఈ సూచీలో 12 షేర్లలో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్(3.30%), బంధన్ బ్యాంక్(0.20%) మాత్రమే నష్టపోయాయి.ఐసీఐసీఐ బ్యాంక్ఃరూ.8 లక్షల కోట్లు క్యూ4లో నికర లాభం 18% వృద్ధితో ఐసీఐసీఐ బ్యాంకు షేరుకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో 4.5%పెరిగి రూ.1,159 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% ఎగిసి రూ.1,163 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. మార్కెట్ విలువ రూ.36,555 కోట్లు పెరిగి రూ.8 లక్షల కోట్లపైన రూ.8.14 లక్షల కోట్లకు చేరింది క్యాపిటలైజేషన్ పరంగా రూ.8 లక్షల కోట్లు దాటిన అయిదో కంపెనీగా నిలిచింది. -
‘దాడి చేస్తే.. ఇజ్రాయెల్‌ను నాశనం చేస్తాం’
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరోసారి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇజ్రాయెల్‌న హెచ్చరించారు. మూడు రోజుల పాకిస్తాన్ పర్యటనలో ఉన్న రైసీ మంగళవారం మాట్లాడుతూ.. ఇరాన్ భూభాగంపై దాడి తీవ్రమైన మార్పులకు దారి తీస్తుందన్నారు. ఇజ్రాయెల్ దాడులకు తెగపడితే.. పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందన్నారు రైసీ.‘పవిత్రమైన ఇరాన్ భూభాగంపై ఇజ్రాయెల్ దాడులకు దిగి తప్పు చేస్తే.. పరిస్థితి చేయిదాటి చాలా తీవ్ర అవుతుంది. ఇజ్రాయెల్‌లో ఏమైనా మిగులుతుందా అనేదిపై కూడా స్పష్టంగా ఉండదు’ అని రైసీ అన్నారు. సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇరాన్ ఏప్రిల్ 13న దాడి చేసిందన్నారు. ఇది అంతర్జాతీయ చట్టలకు వ్యతిరేకంగా ఉందని పేర్కొన్నారు. పాలస్తీనా ప్రజలను ఇరాన్, పాకిస్తాన్ దేశాలు రక్షిస్తాయన్నారు. అణచివేతకు గురవుతున్న పాలస్తీనాకు రక్షణ చర్యలు కొనిసాగుతాయని రైసీ స్పష్టం చేశారు.ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొసాగిస్తున్న దాడులు మానవహక్కుల ఉల్లంఘన అని తీవ్రంగా మండిపడ్డారు రైసీ. ఇప్పటివరకు దాదాపు 34 వేల మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. గాజాపై ఇజ్రాయెల్ చేస్తున్నదాడులను వ్యతిరేకిస్తు యూఎస్‌లో పలు ప్రతిష్టాత్మకమై విశ్వవిద్యాలయాల విద్యార్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
పాక్‌కు అమెరికా సాలిడ్ వార్నింగ్
ఇరాన్‌తో వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా పాకిస్తాన్‌ను హెచ్చరించింది. ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలను పరిగణలోకి తీసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని ఆలోచించాలని వార్నింగ్ ఇచ్చింది. అదే విధంగా పాకిస్తాన్ బాలిస్టిక్ మిసైల్ కార్యక్రమానికి వస్తువుల సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని యూఎస్ విదేశాంగ శాఖ డిప్యూటీ అధకార ప్రతినిధి వేదాంత్ పటేల్ హెచ్చరించారు.‘సామూహిక విధ్యంసక ఆయుధ సంస్థల విస్తరణలు ఎక్కడ జరిగినా వాటికి వ్యతిరేకంగా ఆంక్షలు విధిస్తాం. చర్యలు తీసుకోవటం కొనసాగిస్తాం. ముఖ్యంగా ఇరాన్‌తో వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆంక్షల ప్రమాదాన్ని పాకిస్తాన్ ఆలోచించుకోవాలి. చైనా.. పాకిస్తాన్ బాలిస్టిక్ క్షిపణీ కార్యక్రమానికి పరికరాలు, వస్తువులను సరాఫరా చేయటం మేము గమనించాం ’ అని వేదాంత్ పటేల్ అన్నారు.ఇరాన్ అధ్యక్షుడు పాక్ పర్యటన సందర్భంగా ఇరు దేశాలు మధ్య 8 వాణిజ్య ఇరుదేశాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇరు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, సాంస్కృతిక ఒప్పందాలు కుదుర్చుకోవటంలో చర్చలు కొనసాగుతున్నా పాక్ స్థానిక మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలో పాక్‌పై అమెరికా హెచ్చరికలు తీవ్ర చర్చనీయాశం అయింది. -
Israel-Iran tensions: ఇజ్రాయెల్ ప్రతీకార దాడి
దుబాయ్: ప్రతీకార దాడితో పశ్చిమాసియా మళ్లీ భగ్గున మండింది. తమ భూభాగంపై ఇరాన్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే ప్రకటించిన ఇజ్రాయెల్ అనుకున్నంత పని చేసి చూపించింది. తమ డ్రోన్లను రంగంలోకి దింపింది. అమెరికా తయారీ ఎఫ్–14 టామ్‌క్యాట్స్ యుద్ధవిమానాలు ఉన్న ఇరాన్‌లోని ఇస్ఫహాన్ సిటీ వైమానిక స్థావరం, అణు కార్యక్రమాల ప్రాంతం వద్ద శుక్రవారం ఉదయం భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. అయితే ఇస్ఫహాన్ నగర గగనతలంలో చక్కర్లు కొడుతున్న డ్రోన్లను కూల్చేశామని, దాడిని విజయవంతంగా అడ్డుకున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్‌పై దాడి పని ఇజ్రాయెల్దేనని అమెరికా సైన్యాధికారులు ప్రకటించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ 85వ పుట్టినరోజు జరుపుకుంటున్న శుక్రవారం రోజే ఇజ్రాయెల్ ఈ దాడులు చేయడం గమనార్హం. అణుకార్యక్రమాలు జరిగే ఆగ్నేయ జెర్డెంజన్ ప్రాంతంలో శత్రు విమానాలు, డ్రోన్లను నేలమట్టం చేసే అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థలను ఇరాన్ క్రియాశీలం చేసింది. ఈ అణుకేంద్రంలో చైనా సరఫరాచేసిన స్వల్పస్థాయి అణు పరిశోధనా రియాక్టర్లు ఉన్నాయి. పౌర అణు అవసరాల కోసం అణు ఇంథనాన్ని ఇక్కడ ఉత్పత్తిచేస్తారు. ఇదే నగరంలో భూగర్భ అణు శుద్ది కర్మాగారం ఉంది. దీనిని లక్ష్యంగా చేసుకునే ఇజ్రాయెల్ ఈ దాడి చేసి ఉంటుందని భావిస్తున్నారు. -
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు నిజమే: ఇటలీ
క్యాప్రి ఐలాండ్: పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఇరాన్లో శుక్రవారం(ఏప్రిల్ 19) సంభవించిన పేలుళ్లు ఇజ్రాయెల్ పనేనని అమెరికా చెబుతోంది. ఈ దాడులకు సంబంధించి ఇజ్రాయెల్ నుంచి తమకు చివరి నిమిషంలో సమాచారం అందిందని జీ7 దేశాలకు అమెరికా తెలిపింది. ఈ విషయాన్ని ఇటలీలోని క్యాప్రి ఐలాండ్‌లో జరుగుతున్న జీ7 మీటింగ్‌లో ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఆంటోనియో టజానీ తెలిపారు. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ నగరంలోని న్యూక్లియర్ స్థావరాల సమీపంలో పలు డ్రోన్లను కూల్చివేసినట్లు ఇరాన్ తెలిపింది. డ్రోన్ల కూల్చివేత కారణంగానే పేలుళ్ల శబ్దాలు వెలువడ్డాయని వెల్లడించింది. ఇటు ఇరాన్‌పై దాడుల సమయంలోనే అటు సిరియాపైనా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. కాగా, ఇటీవల ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులు చేసింది. అయితే ఈ డ్రోన్లు, మిసైళ్లను ఇజ్రాయెల్ కూల్చివేసింది. ఇరాన్ దాడుల వల్లే ఇజ్రాయెల్ ప్రతిదాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఫ్రాన్స్: ఇరాన్ కాన్సులేట్‌లో మానవ బాంబు కలకలం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
KKR vs MI: కేకేఆర్‌తో ముంబై కీలక పోరు.. తుది జట్లు ఇవే
జూనియర్ ఎన్టీఆర్‌ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
లోక్‌సభ ఎలక్షన్స్ 2024: మూడో దశ పోలింగ్ జరిగేది ఇక్కడే..
రాహుల్‌గాంధీపై అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు
ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలకు చల్లని కబురు
అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్
పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)
షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు
సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్‌తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
- రాయ్‌బరేలీ నుంచి తప్పుకున్న ప్రియాంక.. కారణం అదేనా?
- వేసవిలో ఉసిరి తినడం మంచిదేనా..?
Advertisement